ఏపీపీఎస్సీ కార్యదర్శి పూనం మాలకొండయ్య కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్‌గా
బదిలీకానున్నారని విశ్వసనీయ సమాచారం. ప్రస్తుతం కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్‌గా
పనిచేస్తున్న ప్రవీణ్ ప్రకాశ్ సోమవారం ఆ బాధ్యతల నుంచి వైదొలగనున్నారు. ఆయన కేంద్ర
మంత్రి కిల్లి కృపారాణికి ప్రత్యేక అధికారి(ఓఎస్‌డీ)గా వెళ్తున్నారు. ఈ మేరకు వైద్య
ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శికి ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి సమాచారం అందింది. పూనం
కూడా త్వరలోనే బాధ్యతలు స్వీకరించేలా రెండ్రోజుల్లో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసే
అవకాశం ఉంది. రాష్ట్రంలో ప్రాథమిక ఆరోగ్య వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైంది. మందులు,
సిబ్బంది కొరత వేధిస్తోంది. రాష్ట్రంలో దాదాపు అన్ని ఆరోగ్య కేంద్రాల పరిస్థితి
ఇదేవిధంగా కనిపిస్తోంది. కేంద్ర నిధులతో చేపట్టిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల భవన
నిర్మాణం నత్తనడకన సాగుతోంది. మందుల కొరత పరిస్థితిపై ఒకానొక దశలో ప్రవీణ్ ప్రకాశ్
ఏపీఎంఎస్‌ఐడీసీ అధికారులను తీవ్రంగా మందలించారు కూడా. ఈ నేపథ్యంలో ఆయా సమస్యలను చక్కదిద్దాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం పూనం మాలకొండయ్యను
కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్‌గా నియమించిందని అధికారవర్గాల సమాచారం. ప్రస్తుతం
ఆరోగ్యశ్రీ హెల్త్‌కేర్ ట్రస్ట్ సీఈఓగా ఉన్న శ్రీకాంత్ రాష్ట్ర మౌలిక వైద్య
సదుపాయాల అభివృద్ధి సంస్థ (ఏపీఎంఎస్‌ఐడీసీ) ఎండీగా శ్రీకాంత్ నియామకం కానున్నారు.
మూడు నెలల కిందటే ఏపీఎంఎస్‌ఐడీసీ ఎండీగా ఉన్న శ్యామలరావు జలమండలి ఎండీగా బదిలీ
అయ్యారు. అప్పట్నుంచీ ఏపీఎంఎస్‌ఐడీసీలో ఆ పోస్టు ఖాళీగానే ఉంది. దీంతో మందుల
సరఫరాపై తీవ్ర ప్రభావం పడింది. అయితే శ్రీకాంత్ ఆరోగ్యశ్రీకి సీఈఓగా ఉంటూ
ఏపీఎంఎస్‌ఐడీసీ అదనపు బాధ్యతలు ఇస్తారా లేదా ఏపీఎంఎస్‌ఐడీసీకి ఎండీగా నియమించి
ఆరోగ్యశ్రీ అదనపు బాధ్యతలు అప్పగిస్తారా అనేది ఇంకా తెలియరాలేదు.
No comments:
Post a Comment