లక్షలమంది నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుకుంటున్న ఆంధ్రప్రదేశ్ పబ్లిక్‌సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) సభ్యులను తొలగించడమే (అభిశంసించడం) మేలన్న నిర్ణయానికి రాష్ట్ర ప్రభుత్వం వచ్చిందని అత్యంత విశ్వనీయ వర్గాలు తెలిపాయి. వీరి తొలగింపునకు సంబంధించి శుక్రవారమే న్యాయనిపుణుల అభిప్రాయాలను తీసుకున్నట్లు సమాచారం. ఏపీపీఎస్సీ సభ్యుల వ్యవహార శైలిపై రెండు రోజులుగా 'ఈనాడు' వెలుగులోకి తెచ్చిన కథనాలు సంచలనం సృష్టించాయి. ఈ కథనాల నేపథ్యంలో రాష్ట్రంలో లక్షల మంది నిరుద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారం నిరుద్యోగ యువత ఆశలకు సంబంధించింది కావడంతో ప్రభుత్వం దీనిపై తీవ్రంగా స్పందించింది. ఏపీపీఎస్సీలో ఏమి జరుగుతోందన్న దానిపై శుక్రవారం ఉన్నతస్థాయి వర్గాల ద్వారా నివేదిక తెప్పించుకుందని సమాచారం. కొందరు సభ్యుల వ్యవహార శైలి ఏమాత్రం సంతృప్తికరంగా లేదన్న నిర్ణయానికి వచ్చింది. కొందరు సభ్యుల తీరు రాజ్యాంగ సంస్థ పరువు తీసేలా ఉందని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి.
ఏపీపీఎస్సీ నిర్వహించే కొన్ని పరీక్షలకు మౌఖిక పరీక్షను నిలుపు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం 420 జీవోను జారీ చేసింది. ఆ పరీక్షలకు మౌఖిక పరీక్ష లేకుండానే రాత పరీక్ష ఆధారంగా భర్తీ చేయొచ్చు. దీన్ని కమిషన్‌కు చెందిన ఆరుగురు సభ్యులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ జీవో జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వాన్నే దాదాపు నిలదీసినంత పనిచేశారు. జీవోపై ముఖ్యమంత్రికి కొందరు సభ్యులు లేఖ రాశారు. ఆ లేఖలో వారు ప్రస్తావించిన అంశాలు చాలా దారుణంగా ఉన్నాయని అధికారులు అభిప్రాయానికి వచ్చారు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తెచ్చారు. గత ఏడాది కాలంగా దాదాపు ఐదు వేల ఖాళీలను భర్తీ చేయాల్సి ఉండగా కమిషన్ సభ్యులు అడ్డుచెప్పడంతో ఆ ప్రక్రియ నిల్చిపోయింది. దీంతో పరీక్షలు రాసిన పదిలక్షలమంది అభ్యర్థుల భవిష్యత్తు త్రిశంకు స్వర్గంలో ఉండిపోయింది. సభ్యుల తీరుపై వందల మంది నిరుద్యోగులు అటు ప్రభుత్వానికి ఇటు ముఖ్యమంత్రికి కూడా పెద్దఎత్తున ఫిర్యాదు చేశారు.కొన్ని నియామకాలకు సంబంధించి దస్త్రాలను కొన్ని నెలలపాటు కొంతమంది సభ్యులు దాచిపెట్టడం కూడా ప్రభుత్వం దృష్టికి వచ్చింది. పరిస్థితి ఇలానే ఉంటే మొత్తం ప్రభావం నిరుద్యోగులపై పడుతుందన్న నిర్ణయానికి సర్కార్ వచ్చింది. తక్షణం సంబంధిత సభ్యులను తొలగించకపోతే ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందన్న భావనకు వచ్చింది. కమిషన్ సభ్యుల తొలగింపు కష్టసాధ్యమైన విషయం కాబట్టి దీనిపై శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం ఉన్నతస్థాయి న్యాయనిపుణులతో సంప్రదింపులు జరిపి నివేదికను తీసుకున్నట్లు చెబుతున్నారు. ముందుగా సంబంధిత సభ్యులపై రాష్ట్ర గవర్నర్ ద్వారా రాష్ట్రపతికి ఫిర్యాదు చేయాలన్న నిర్ణయానికి ప్రభుత్వం వచ్చినట్లు తెలిసింది. రాష్ట్రపతికి అందిన ఫిర్యాదు సుప్రీం కోర్టుకు చేరిన తరువాత దీనిపై విచారణ జరుగుతుంది. అక్కడ విచారణ పూర్తయిన తరువాత సభ్యులను తొలగిస్తారు. ఈ లోపు వారిని పదవుల నుంచి సస్పెండ్ చేసే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి.

No comments:
Post a Comment