గ్రూప్ 2 ఎగ్జిక్యూటివ్ పోస్టులు గ్రూప్ 1బిలోకి మార్పు
ఇక గ్రూపు 2లో నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు మాత్రమే
ఏపీపీఎస్సీ సంస్కరణల్లో భాగంగా ఖాళీలను నోటిఫై చేసేందుకు వార్షిక క్యాలెండర్‌ను పాటించే నూతన విధానాన్ని అమలులోకి తెస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత విధానంలో సెప్టెంబర్ 1 నుంచి ఆగస్టు 31 వరకు ఖాళీ అయ్యే ఉద్యోగాలను యూనిట్ అధికారులు గుర్తించేవారు. తరువాత ఆర్థిక శాఖ క్లియరెన్స్‌కు పంపేవారు. ఆర్థిక శాఖ ఏపీపీఎస్సీకి గానీ, ఇతర నియామక సంస్థలకు గానీ నోటిఫికేషన్ విడుదల చేయాలని సూచించేది. ఈ ప్రక్రియలో అసాధారణ జాప్యం చోటుచేసుకుంటుండడం తో దీన్ని సంస్కరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందు కు వార్షిక క్యాలెండర్ పద్ధతి అనుసరించనున్నట్లు పేర్కొంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మిన్నీ మాథ్యూ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. అన్ని శాఖలు, ఏపీపీఎస్సీ ఇందుకు అనుగుణంగా చర్యలు చేపట్టాలని అందులో స్పష్టం చేశారు. గ్రూపు-1 పోస్టులను ఇకపై గ్రూపు-1ఎగా, గ్రూపు-2లోని ఎగ్జిక్యూటివ్ పోస్టులను గ్రూపు-2బిగా, గ్రూపు-2లోని నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులను గ్రూపు-2 పోస్టులుగా పరిగణించాలని మరో ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. అలాగే ఏయే పోస్టులకు మౌఖిక పరీక్షలు ఉండాలనే విషయాన్నీ పేర్కొన్నారు.
ఇదీ నూతన వార్షిక క్యాలెండర్...
అన్ని ప్రభుత్వశాఖల అధిపతులు తమ శాఖల్లో రాబోయే ఆర్థిక సంవత్సరంలో ఏర్పడే ఖాళీల వివరాలను నవంబర్ 30లోపు సాధారణ పరిపాలన శాఖకు సమర్పించాలి. ఈ ఏడాది మాత్రం ఈనెల 27లోపు సమర్పించాలి.
సచివాలయంలోని పరిపాలన విభాగం వివరాలను పరిశీ లించి వారం రోజుల్లో ఆర్థిక శాఖకు సిఫారసులు పంపాలి.
ఆర్థిక శాఖ ఆయా ప్రతిపాదనలను పరిశీలించి ఖాళీల భర్తీకి జనవరి 31లోపు క్లియరెన్స్ ఇవ్వాలి.
శాఖాధిపతులు ఫిబ్రవరి 28లోపు ఖాళీల వివరాలు ఏపీపీఎస్సీకి పంపాలి.
నియామకాల క్యాలెండర్‌ను మార్చి 31లోపు ఏపీపీఎస్సీ ఆమోదిస్తుంది. ఆ తరువాత నోటిఫికేషన్లు జారీ చేస్తుంది.
గ్రూప్-1, గ్రూప్-2 పోస్టుల పునర్విభజన..
పరీక్ష ప్రమాణాలను బట్టి ఇప్పటివరకు ఉద్యోగాలను గ్రూప్-1, గ్రూప్-2, గ్రూపు-4 సర్వీసెస్‌గా పేర్కొనేవారు. అవసరమైన పోస్టులకు మౌఖిక పరీక్షలు నిర్వహించేవారు. 1997 సంవత్సరంలో 20 కేటగిరీలను గ్రూప్-1లో చేర్చారు. 1999లో గ్రూప్-2ఎ, గ్రూప్-2బి కింద ఉన్న కేటగిరీలన్నింటినీ గ్రూప్-2 పోస్టులుగా మార్చారు. 2011 జూలై 27న జారీ చేసిన జీవో 420 ద్వారా గ్రూప్-1 మినహా మిగిలిన పోస్టులకు మౌఖిక పరీక్షలు మినహాయించారు. అయితే తాజా సంస్కరణల్లో భాగంగా ఇన్నాళ్లు గ్రూపు-1గా పేర్కొన్న పోస్టులను గ్రూపు-1ఎగా పరిగణిస్తారు. గ్రూప్-2లోని ఎగ్జిక్యూటివ్ పోస్టులను గ్రూప్-1బిగా పరిగణిస్తారు. ఈ 2 కేటగిరీలకు ఒకే విధమైన పరీక్ష ఉంటుంది. గ్రూప్-2లోని ఎగ్జిక్యూటివ్ పోస్టులు ప్రాధాన్యమైనవే కాకుండా గ్రూప్-1కు మాదిరిగానే డిగ్రీ అర్హతతో పరీక్ష రాసేవి. ఈ ఉద్యోగాలకు ప్రజా సంబంధాల నైపుణ్యాలు అవసరం. అందుకే వీటిని గ్రూప్-1బి సర్వీసుగా పరిగణించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు 1967లో జారీ చేసిన జీవో 103ను సవరిస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. దీని ప్రకారం....
