Saturday, December 22, 2012

ఏపీపీఎస్సీలో ప్రభుత్వ జోక్యాన్ని ఆపండి

ఏపీపీఎస్సీలో ప్రభుత్వ జోక్యాన్ని ఆపండి

- సలహాలకే పరిమితమయ్యేలా ఆదేశాలు ఇవ్వండి

- హైకోర్టులో ఎపీపీఎస్సీ సభ్యుల పిటిషన్

- పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన హైకోర్టు

- మూడు వారాల్లో వివరణ ఇవ్వాలని ఆదేశాలు

హైదరాబాద్, డిసెంబర్ 21 (టీ మీడియా): ఆంధ్రవూపదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) వ్యవహారాల్లో జోక్యం చేసుకోకుండా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీచేయాలంటూ హైకోర్టులో వ్యాజ్యం దాఖలైంది. ఏపీపీఎస్సీ చైర్మన్ రేటల్ ఛటర్జీ, కార్యదర్శి పూనం మాలకొండయ్యల కన్నుసన్నల్లోనే కమిషన్ పాలన వ్యవహారాలు జరిగేలా చూడాలని ఏపీపీఎస్సీ సభ్యులు డాక్టర్ మహ్మద్ నౌమాన్, గంగిశెట్టి పద్దయ్య, పీ రవీందర్‌రావు, ఎం పోచయ్య, కే రూపాంజనేయడ్డి, గుబ్బా చంద్రశేఖర్‌లు పిటిషన్ దాఖలు చేశారు. కమిషన్‌పై రాష్ట్ర ప్రభుత్వం అజామాయిషీ చేయవద్దంటూ కోరారు. ప్రభుత్వం కేవలం సూచనలకు పరిమితం కావాలన్నారు.

ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా కాకుండా, కమిషన్ వ్యవహారాలు స్వతంవూతంగా నిర్వహించేలా చైర్మన్ రేచల్ చటర్జీకి ఆదేశాలు జారీ చేయాలని సభ్యులు కోర్టును అభ్యర్థించారు. రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శిలా వ్యవహరిస్తున్న పూనం మాలకొండయ్యను కమిషన్ కార్యదర్శిగా విధులను నిర్వర్తించేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్‌లో పేర్కొన్నారు.ఏపీపీఎస్సీ కార్యదర్శి కేవలం కమిషన్‌లో ఒక ఉద్యోగి అని నిబంధనల్లో పేర్కొన్నా ప్రస్తుత కార్యదర్శి కమిషన్‌ను పక్కనబెడుతున్నారని తెలిపారు. చైర్మన్, కార్యదర్శులు ఇద్దరు స్వతంత్ర ప్రతిపత్తి కల్గిన ఏపీపీయస్సీ కమిషన్‌లో నియామకం జరిగినా వారు ప్రభుత్వ కార్యదర్శుల హోదాలో కొనసాగుతున్నారన్నారు.

ఏపీపీఎస్సీ ద్వారా నియామకం చేపట్టే ఉద్యోగాలకు ఇంటర్వ్యూ బోర్డుల ఏర్పాటు, నిర్వహణ తదితర విషయాల్లో కమిషన్ సిఫార్సులను ప్రభుత్వం పరిగణలోనికి తీసుకోవాల్సి ఉందన్నారు. అందుకు విరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం ఐదు కేటగీరీలు (డీఎస్పీ (కమ్యూనికేషన్), అటవీశాఖ సహాయ కన్జర్వేటర్, డిగ్రీ, జూనియర్, పాలిటెక్నిక్ కాలేజీల లెక్చరర్ల పోస్టులు) మినహా మిగితా పోస్టులకు ఇంటర్వ్యూలను రద్దుచేస్తూ ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ సూచనలను ఏపీపీఎస్సీకి రెగ్యుపూషన్ 14-ఎ ప్రకారం ఇవ్వాలని, కానీ ప్రభుత్వం పూర్తిగా కమిషన్ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటుందని వివరించారు.

కార్యదర్శి పూనం మాలకొండయ్య సహకారంతో చైర్మన్ రేచల్ ఛటర్జీ కమిషన్ వ్యవహారాలను పూర్తిగా తన ఆదుపు, ఆజ్ఞల్లోకి తీసుకొని సభ్యులను కేవలం సంఖ్యబలంగానే మార్చరని నివేదించారు. ఇంటర్వ్యూల రద్దు వ్యవహారంపై తాము స్పందించడం లేదని, కమిషన్‌కు ఆర్టికల్ 315, 320 ప్రకారం రాజ్యాంగం కల్పించిన స్వతంత్ర ప్రతిపత్తి కోల్పొతుందనే కారణంతో కోర్టును ఆశ్రయించినట్లు పేర్కొన్నారు. ఆరుగురు సభ్యుల తరపున పద్దయ్య పిటిషన్‌పై సంతకం చేశారు. రాష్ట్రవూపభుత్వ సాధరణ పరిపాలనా శాఖ ముఖ్యకార్యదర్శి, రేచల్ చటర్జీ, పూనం మాలకొండయ్య, ఏపీపీఎస్సీలను ప్రతివాదులుగా పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై హైకోర్టు శుక్రవారం విచారణ చేపట్టింది మూడు వారాల్లోగా వివరణను ఇవ్వాలంటూ ప్రతివాదులకు నోటీసులు జారీచేస్తూ తదుపరి విచారణను వాయిదా వేసింది.

No comments:

Post a Comment