Sunday, December 30, 2012

601 ఉద్యోగాల భర్తీకి ఏపీపీఎస్సీ ప్రకటన

601 ఉద్యోగాల భర్తీకి ఏపీపీఎస్సీ ప్రకటనఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలోని వివిధ శాఖల్లోని 601 ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ నియామక సంస్థ (ఏపీపీఎస్సీ) ఎట్టకేలకు శనివారం ప్రకటన (నోటిఫికేషన్‌) జారీ చేసింది. సీఆర్‌ బిస్వాల్‌ సంఘం నూతన ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం వెలువడిన మొట్టమొదటి ప్రకటన ఇదే. వచ్చే నెల నుంచి దరఖాస్తులను స్వీకరించి మేలో పరీక్షలు నిర్వహించాలని ఏపీపీఎస్సీ నిర్ణయించింది.రవాణా సబార్డినేటు సర్వీసులో 64 సహాయ మోటారు వాహన ఇన్‌స్పెక్టరు పోస్టులకు వచ్చే నెల 22 నుంచి ఫిబ్రవరి 21 వరకు దరఖాస్తు చేసుకోవాలి. పరీక్షలు మే 26న జరుగుతాయి.కళాశాల విద్యాశాఖలో 12 మంది వ్యాయామ సంచాలకులు, 21 మంది గ్రంథపాలకుల పోస్టులకు జనవరి 21 నుంచి ఫిబ్రవరి 23 వరకు దరఖాస్తులు చేసుకోవాలి. మే అయిదో తేదీన పరీక్ష నిర్వహిస్తారు.గ్రామీణ నీటిసరఫరా శాఖ సబార్డినేటు సర్వీసులో 362 సహాయ ఇంజినీర్‌ పోస్టులకు వచ్చే నెల 29 నుంచి ఫిబ్రవరి 28 వరకు దరఖాస్తు చేసుకోవాలి. 

మే 26న పరీక్ష నిర్వహిస్తారు.స్త్రీశిశు సంక్షేమ శాఖలో 107 సీడీపీవో పోస్టులకు వచ్చే నెల 22 నుంచి ఫిబ్రవరి 21 వరకు దరఖాస్తులు స్వీకరించి, మే అయిదో తేదీన పరీక్ష జరుపుతారు.ఇంజినీరింగు శాఖలోని సహాయ పరిశోధన అధికారి పోస్టులు 6, పరిశోధక సహాయకుడి పోస్టులు 17, ఇంజినీరింగేతర విభాగంలో మరో పరిశోధక సహాయకుని పోస్టులకు వచ్చే ఫిబ్రవరి అయిదో తేదీ నుంచి మార్చినాలుగో తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. వీరికి మే నెల 5,9,5 తేదీల్లో పరీక్షలు నిర్వహిస్తారు. ఇంజినీరింగు శాఖలో 10 పరిశీలక పోస్టులు, ఇంజినీరింగేతర విభాగంలో ఒక పోస్టులు ఫిబ్రవరి ఎనిమిదో తేదీ నుంచి మార్చి ఏడో తేదీ వరకు దరఖాస్తులను స్వీకరించి మే 23, 26 తేదీల్లో పరీక్షలు జరుపుతారు.వాహన ఇన్‌స్పెక్టరు పోస్టులకు 21 నుంచి 34 ఏళ్ల వయోపరిమితిని నిర్దేశించారు. మిగిలిన పోస్టులకు 18 నుంచి 34 ఏళ్ల వయస్సు గలవారు దరఖాస్తు చేసుకోవాలి. పూర్తి వివరాల కోసం తమ వెబ్‌సైట్‌ను సందర్శించాలని ఏపీపీఎస్సీ కార్యదర్శి కోరారు.

Click Here

No comments:

Post a Comment