గ్రూప్-1, గ్రూప్-2 పరీక్షలతో పాటు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఎపిపిఎస్‌సి) ఇటీవల నిర్వహించిన వివిధ పరీక్షలకు సంబంధించి నోటిఫికేషన్ ఏ జీఓ ప్రకారం ఇచ్చామో, అదే జీఓ ప్రకారం నియామకాలు జరుగుతాయని ఈ కమిషన్ చైర్మన్ రేచల్ చటర్జీ స్పష్టం చేశారు. ఏ పరీక్షలకు ఇంటర్వ్యూ ఉండదంటూ నోటిఫికేషన్‌లో తెలియచేశామో, అందుకు కట్టుబడి అభ్యర్థుల ఎంపిక ఉంటుందన్నారు. వేర్వేరు పోస్టులకు నోటిఫికేషన్ వెలువడ్డ తర్వాత జారీ అయిన జీఓలు పాత నోటిఫికేషన్లకు వర్తించబోవని వివరించారు. నోటిఫికేషన్‌కు విరుద్ధంగా నియామకాలు జరగబోవని చటర్జీ స్పష్టం చేశారు.
No comments:
Post a Comment