ఇంగ్లండు రచయిత శామ్యూల్స్ జాన్సన్ "Language is the dress of thought" భావం శరీరమైతే, భాష వస్త్రం లాంటిదని ఆయన భావన. రాసే భాషకైనా, మాట్లాడే భాషకైనా ఇది వర్తిస్తుంది. అలాని రాసే భాష, మాట్లాడే భాష ఒకటి కాదు. రెండూ ఒకటిగా భావించి, రాసే విధంగా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాం. తద్వారా మాట్లాడే భాషలో సహజత్వంతోపాటు, ఒరవడి (Fluency) లోపిస్తుంది. కారణం రాసే భాష రికార్డెడ్ ప్రోగ్రామ్ లాంటిది. మాట్లాడేటప్పుడు ప్రతి క్షణం అప్రమత్తంగా ఉండాల్సిందే. రెండింటికీ చెప్పే భావం ఒకటయినా, కుడి ఎడమలకు ఉన్నంత తేడా ఉంటుంది.
మనం చదువుతున్న ఇంగ్లిష్ భాష నేర్పే విధంగా కాకుండా, పాండిత్యం పెంచే విధంగా ఉంది. మరోలా చెప్పాలంటే నడవటం రాని వాడికి ఉరకటం నేర్పినట్టుగా ఉంది. Listening Speaking Reading Writing (LSRW) భాష నేర్చుకునేందుకు రహదారి లాంటిది. అలా కాకుండా అడ్డదారి Reading Writing (RW) లో వెళితే కష్టాలు, నష్టాలే కాకుడా గమ్యం కూడా చేరలేం. ఇంగ్లిష్ పరాయి భాషగా నేర్చుకుంటున్న మనలాంటి దేశాల్లో ఇలానే జరుగుతుంది. గ్రామర్‌తో కుస్తీపడి ఏ కొద్ది మందో ఇంగ్లిష్ నేర్చుకున్నా, వారు మాట్లాడే భాషలో ఉండవలసిన సహజత్వం కానీ, ఒరవడి కానీ ఉండదు. రాసే భాష ప్రభావం మాట్లాడే భాషపై ఉండటం మూలంగా ఇలా జరుగుతుంది. ఇంగ్లిష్ తెలుగులాగా మాట్లాడేందుకు ఈ వారం ‘‘స్పీచ్ మెకానిజం’’ గురించి తెలుసుకుందాం.
స్పీచ్ మెకానిజం
వెర్బల్ కమ్యూనికేషన్ (మాటల ద్వారా వ్యక్తీకరణ)
మాటలతో కూడిన భావ వ్యక్తీకరణను వెర్బల్ కమ్యూనికేషన్ అంటాం. మాట్లాడే భాష విడి పదాల రూపంలో కాకుండా, పద బంధాల రూపంలో నేర్చుకోవాలని ఇంతకు ముందే అనుకున్నాం. వ్యవహారిక భాష రాసే భాషలాగా కాకుండా వినే వారిని కలుపుకొని పోయే విధంగా ఉండాలి. ఇందుకు మాట్లాడే భాషలో మూడు ముఖ్యమైన అంశాలు వుండాలి.
1. Conversation Starters
2. Conversation Fillers
3. Conversation Expressions
1.Conversation Starters
వ్యవహారిక భాష పెద్దపెద్ద వాక్యాలతో మొదలు కాకూడదు. మొదటి మాటలు మాట్లాడే వారి మధ్య రాపోర్ట్ పెంపొం దించే విధంగా వుండాలి. మొదటి మాటతోనే మంచి సంభాషణకు పునాది పడాలి. ఉదాహరణకి Good Morning/Good Afternoon/ Good Evening, Hello, Hi, yes, No, Well, of Course, I think, In my Opinion, The Thing is, My Point is లాంటి మాటలతో సంభాషణలను ప్రారంభించవచ్చు. ఎక్కడై నా మంచి స్టార్టర్స్ వింటే, నేర్చుకొని వాటిని మీరు కూడా వాడవచ్చు.
మాట్లాడే భాషకు భావం ముడిసరుకు వంటిది. భావానికి భాషా రూపం ఇవ్వటం ముడిసరుకును వినియోగ వస్తువుగా మార్చటం లాంటిది. భావ వ్యక్తీకరణ (communcation) వినియోగదారుడుకి ఫైనల్ ప్రొడక్ట్ ను చేర్చటం లాంటిది. మాట్లాడే భాషలో ఈ మొత్తం వ్యవహారం క్షణ కాలంలో జరిగి పోవాలి. ఏంచెప్పాలో బుద్ధి (Intellect ) ఆమోదంతో కాన్షియస్ మైండు నిర్ణయిస్తుంది. సబ్‌కాన్షియస్ మైండ్‌లో గత అనుభవాల మూలంగా పొందు పరచబడిన భాషా పరిజ్ఞానం ఆధారంగా ఎలా చెప్పాలో కూడా కాన్షియస్ మైండు నిర్ణయిస్తుంది. చివరగా కాన్షియస్ మైండు ఆజ్ఞాను సారంగానే వెర్పల్, నాన్‌వెర్పల్ విధానాల్లో భావ వ్యక్తీకరణ జరుగుతుంది. అలవాటుగా మారిన తర్వాత సబ్ కాన్సియస్ మైండు పరిధిలోకి వెళుతుంది.
