రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) కొత్త చైర్మన్ నియామకంపై సర్వత్రా
ఆసక్తి నెలకొంది. ప్రస్తుత చైర్‌పర్సన్ రేచల్ చటర్జీ పదవీ కాలం ఈ నెల 28తో
ముగియనుండటమే ఇందుకు కారణం. ఆమె స్థానంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మిన్నీ
మాథ్యూను నియమించాలని సీఎం కిరణ్ భావిస్తున్నప్పటికీ.. ఆమె పదవీ కాలం మరో నెల
ఉన్నందున కొంత సందేహం వ్యక్తమవుతోంది. మాజీ సీఎస్ పంకజ్ ద్వివేదీని నియమిస్తారా
అన్న చర్చ కూడా ఉన్నత స్థాయిలో జరుగుతున్నట్లు తెలిసింది. రేచల్ స్థానంలో
ప్రస్తుతానికి ఇన్‌చార్జిని నియమిస్తారన్న వార్తలు కూడా వస్తున్నాయి. గతంలో ఇదే
పద్ధతిని అవలంబించినా.. కమిషన్ సీనియర్ సభ్యుల పాత్రపై రకరకాల కథనాలు వినిపిస్తున్న
నేపథ్యంలో ఇన్‌చార్జి నియామకంపై సందేహం నెలకొంది. మరో రెండు రోజుల్లో రేచల్
పదవీకాలం ముగుస్తున్నా.. కొత్త చైర్మన్ నియామకంపై ప్రభుత్వం ఇంకా కసరత్తు
ప్రారంభించలేదు. ఈ నెల 27- 29 తేదీల్లో జరగనున్న ప్రపంచ తెలుగు మహా సభల నేపథ్యంలో
సీఎం ఈ విషయమై దృష్టి సారించే పరిస్థితి కనిపించడం లేదు. ఏపీపీఎస్సీలో వివాదాల
నేపథ్యంలో కొత్త చైర్మన్ నియామకం సర్కారుకు పరీక్ష కానుంది.
ప్రతిభ ఉన్నా ఉద్యోగాలు రావడం లేదు: చంద్రబాబు
తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు 'వస్తున్నా.. మీకోసం' పాదయాత్ర బుధవారం మధ్యాహ్నం కరీంనగర్ జిల్లా గంగారం నుంచి ప్రారంభమైంది. గంగారంలో చంద్రబాబు మాట్లాడుతూ విద్యార్థుల్లో ప్రతిభ ఉన్నా ఉద్యోగాలు మాత్రం రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీపీఎస్సీలో వైఎస్ తన అనుకూల వ్యక్తులను పెట్టి వ్యవస్థను భ్రష్టుపట్టించారని విమర్శించారు.

No comments:
Post a Comment