Monday, December 31, 2012

నూతన సంవత్సర శుభాకాంక్షలు - 2013



అడుగు ముందుకు వేయగలిగితే

దూరం అన్నది ఏమిలేదు

చెమటన్నది చిందించగలిగితే సాధ్యం కానిది ఏమిలేదు

లక్ష్య సాధనలో మీకు జయం కలగాలని కోరుకుంటూ

ఎపిపిఎస్సిప్లస్ వీక్షకులకు

నూతన సంవత్సర శుభాకాంక్షలు

ఇట్లు

దీటి శ్రీకాంత్

ఏపీపీఎస్సీలో 'చారిత్రక' అక్రమాలు!

డిగ్రీ లెక్చరర్ పోస్టుల భర్తీలో అవకతవకలు
 
ఉర్దూ పోస్టులు తెలుగుకు మళ్లింపు
 
జనరల్ పోస్టు ఎస్సీ రిజర్వేషన్‌కు మళ్లింపు
 
అభ్యర్థికి సహకరించిన ఏపీపీఎస్సీ
 
దరఖాస్తు నుంచి ఎంపిక వరకూ అభ్యర్థి ఎత్తులు
 
పరీక్షల్లో ముందు, వెనక అస్మదీయులు
 
అర్హత లేకపోయినా కమిషన్ అనుమతి
 
ఒక్కడి కోసం చక్రం తిప్పిందెవరు!?

ఒకే ఒక్కడి కోసం.. నోటిఫికేషన్ తర్వాత ఏపీపీఎస్సీ నిబంధనలనే మార్చేసింది! ఉర్దూ పోస్టులను తెలుగులోకి మళ్లించేసింది! జనరల్ పోస్టులను రిజర్వేషన్లో కలిపేసింది! పోస్టు సాధించేందుకు దరఖాస్తు దాఖలు చేసినప్పటి నుంచి సదరు అభ్యర్థి పన్నిన వ్యూహమూ నభూతో! ఇటీవల ఏపీపీఎస్సీ నిర్వహించిన డిగ్రీ లెక్చరర్ (హిస్టరీ) పోస్టుల భర్తీలో చోటుచేసుకున్న అక్రమాలివి.

వివరాల్లోకి వెళితే.. గత ఏడాది ఏపీపీఎస్సీ విడుదల చేసిన నోటిఫికేషన్‌లో డిగ్రీ (హిస్టరీ) లెక్చరర్ పోస్టుకు గుండు నాగేశ్వరరావు దరఖాస్తు చేసుకున్నాడు. అతని దరఖాస్తు సంఖ్య జీడీసీఎల్-502952. హాల్ టికెట్ నెంబర్ - 43010807. శుక్రవారమే ఫలితాలు ప్రకటించారు. ఈ పోస్టుకు ఆయన ఎంపికయ్యారు. శనివారం నాడే సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కూడా పూర్తయింది. రేపో మాపో ఉద్యోగంలో చేరిపోతాడు. కానీ, ప్రతిభ ఆధారంగా ఉద్యోగం లభిస్తే వింతేముంది. ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసింది మొదలు.. ఎంపికయ్యే వరకు జరిగిన అక్రమాలు అన్నీ ఇన్నీ కావు.

నల్లగొండ జిల్లా మునగాలకు చెందిన నాగేశ్వరరావు హిస్టరీ డిగ్రీ లెక్చరర్ పోస్టుకు దరఖాస్తు చేసుకున్నాడు. ఇతను బీసీ (బి) కేటగిరీకి చెందిన వ్యక్తి. ఆ కేటగిరీలో పురుషులకు పోస్టులు లేవు. అంటే ఆయన ఓపెన్ కేటగిరీలో అర్హత సాధించాలి. ఓపెన్ కేటగిరీలో ఉన్నవి నాలుగు పోస్టులు. వాటిలో మొదటి రెండు తెలుగు మీడియం. మూడు, నాలుగు ఉర్దూ మీడియంకు సంబంధించినవి. అంటే మొదటి రెండు స్థానాల్లో ఉంటేనే ఇతనికి పోస్టు లభిస్తుంది. కానీ, నాగేశ్వరరావు సాధించింది ఐదో ర్యాంకు. అయినా నేడో, రేపో ఉద్యోగంలో చేరబోతున్నాడు. అదెలాగంటే..