తెలుగు మాతృభాషగా గల మనం చెప్పదలచుకున్న భావాన్ని యధాలాపంగా తెలుగులో అనుకుంటాం. ఆ తర్వాత ఇంగ్లిష్‌లోకి అనువదించుకుంటాం. ఇలా అనువాదం ద్వారా మాట్లాడే ఇంగ్లిష్ సహజత్వం కోల్పోతుంది. మాట్లాటంలో ఒరవడి (Fluency) కూడా లోపిస్తుంది. ఇలా మాట్లాడే ఇంగ్లిష్‌లో మాతృభాష ప్రభావం కూడా చాలా ఉంటుంది. ఇలా జరగటానికి కారణం మనం ఇంగ్లిష్‌ను, ఇంగ్లిష్ ద్వారా కాకుండా తెలుగు ద్వారా నేర్చుకోవడం, సహజంగా నేర్చుకోకుండా గ్రామర్ ద్వారా నేర్చుకోవటం. విడి పదాలకు బదులుగా పద బంధాలను (Expressions) నేర్చుకుంటే గ్రామర్ ప్రమేయం లేకుండా, అనువాద అవసరం లేకుండానే తెలుగులాగే ఇంగ్లిష్ ధారాళంగా మాట్లాడవచ్చు.
2. Conversation Fillers
సంభాషణ ఉపన్యాసం లాంటిది కాదు. సంభాషణలో చెప్పే వారితో పాటు వినే వారు కూడా ఉత్సాహంగా పాల్గొంటారు. మాట్లాడేట ప్పుడు అనుకోకుండా మధ్యలో వచ్చే వ్యవధిలో ఫిల్లర్స్ వాడటం ద్వారా ధారాళంగా మాట్లాడి నట్టుగానూ, వినేవారికి ఇంపుగానూ వుంటుంది. ఫిల్లర్స్ తప్పక వాడాలని నియమం లేదు. కానీ వాడటం మూలంగా సంభాషణ సహజంగా వుంటుంది. you know, you see, like, and, so, therefore లాంటి పదాలను ఫిల్లర్స్‌గా వాడవచ్చు.
3. Conversation Expressions
భాష పదాల రూపంలో కాకుండా పద బంధాల రూపంలో నేర్చుకోవాలని ఇంతకు ముందే చెప్పుకున్నాం. ఇలా నేర్చుకుంటే గ్రామర్ అవసరం లేకుండానే, తెలుగు నుండి అనువాదం అవసరం లేకుండానే సహజంగా ఇంగ్లిష్‌లో మాట్లాడవచ్చు. ఇలా పద బంధాలను నేర్చుకొని మాట్లాడటం ద్వారా గ్రామర్ పరిజ్ఞానం కూడా వస్తుంది. తెలుగులో వ్యాకరణం నేర్చుకోకుండానే, నిరక్షరాస్యులు సైతం వ్యాకరణ బద్దంగా మాట్లాడటానికి ఇదే కారణం.
మోడల్ ఎక్స్‌ప్రెషన్స్
1. How are you?
2. What is the Time?
3. What do you do for Living?
4. I am at home
5. He looks handsome
మీరు ఇతరులు మాట్లాడుతున్నపుడు చిన్న వాక్యాలను లేదా పుస్తకాలలో చదివిన వాక్యాలను నేర్చుకోవటం ద్వారా, మళ్ళీ మళ్ళీ వాటిని గుర్తుకు తెచ్చుకుంటే అవస రమైనపుడు వాడగలుగు తారు. ఏ భాషనైనా ఇదే రకంగా నేర్చుకుంటారు. ఈ విషయంలో మరిన్ని మెళకువలు తరువాతి భాగాలలో తెలుసుకుందాం. అంతవరకు, వినేప్పు డైనా, చదివేటప్పుడైనా తారసపడే వాడుకకు ఉపయోగపడే ఎక్స్‌ప్రెషన్స్ నేర్చుకోండి.
Tone : కంఠస్వరంలో హెచ్చుతగ్గులను ‘పిచ్’ అంటారు. మాట్లాడేటప్పు డు ‘పిచ్’ మార్చటం ద్వారా వ్యక్తం చేసే భావాలు మారిపోతాయి. Pause అంటే మాటల మధ్య వ్యవధి. మాట్లాడేటప్పుడు Pause సరిగ్గా వుపయోగించే వారని మాజీ ప్రధాన మంత్రి వాజ్‌పాయ్‌కి మంచి పేరుంది.
