Sunday, December 16, 2012

ఏపీపీఎస్‌సీ చైర్‌పర్సన్‌గా ‘మిన్నీ మాథ్యూ’?

ప్రస్తుతం ఏపీపీఎస్‌సీ చైర్‌పర్సన్‌‌‌గా కొనసాగుతున్న రేఛల్‌ ఛటర్జీ పదవికాలం ఈ నెల 28 తేదీతో పూర్తి కానుండడంతో ఆమె స్థానంలో మిన్నీ మాథ్యూను నియమించే అవకాశాలు ఉన్నాయని విశ్వసనీ యంగా తెలిసింది. ప్రస్తుతం మిన్నీ మాథ్యూ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఫిబ్రవరి నెలతో ఆమె పదవి కాలం కూడా పూర్తి కానున్నది. అయితే ఈ రెండు నెలల రేఛల్‌ ఛటర్జీ స్థానంలో ఇన్‌ ఛార్జీ ఛైర్మన్‌గా కొనసాగించడం గాని లేదా రెండు నెలల తర్వాత పూర్తి కాలం ఛైర్మన్‌గా నియమించడం గాని జరుగుతుందని తెలిసింది.


ఈ విషయంలో ఇప్పటికే రాష్ట్ర ముఖ్య మంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి మిన్నీ మాథ్యూకు హామీ ఇచ్చినట్లు తెలిసింది. అయితే ఏపీపీఎస్‌సీ ఛైర్మన్‌గా రాష్ట్రానికి చెందిన వారిని కాకుండా.. ఇతర రా ష్ట్రాలకు చెందిన వారే ప్రస్తుత ఛైర్మన్‌గా కొనసాగుతున్న వారిపై నిరసనలు వ్య క్తం అవు తున్న సంగతి తెలిసిందే. అయినప్పటికీ మరో సారి ఇతర రాష్ట్రాల కు చెందిన వారినే ఛైర్మన్‌గా నియమించడం వల్ల ఈ సారి పెద్ద ఎత్తున నిరసన లు వినిపిం చే అవకాశాలు కూడా ఉన్నాయని ఏపీపీఎస్‌సీ సభ్యులు వాపోతున్నారు.

No comments:

Post a Comment