ఏపీపీఎస్సీ వరుస తప్పులు

నాగేశ్వరరావుకు పోస్టు వచ్చేలా ఏపీపీఎస్సీ అన్ని నిబంధనలనూ తుంగలో తొక్కింది. ఐదో ర్యాంకు అభ్యర్థికి పోస్టు ఇచ్చేందుకు ఏపీపీఎస్సీ చేసిన మొదటి తప్పు ఉర్దూ పోస్టులను తెలుగు మీడియం అభ్యర్థులకు ఇవ్వడం. నోటిఫికేషన్‌లో పేర్కొన్న విధంగా కాకుండా మధ్యంతరంగా ఉర్దూ పోస్టులను తెలుగు మీడియం అభ్యర్థులకు మళ్లించారు. అయినా, ఐదో ర్యాంకు వచ్చిన నాగేశ్వరరావు ఈ పోస్టు పొందేందుకు అర్హుడు కాదు.

అందుకే ఏపీపీఎస్సీ మరో తప్పిదానికి పాల్పడింది. ఈ పరీక్షల్లో ఎస్సీ అభ్యర్థి ఒకరు మూడో ర్యాంకు సాధించారు. సహజంగా జనరల్ కేటగిరీలోనే సదరు అభ్యర్థికి పోస్టింగ్ ఇవ్వాలి. కానీ, నాగేశ్వరరావు కోసమే జనరల్ కేటగిరీలో పోస్టింగ్ ఇవ్వాల్సిన మూడో ర్యాంకర్ (ఎస్సీ)ను ఎస్సీ కోటాలోకి మార్చారు. తద్వారా, ఐదో ర్యాంకు సాధించిన నాగేశ్వరరావు ఉద్యోగానికి అర్హత సాధించేలా పావులు కదిపారు.

దరఖాస్తు నుంచే వ్యూహాత్మకం

హిస్టరీ డిగ్రీ లెక్చరర్ల పరీక్షల్లో ఐదో ర్యాంకు సాధించిన నాగేశ్వరరావు ప్రతిభ చూస్తే ఎవరికైనా కళ్లు బైర్లు కమ్మక మానవు. ఆయన ఇంటి పేరు గుండు. ఆంగ్లంలో ఇంటి పేరులో మొదటి అక్షరం 'జి'. ఆయన తండ్రి పేరు చంద్రయ్య. ఆయన పేరులోని మొదటి అక్షరం 'సి'. సాధారణంగా, ఏపీపీఎస్సీలో పేరు, ఇంటి పేరు, తండ్రి పేరు అక్షర క్రమంలోనే హాల్ టికెట్లకు నెంబర్లను కేటాయిస్తారు. అందుకే, తనకు ముందు వెనక కూడా తనవారే వచ్చేలా చూసుకున్నాడు. మరో నలుగురితో దరఖాస్తు చేయించడమే కాదు. వారి ఇంటి పేర్లు 'జి' వచ్చేలా చూసుకున్నాడు.

ఆ నలుగురి పుట్టిన తేదీలూ ఒక్క రోజు తేడాతోనే ఉండడం మరో విశేషం. వారిలో ఒక అభ్యర్థి పేరు గుంజ నాగేంద్ర. ఆయన తండ్రి పేరు చంద్రమౌళి. పుట్టిన తేదీ 2.1.1973. మరో అభ్యర్థి పేరు గుండెపురి నాగేశ్వరవర్మ. ఆయన తండ్రి చంద్రకాంత్ వర్మ. పుట్టిన తేదీ 3.1.1973. ఇంకో అభ్యర్థి గుండా నాగేశ్వర్. తండ్రి పేరు చక్రం. పుట్టిన తేదీ 8.1.1973. మరికొందరు అభ్యర్థుల వివరాలూ ఇదే విధంగా ఉన్నాయి. ఈ అభ్యర్థులు అందరి ఇంటి పేరూ 'జీ'నే. తండ్రి పేరులోని మొదటి అక్షరం 'సి'నే. వారి పుట్టిన తేదీలూ ఒకరోజు అటూ ఇటు అంతే. ఈ అభ్యర్థుల వివరాలు, వారి ఫొటోలు అనుమానాస్పదమన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ఆన్‌లైన్ దరఖాస్తు విధానాన్ని నాగేశ్వరరావు తెలివిగా ఉపయోగించుకున్నాడన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అతనికి సహకరించిన దరఖాస్తుదారుల్లో ఒక్కరూ అభ్యర్థులు కారని, సదరు సబ్జక్టులో నిపుణులో, మరొకరో అయి ఉంటారని, నాగేశ్వరరావు కోసమే అభ్యర్థులుగా హాజరయ్యారని భావిస్తున్నారు. అంతేనా.. పరీక్షకు అనుమతించేందుకు వారి వారి అర్హతలు, నెట్, స్లెట్‌లలో ఉత్తీర్ణులయ్యారా అన్న విషయాన్నీ ఏపీపీఎస్సీ పరిగణనలోకి తీసుకోలేదని స్పష్టం చేస్తున్నారు.

