Sunday, December 16, 2012

ఏపీపీఎస్సీ సంస్కరణలు లోపభూయిష్టం

ఏపీపీఎస్సీ గ్రూప్-1, గ్రూప్- 2 పోస్టులలో గతంలో ఉన్న విధానాలనే అనుసరించాలని తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షుడు వీ శ్రీనివాస్‌గౌడ్ డిమాండ్ చేశారు. ఏపీపీఎస్సీ కొత్త విధానాలు లోపభూయిష్టంగా ఉన్నాయని చెప్పారు. ఈ లోపాలను సవరించుకోకుంటే తెలంగాణ వ్యాప్తంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు. గెజటెడ్ అధికారుల సంఘం నాయకులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మిన్నీ మాథ్యూను కలిసి విజ్ఞాపనను అందజేశారు. అనంతరం వీ శ్రీనివాస్‌గౌడ్ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ ఏపీపీఎస్సీ సంస్కరణలన్ని లోపభూయిష్టంగా ఉన్నాయని, వీటిని శాస్త్రీయంగా సవరించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్షికమంలో కృష్ణయాదవ్, మమత, సహదేవ్, మధుసూదన్ రాజశేఖర్ గుప్తా పాల్గొన్నారు.

No comments:

Post a Comment