ఎపిపిఎస్సి ఏకపక్ష నిర్ణయాలు తీసుకుందంటూ కొందరు సభ్యులు చేసిన ఫిర్యాదు పై విచారణ జరిపిన లోకాయుక్త అందులో తాము జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పింది. చైర్ పర్సన్ పై కానీ, సభ్యులపై కానీ విచారణ జరిపే పరిధి తమకు లేదని స్పష్టం చేసింది. కొన్ని పోస్టులకు ఇంటర్వ్యులను రద్దు చేయడం తగదని, తమ ప్రమేయం లేకుండానే నిర్ణయాలు తీసుకుంటున్నారంటూ సభ్యులు ఎండి. నౌమాన్, రవీంద్ర రావు, ఎం.పోచయ్య, జి.పద్దయ్య, రిపుంజయ రెడ్డి, జి.చంద్రశేఖర్ లు ఇటివల లోకాయుక్త కూ ఫిర్యాదు చేశారు. కమిషన్ చైర్ పర్సన్, కార్యదర్శిల చర్యలను వారు ప్రశ్నించారు. దీనిపై లోకాయుక్త ఎపిపిఎస్సి వివరణ కోరింది. వీటన్నింటిని పరిశీలన మేరకు నియామకల్లోని లోపాలపై విచారణ కమిటి ఆదేశాలమేరకు ప్రభుత్వం జీవో నెం.420ను జారీ చేయడాన్ని ప్రస్తావిస్తూ ఇక దీనికి సంబంధించి అదనంగా తామేమీ పరిశీలించాల్సిన అవసరంలేదని తెలిపింది. కార్యదర్శి పై చర్యలు తీసుకోవాలన్న ఫిర్యాదుదారుల విజ్ఞప్తిని కూడా తోసిపుచ్చింది. కమిషన్ చైర్ పర్సన్ తీసుకున్న నిర్ణయాల ప్రకారమే అన్ని జరుగుతుంటాయని తెలిపింది. స్వతంత్రంగా ఎలాంటి నిర్ణయాలను తీసుకోలేరని పేర్కొంది. ఇక దీనిపై విచారణను ముగిస్తూ మంగళవారం లోకాయుక్త జస్టిస్ బి.సుభాషణ్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిసింది.
No comments:
Post a Comment