నాగేశ్వరరావుపై గతంలో కొందరు ఫిర్యాదు చేసినా ఏపీపీఎస్సీ పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో, ఏపీపీఎస్సీలోని బడా బాబు ఎవరో ఈ వ్యవహారం మొత్తాన్ని నడిపించి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒక్కడి కోసం చక్రం తిప్పిన తెర వెనుక ప్రముఖుడి పేరు బయటకు రావాల్సి ఉంది. ఈ మొత్తం వ్యవహారంపై విచారణ జరిపితేనే అక్రమార్కులు బయటకు వచ్చే వీలుంది.

ఎపిపిఎస్సీ సభ్యుల అధికారాలకు కత్తెర !

•పద్దయ్యపైనా తప్పని విచారణ

• కొత్త ఛైర్మన్‌ రాకతో ఆరు నోటిఫికేషన్ల జారీ

• సభ్యుల పిటిషన్‌ నేడు హైకోర్టులో నిలిచేనా..

ప్రభుత్వోద్యోగాల పోస్టుల భర్తీలో అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎపిపిఎస్సీ సభ్యుల అధికారాలకు ప్రభుత్వం కత్తెర వేయనుంది. ఈ మేరకు రెండ్రోజుల్లో నిర్ణయం తీసుకోనున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఇప్పటికిప్పుడు తొలగించే అధికారం లేకపోవడంతో ప్రకటనల జారీలో సభ్యుల సంతకాలతో సంబంధం లేకుండా చేసినట్లు తెలిసింది. ఇప్పటికే సభ్యుల ఆమోదం ఉన్నా లేకున్నా కొత్త ఛైర్మన్‌ సిఆర్‌ బిశ్వాల్‌ ఆరు ఉద్యోగాల ప్రకటన జారీ చేశారు. అదే విధంగా పరీక్షలు పూర్తయి ఫలితాలకు నోచుకోని నోటిఫికేషన్లను వెనువెంటనే విడుదల చేయడానికి ఎపిపిఎస్సీ ఏర్పాట్లు చేస్తోంది. ఆరోగ్య కారణాలతో సెలవుల్లో ఉన్న కార్యదర్శి పూనం మాలకొండయ్య తిరిగి విధుల్లోకి చేరిన తర్వాత ఛైర్మన్‌ కఠిన నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. కమిషన్‌ వ్యవహారాలపై అందరితో చర్చించాల్సిన అవసరం ఉందని, అందరినీ కలుపుకుని ముందుకుపోతానని బిశ్వాల్‌ తెలిపారు.