గ్రూప్ 1 (ఎ) పోస్టులు..
1. డిప్యూటీ కలెక్టర్ (ఏపీ సివిల్ సర్వీసెస్-ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్), 2. డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్-కేటగిరీ2(ఏపీ పోలీస్ సర్వీసు), 3. కమర్షియల్ టాక్స్ ఆఫీసర్(ఏపీ కమర్షియల్ టాక్స్ సర్వీసెస్), 4. రీజినల్ ట్రాన్స్‌పోర్ట్ ఆఫీసర్(ఏపీ ట్రాన్స్‌పోర్ట్ సర్వీసు), 5. డిప్యూటీ రిజిస్ట్రార్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్(ఏపీ కోఆపరేటివ్ సర్వీసెస్), 6. జిలా పంచాయతీ అధికారి(ఏపీ పంచాయత్ సర్వీసెస్), 7. జిల్లా రిజిస్ట్రార్లు(ఏపీ రిజిస్ట్రేషన్ సర్వీసెస్), 8. డివిజినల్ ఫైర్ ఆఫీసర్(ఏపీ ఫైర్ సర్వీసెస్), 9. డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ జైల్స్(మెన్)(ఏపీ జైళ్ల సర్వీసు), 10. అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్(ఏపీ లేబర్ సర్వీసు), 11. అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్(ఏపీ ఎక్సైజ్ సర్వీసు), 12. మున్సిపల్ కమిషనర్-గ్రేడ్2(ఏపీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సర్వీసు), 13. జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి(ఏపీ సోషల్ వెల్ఫేర్ సర్వీసు), 14. జిల్లా బీసీ సంక్షేమ అధికారి(అసిస్టెంట్ డెరైక్టర్ సహా)(బీసీ వెల్ఫేర్ సర్వీస్), 15. జిల్లా గిరిజన సంక్షేమ అధికారి(ట్రైబల్ వెల్ఫేర్ సర్వీస్), 16. జిల్లా ఉపాధి కల్పనాధికారి(ఏపీ ఎంప్లాయిమెంట్ సర్వీస్), 17. లే సెక్రటరీ అండ్ ట్రెజరరీ గ్రేడ్-2(ఏపీ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్), 18. అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్/అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్(ఏపీ ట్రెజరీస్, అకౌంట్స్ సర్వీసు), 19. అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్(ఏపీ స్టేట్ ఆడిట్ సర్వీసు), 20. మండల పరిషత్ డెవలప్‌మెంట్ ఆఫీసర్(పంచాయత్‌రాజ్, గ్రామీణాభివృద్ధి సర్వీసు).
గ్రూప్-1 (బి) ఉద్యోగాలు ఇవీ..
1. గ్రేడ్-3 మున్సిపల్ కమిషనర్, 2. అసిస్టెంట్ కమర్షియల్ టాక్స్ ఆఫీసర్, 3. డిప్యూటీ తహశీల్దార్, 4. గ్రేడ్-2 సబ్ రిజిస్ట్రార్, 5. జూనియర్ ఎంప్లాయిమెంట్ ఆఫీసర్, 6. అసిస్టెంట్ రిజిస్ట్రార్, 7. అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్, 8. ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్(రూరల్ డెవలప్‌మెంట్), 9. ఎక్సైజ్ సబ్ ఇన్‌స్పెక్టర్, 10. ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్-2.
గ్రూప్-1బిలోని 1, 10 క్రమసంఖ్యలో ఉన్న పోస్టులు జోనల్ పోస్టులు. గ్రూప్-1ఎ, గ్రూప్-1బి పోస్టులకు ఒకే పరీక్ష ఉంటుంది. దీనిలో ప్రతిభ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
గ్రూప్-2 సర్వీసెస్..
