సభ్యుల తీరు ఏ మాత్రం సవ్యంగా లేదని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్
(ఏపీపీఎస్సీ) చైర్‌పర్సన్ రేచల్ చటర్జీ రాష్ట్ర గవర్నర్‌కు నివేదించారు. తమ అధికార
పరిధిని మించి వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వ ఆదేశాలను అమలు కాకుండా
అడ్డుకుంటున్నారని ఫిర్యాదు చేశారు. జీవో 420ని ప్రశ్నిస్తూ వ్యాఖ్యలు
చేస్తున్నారని నివేదికలో పేర్కొన్నారు. సాఫీగా జరగాల్సిన అభ్యర్థుల ఎంపిక జాబితాల
విడుదల విషయంలో ఘోరంగా వ్యవహరించారని, పోస్టుల భర్తీని ఆపేందుకు ప్రయత్నించారని
వివరించారు.
నోటిఫికేషన్ విడుదల చేశాక అందుకు అనుగుణంగానే ఎంపిక ప్రక్రియ చేపట్టాలని నిబంధనలు ఉన్నాయని ఆమె స్పష్టం చేశారు. రాత పరీక్షలకు ముందే నిర్ణయం తీసుకుంటే ఇబ్బంది ఉండదని, అభ్యర్థుల ఎంపిక సమయంలో సభ్యులు అడ్డుపడటం వల్ల నిరుద్యోగులు నిరాశా నిస్పృహలకు లోనవుతున్నారని రేచల్ అభిప్రాయపడ్డారు. కమిషన్‌లో మెజారిటీ అభిప్రాయమే చెల్లుబాటుకావాలని సభ్యులు వాదిస్తున్నప్పటికీ.. సర్కారు ఆదేశాలను పాటించాలన్నదే తన అభిప్రాయమన్నారు.
అభ్యర్థుల ఎంపిక విధానంలో అక్రమాలు జరుగుతున్నట్లు ఆరోపణలు చేస్తూ కమిషన్ పరువు తీసేందుకు సభ్యులు సిద్ధపడ్డారని ఆమె తన నివేదికలో పేర్కొన్నారు. కమిషన్ అనుమతి లేకుండా ఫలితాలు ప్రకటించారని కార్యదర్శిపై లోకాయుక్తలో ఫిర్యాదు చే శారని, హైకోర్టు పిటిషన్‌లోనూ అభ్యంతరకరమైన భాష వాడారని వివరించారు. ఈ సందర్భంగా కమిషన్ చైర్‌పర్సన్‌గా ఆమె బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి జరిగిన పరిణామాలను నివేదికలో పేర్కొనట్లు సమాచారం.
మరో ముగ్గురు సభ్యులపైనా ఏసీబీ కన్ను!
రిపుంజయరెడ్డి ఆస్తులకు సంబంధించి స్వాధీనం చేసుకున్న పత్రాల్లో ఏసీబీకి కీలక సమాచారం లభించినట్లు తెలిసింది. దీని ఆధారంగా మరో ముగ్గురు సభ్యుల ఇంటి తలుపు తట్టేందుకు కూడా రెడీ అవుతున్నట్లు సమాచారం. గతంలో ఉద్యోగాలకు జరిగిన మౌఖిక పరీక్షల సందర్భంగా వీరి పాత్రపైనా ఆరోపణలు వచ్చిన నేప«థ్యంలో ఆ ముగ్గురి ఆస్తులపైనా ఏసీబీ కన్నేసినట్లు తెలుస్తోంది.
ఏపీపీఎస్సీకి రిపుంజయరెడ్డి రాజీనామా
ఏపీపీఎస్సీ సభ్యుడి హోదాకు రిపుంజయరెడ్డి రాజీనామా సమర్పించారు. రాజీనామా లేఖను గవర్నర్ నరసింహన్కు రిపుంజయరెడ్డి పంపారు. సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ఆదేశాలతోనే తనపై కక్ష సాధింపు చర్యలు చేపట్టారని ఆయన ఆరోపించారు. బంధువుల ఆస్తులు కూడా తన ఆస్తులుగా చూపించారని ఆయన అన్నారు. తనపై వస్తున్న ఆరోపణలపై మనస్థాపం చెందిన తాను రాజీ నామా చేశానని ఓ ప్రశ్నకు రిపుంజయ్‌రెడ్డి సమాధానమిచ్చారు.

No comments:
Post a Comment