ఛైర్మన్‌, సెక్రటరీ, సభ్యుల మధ్య ఇంట ర్వ్యూల అంశం వివాదాస్పదం కావడంతో ఎపిపిఎస్సీలో అవినీతి బయటకొచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికే నిర్వహించిన పరీక్షలకు ఇంటర్వ్యూలు ఉండకూడదని ప్రభుత్వం 420 జీవో విడుదల చేస్తే, ఇంటర్వ్యూలు ఉండాలని ఆరుగురు సభ్యులు పట్టుబట్టారు. ఈ పంచాయితీ లోకాయుక్త నుండి హైకోర్టు వరకు చేరింది. వాటిపై రోజుకోరకంగా కథనాలు వస్తుండడంతో ప్రభుత్వం, గవర్నర్‌ దృష్టి సారించారు. నివేదికలు తెప్పించుకున్నారు. సభ్యులపై మండిపడ్డారు. ఈ లోపు ఇంటర్వ్యూల్లో సభ్యులు ఒక్కో పోస్టుకు కొంత మంది సభ్యులు 20 లక్షల నుండి 50 లక్షల వరకు బేరమాడినట్లు ఆరోపణలొచ్చాయి. దీంతో రిపుంజయరెడ్డి ఇంటిపై ఎసిబి అధికారులు దాడిచేయడం, అరెస్టు చేసి చంచల్‌గూడ జైలుకు తరలించడం చకాచకా జరిగిపో యాయి. దాంతోపాటు మరో సభ్యులు పద్దయ్యపైనా అవినీతి ఆరోపణలు రావడంతో ఆయనను విచారిస్తారని తెలిసింది. ఇలా నౌమాన్‌, పోచయ్య, రవీందర్‌రెడ్డి, చంద్రశేఖర్‌ ఒక్కొక్కరిపై విచారణ జరుపుతారని సమాచారం. ఈ సమయంలో వారిని కమిషన్‌లో ఉంచాలా, పక్కన పెట్టాలా అన్న దానిపై ప్రభుత్వంలో చర్చ జరుగుతోంది.

కమిషన్‌ వ్యవహారాలపై అప్పటి ఛైర్‌పర్సన్‌ రేచల్‌ ఛటర్జీ ఇచ్చిన నివేదికను క్షుణ్ణంగా పరిశీలించిన గవర్నర్‌ నరసింహన్‌ వారిని పక్కన పెడితే బాగుంటుందన్న ఆలోచనలో ఉన్నారని రాజ్‌భవన్‌ వర్గాల కథనం. పక్కన పెట్టడానికి రాష్ట్రపతి ఆమోదం పొందాల్సి ఉంది. ఈ విషయంలో రాష్ట్రానికి వచ్చిన రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీతోనూ గవర్నర్‌ చర్చించినట్లు తెలిసింది. రాష్ట్రపతి నుండి ఆమోదం పొందాలంటే చాలా సమయం తీసుకుంటుంది. అప్పటివరకు సభ్యులకున్న అధికారాలకు కత్తెర వేస్తే బాగుంటుందని ప్రభుత్వానికి గవర్నర్‌ సూచించినట్లు తెలిసింది. దాని ప్రకారమే సభ్యుల అధికారాలు లేకుండా చేయడానికే మొగ్గు చూపిందని సమాచారం. కొత్తగా నియమితులైన మిగతా ముగ్గురు సభ్యుల అధికారాలపై అధికారులు చర్చిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఛైర్మన్‌, సెక్రటరీలపై సభ్యులు హైకోర్టులో వేసిన పిటీషిన్‌ ఈనెల 31న విచారణకు రానుంది. వారిపై ఆరోపణలు రావడంతో ఆ పిటీషన్‌ నిలుస్తుందా లేదా అన్నది అనుమానమే.

పూనం బదిలీ?