1. సీనియర్ అకౌంటెంట్, 2. ఆడిటర్, 3. సీనియర్ అకౌంటెంట్, 4. సీనియర్ ఆడిటర్, 5. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్(ఏపీ సెక్రటేరియట్ సబ్ సర్వీసు), 6. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్(ఏపీ లెజిస్లేచర్ సబ్ సర్వీసు), 7. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్(ఆర్థిక శాఖ, ఏపీ సెక్రటేరియట్ సబ్ సర్వీసు), 8. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్(న్యాయ శాఖ, ఏపీ లెజిస్లేచర్ సబ్ సర్వీసు), 9. అసిస్టెంట్ ఆడిటర్ 10. టైపిస్ట్ కమ్ అసిస్టెంట్( ఏపీ సెక్రటేరియట్ సబ్ సర్వీసు), 11. టైపిస్ట్ కమ్ అసిస్టెంట్(ఏపీ లెజిస్లేచర్ సబ్ సర్వీసు), 12. టైపిస్ట్ కమ్ అసిస్టెంట్(ఆర్థిక శాఖ, ఏపీ సెక్రటేరియట్ సబ్ సర్వీసు), 13. టైపిస్ట్ కమ్ అసిస్టెంట్(న్యాయశాఖ, ఏపీ సెక్రటేరియట్ సబ్ సర్వీసు), 14. టైపిస్ట్ కమ్ అసిస్టెంట్( శాఖాధిపతులు, ఏపీ మినిస్టీరియల్ సర్వీసు), 15. జూనియర్ అసిస్టెంట్( శాఖాధిపతులు, ఏపీ మినిస్టీరియల్ సర్వీసు), 16. జూనియర్ అకౌంటెంట్(ఏపీ ట్రెజరీస్, అకౌంట్స్), 17. జూనియర్ అకౌంటెంట్(ఏపీ లైఫ్ ఇన్సూరెన్స్ సబ్ సర్వీసు).
గ్రూప్-2లోని క్రమసంఖ్య 2, 5 నుంచి 17 వరకు గల పోస్టులు రాష్ట్ర స్థాయి పోస్టులు. 1 నుంచి 17 వరకు గల క్రమసంఖ్యల్లో ఉన్న పోస్టులన్నీ నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు. కేవలం రాతపరీక్షలో ప్రతిభ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
మౌఖిక పరీక్షలు వీటికే...
గ్రూప్-1ఎ, గ్రూప్-1బి కేటగిరీ పోస్టులతో పాటు కింది పోస్టులకు మౌఖిక పరీక్షలు ఉంటాయని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.
గెజిటెడ్ కేటగిరీ..
1. అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ ఎండోమెంట్స్, 2. అసిస్టెట్ డెరైక్టర్ ఆఫ్ మార్కెటింగ్ , 3. చైల్డ్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్, 4. అసిస్టెంట్ డెరైక్టర్ ఆఫ్ ఇండస్ట్రీస్, 5. డీఎస్పీ(కమ్యూనికేషన్స్), 6. అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్, 7. హెడ్ ఆఫ్ సెక్షన్స్ ఇన్ మైనింగ్ ఇంజినీరింగ్ సర్వీస్ ఇన్ గవర్నమెంట్ పాలిటెక్నిక్స్, 8. అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్, 9. అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్, 10. అసిస్టెంట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్, 11. జూనియర్ లె క్చరర్స్, 12. జూనియర్ లెక్చరర్స్ ఇన్ పాలిటెక్నిక్ కాలేజెస్, 13. లెక్చరర్స్ ఇన్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజెస్, 14. డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్స్, 15. లెక్చరర్స్ ఇన్ రేడియాలాజికల్ ఫిజిక్స్ ఇన్ ఏపీ మెడికల్ సర్వీసెస్.
నాన్ గెజిటెడ్ పోస్టులు..
1. ఇండస్ట్రియల్ ప్రమోషన్ ఆఫీసర్, 2. అసిస్టెంట్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్, 3. సూపర్‌వైజర్ (మహిళ శిశు సంక్షేమ శాఖ), 4. సూపరింటెండెంట్, చిల్డ్రన్స్ హోమ్స్, డబ్ల్యూ అండ్ సీడబ్ల్యూ డిపార్ట్‌మెంట్. అయితే ఈ మౌఖిక పరీక్షలు ఇప్పటికే జారీ అయిన, ప్రక్రియ కొనసాగుతున్న నోటిఫికేషన్లకు వర్తించవు. కొత్తగా జారీ చేసే నోటిఫికేషన్లకే వర్తిస్తాయి. ఈ మేరకు ఏపీపీఎస్సీ చర్యలు చేపట్టాలని సర్కారు ఆదేశించింది.

No comments:
Post a Comment