Body Language : బాడీ లాంగ్వేజ్‌లో ఫేషియల్ ఎక్స్‌ప్రెషన్స్, గెశ్చర్స్ ముఖ్యమైనవి. భాషరాని సినిమాలు చూసి కూడా కథను మనం అర్థం చేసుకోగలుగుతాం. ఇతరులను అనుకరించటం ద్వారా ఈ అంశాలను బాగా నేర్చుకోచ్చు. భావ వ్యక్తీకరణలో వీటి పాత్ర గణనీయంగా ఉంటుంది.
మాట్లాడటం ద్వారానే మాట్లాడటం వస్తుందన్న ప్రాథమిక సత్యాన్ని గుర్తుంచుకొని, ఈ క్షణం నుండే మాట్లాడటం మొదలు పెట్టండి. చదువుకు, వయస్సుకు సంబంధం లేకుండా ఎవరైతే మాట్లాడటం ప్రారంభించారో వారందరికి ఇంగ్లిష్ వచ్చేసింది. ఈ శీర్షిక మీ ప్రయత్నానికి ఒక దిక్చూచి లాంటిది. వచ్చేవారం మాట్లాడ టానికి సంబంధించి మరిన్ని శాస్త్రీయ, వాస్తవిక విషయాలు తెలుసుకుందాం.
గ్రామర్ లేకుండా ఇంగ్లిష్
మీకు ఆశ్చర్యకరంగా అన్పించవచ్చు గానీ మీరు చేసే వ్యక్తీకరణలో మాటల పాత్ర కేవలం 10 శాతమే. మిగతా అంతా మీ హావభావాలు, శరీరభాషతో అర్థంచేసుకుంటారు. అయినా మనం ఇంగ్లిష్ దగ్గరకు వచ్చేసరికి గ్రామర్ నేర్చుకోవడం ద్వారా మాట్లాడాలనుకుంటాం. అక్కడే బోర్లాపడతాం. ఇంగ్లిష్ గ్రామర్ సులభం కాకపోవడంతో అడుగు ముందుకు పడదు. మాటలు పెదవి దాటిరావు. అందుకే నమస్తే తెలంగాణ టర్నింగ్ పాయింట్ ఒక కొత్త ప్రయోగం చేస్తోంది. గ్రామర్ నేర్చుకోవాల్సిన అవసరం లేకుండా ఇంగ్లిష్ నేర్పే ప్రయత్నం ఇది.
- 15-16 ఏళ్ళ పాటు సిన్సియర్‌గా ఇంగ్లిష్ చదివి మంచి మార్కులు తెచ్చుకున్నా నోరు విప్పి నిమిషం పాటు ఆ భాషలో మాట్లాడలేకపోతున్నామంటే ఆ విధానం లోనే లోపం ఉందన్న మాట.
- ప్రపంచంలో ఏ భాషనైనా ఆ భాష మాతృభాషగా గల వారు ముందు గ్రామర్ నేర్చుకొని ఆపై తమ భాష మాట్లాడటం జరుగడం లేదు. అంతెందుకు మనం తెలుగు మాట్లాడటం వినడం ద్వారా, అనుకరణం ద్వారా నేర్చుకున్నామే తప్ప ముందు తెలుగు భాషా వ్యాకరణ పుస్తకాలు కంఠస్థం పట్టలేదు.
- అందుకే గ్రామర్ లేకుండా ఇంగ్లిష్ అనే కొత్త ప్రక్రియ పట్ల మానసిక సంసిద్ధత పెంచుకుందాం.
- ఏ భాషనైనా రాయడం వేరు. మాట్లాడటం వేరు. రాయడం రికార్డెడ్ ప్రోగ్రామ్ వంటిది. అదే మాట్లాడటం లైవ్ ప్రోగ్రాం వంటిది.
- మనం ఎదుటి వ్యక్తికి ఏం చెప్పినా మనం మాటల ద్వారా గ్రహించేది 10 శాతం - మిగతా అంతా మన హావభావాలు, శరీర భంగిమలు తదితర వ్యక్తీకరణల ద్వారానే.
- ఆ పది శాతం మాటల ప్రయోగం లోనూ వివిధ సౌలభ్యాలుంటాయి. వాటిని ఉపయోగించటం ద్వారా ఇంగ్లిష మాట్లాడటాన్ని సులభతరం చేసుకోవచ్చు.
- కాన్వర్జేషన్ స్టార్టర్స్, ఫిల్లర్స్ ఎవరు ఉపయోగిస్తున్నా గ్రహించి వాటిని మీరూ ఉపయోగించేలా సాధన చేయండి.

No comments:
Post a Comment