Friday, December 28, 2012

కొత్త నోటిఫికేషన్లకు ఏపీపీఎస్సీ ఆమోదముద్ర

కొత్త నోటిఫికేషన్లకు ఏపీపీఎస్సీ ఆమోదముద్ర

జీవో నెం. 622, 623లకు లోబడే పరీక్షా విధానం

సర్కారు ఆదేశాలే ఫైనల్: రేచల్ చటర్జీ

ఆంధ్ర ప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) లో కొత్త నోటిఫికేషన్ల జారీకి లైన్ క్లియర్ అయ్యింది. దీంతో కొద్ది రోజులుగా జీవో నం.622, 623 ల అమలుపై ఏర్పడిన ప్రతిష్ఠంభనకు తెరదించుతూ.. మూడు కొత్త నోటిఫికేషన్ల విడుదలకు కమిషన్ ఆమోదముద్ర వేసింది. సంబంధిత ఫైళ్లపై గురువారం కమిషన్ సభ్యులందరూ సంతకాలు చేయటం గమనార్హం. గ్రూప్-2లోని ఎగ్జిక్యూటివ్ పోస్టులను గ్రూప్-1 (బి)లో చేర్చిన వ్యవహారంపై నిరుద్యోగుల్లో పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తమవడంతో.. ఆ యా జీవోల అమలుకు సంబంధించిన ఫైళ్లపై సభ్యులు తమ అభిప్రాయాలను వెల్లడించారు.

కమిషన్‌లో ఆమోదం తర్వాతే ఆయా జీవోలను అమలు చేయాలని కోరారు. అయితే ఏపీపీఎస్సీలో తాజా పరిణామాల నేపధ్యంలో ఆ ఫైల్‌పై సభ్యుల అభిప్రాయాలు అవసరం లేదని, ప్రభుత్వ ఉత్తర్వులే ఫైనల్ అని రేచల్ ఛటర్జీ ఫైల్‌లో రాయటంతో ఇక చేసేది లేక సభ్యులందరూ గురువారం సంతకాలు చేశారు. దీంతో జీవో 622, 623లకు అనుగుణంగా కొత్త నోటిఫికేషన్ల జారీకి ఏపీపీఎస్సీ పచ్చజెండా ఊపినట్లయ్యింది. డిపార్ట్‌మెంటల్ పరీక్షల ఫలితాల విడుదలకూ మార్గం సుగమమైంది.

1 comment:

  1. hi sreekanth,

    can you please share what are the three notifications highlighted above? is it GRp ones? or specific jobs?

    tnks,
    sam

    ReplyDelete