ప్రభుత్వ ఉద్యోగాల నియామకం కోసం అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించే బోర్డు సభ్యుల
పేర్లు, చిరునామాలను సమాచార హక్కు చట్టం (ఆర్‌టీఐ) కింద వెల్లడించడం కుదరదని
సర్వోన్నత న్యాయస్థానం స్పష్టంచేసింది. ఇంటర్వ్యూ చేసినవారి పేర్ల వెల్లడి వల్ల
వారి భద్రతకు లేదా ప్రాణాలకు అపాయం కలిగే అవకాశముందని సుప్రీంకోర్టు పేర్కొంది.
ఉద్యోగాన్ని పొందడంలో విఫలమైన అభ్యర్థులు బోర్డు సభ్యులపై ప్రతీకారం తీర్చుకునే
అవకాశముంటుందని అభిప్రాయపడింది. పాట్నా హైకోర్టు తీర్పును కొట్టివేస్తూ
న్యాయమూర్తులు స్వతంత్ర కుమార్, ముఖోపాధ్యాయలతోకూడిన ధర్మాసనం ఈ మేరకు
తీర్పుచెప్పింది. ఆర్‌టీఐ కింద సమాచారాన్ని వెల్లడించాలంటూ ఆదేశించేటప్పుడు..
వ్యక్తుల ఏకాంత హక్కుకు భంగం కలుగుతుందా? లేదా? అన్న విషయాన్నీ పరిగణనలోకి
తీసుకోవాలని తెలిపింది.
No comments:
Post a Comment