ఏపీపీఎస్సీ కార్యదర్శి పూనం మాలకొండయ్య కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్‌గా బదిలీకానున్నారని విశ్వసనీయ సమాచారం. ప్రస్తుతం కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్‌గా పనిచేస్తున్న ప్రవీణ్ ప్రకాశ్ సోమవారం ఆ బాధ్యతల నుంచి వైదొలగనున్నారు. ఆయన కేంద్ర మంత్రి కిల్లి కృపారాణికి ప్రత్యేక అధికారి(ఓఎస్‌డీ)గా వెళ్తున్నారు. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శికి ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి సమాచారం అందింది. పూనం కూడా త్వరలోనే బాధ్యతలు స్వీకరించేలా రెండ్రోజుల్లో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉంది. రాష్ట్రంలో ప్రాథమిక ఆరోగ్య వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైంది. మందులు, సిబ్బంది కొరత వేధిస్తోంది. రాష్ట్రంలో దాదాపు అన్ని ఆరోగ్య కేంద్రాల పరిస్థితి ఇదేవిధంగా కనిపిస్తోంది. కేంద్ర నిధులతో చేపట్టిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల భవన నిర్మాణం నత్తనడకన సాగుతోంది. మందుల కొరత పరిస్థితిపై ఒకానొక దశలో ప్రవీణ్ ప్రకాశ్ ఏపీఎంఎస్‌ఐడీసీ అధికారులను తీవ్రంగా మందలించారు కూడా. ఈ నేపథ్యంలో ఆయా సమస్యలను చక్కదిద్దాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం పూనం మాలకొండయ్యను కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్‌గా నియమించిందని అధికారవర్గాల సమాచారం. ప్రస్తుతం ఆరోగ్యశ్రీ హెల్త్‌కేర్ ట్రస్ట్ సీఈఓగా ఉన్న శ్రీకాంత్ రాష్ట్ర మౌలిక వైద్య సదుపాయాల అభివృద్ధి సంస్థ (ఏపీఎంఎస్‌ఐడీసీ) ఎండీగా శ్రీకాంత్ నియామకం కానున్నారు. మూడు నెలల కిందటే ఏపీఎంఎస్‌ఐడీసీ ఎండీగా ఉన్న శ్యామలరావు జలమండలి ఎండీగా బదిలీ అయ్యారు. అప్పట్నుంచీ ఏపీఎంఎస్‌ఐడీసీలో ఆ పోస్టు ఖాళీగానే ఉంది. దీంతో మందుల సరఫరాపై తీవ్ర ప్రభావం పడింది. అయితే శ్రీకాంత్ ఆరోగ్యశ్రీకి సీఈఓగా ఉంటూ ఏపీఎంఎస్‌ఐడీసీ అదనపు బాధ్యతలు ఇస్తారా లేదా ఏపీఎంఎస్‌ఐడీసీకి ఎండీగా నియమించి ఆరోగ్యశ్రీ అదనపు బాధ్యతలు అప్పగిస్తారా అనేది ఇంకా తెలియరాలేదు.

ఆర్టీఐ కింద ఇంటర్వ్యూ బోర్డు సభ్యుల పేర్ల వెల్లడి కుదరదు

ప్రభుత్వ ఉద్యోగాల నియామకం కోసం అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించే బోర్డు సభ్యుల పేర్లు, చిరునామాలను సమాచార హక్కు చట్టం (ఆర్‌టీఐ) కింద వెల్లడించడం కుదరదని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టంచేసింది. ఇంటర్వ్యూ చేసినవారి పేర్ల వెల్లడి వల్ల వారి భద్రతకు లేదా ప్రాణాలకు అపాయం కలిగే అవకాశముందని సుప్రీంకోర్టు పేర్కొంది. ఉద్యోగాన్ని పొందడంలో విఫలమైన అభ్యర్థులు బోర్డు సభ్యులపై ప్రతీకారం తీర్చుకునే అవకాశముంటుందని అభిప్రాయపడింది. పాట్నా హైకోర్టు తీర్పును కొట్టివేస్తూ న్యాయమూర్తులు స్వతంత్ర కుమార్, ముఖోపాధ్యాయలతోకూడిన ధర్మాసనం ఈ మేరకు తీర్పుచెప్పింది. ఆర్‌టీఐ కింద సమాచారాన్ని వెల్లడించాలంటూ ఆదేశించేటప్పుడు.. వ్యక్తుల ఏకాంత హక్కుకు భంగం కలుగుతుందా? లేదా? అన్న విషయాన్నీ పరిగణనలోకి తీసుకోవాలని తెలిపింది.

త్వరలో 2670 పంచాయతీకార్యదర్శి ఉద్యోగాల భర్తీ ప్రకటన

పంచాయతీ సెక్రటరీ (కేటగిరి-4) పోస్టుల భర్తీకి సంబంధించిన ప్రకటన త్వరలో ఏపీపీఎస్సీ జారీచేయబోతుంది. 2,670 పోస్టుల భర్తీకి సంబంధించిన సమాచారం కమిషన్‌కు అందింది. పరీక్ష వరకు మాత్రమే ఎపీపీఎస్సీ నిర్వహిస్తుంది. నియామకాల ప్రక్రియ జిల్లా అధికారుల నేతృత్వంలో జరగనుంది. పోస్టుల వివరాలు సిద్ధంగా ఉన్నా అదనపు సమాచారం అవసరమైనందున కమిషన్‌ అధికారులు రెండు రోజుల నుంచి సంబంధిత అధికారులతో చర్చలు జరుపుతున్నారు. తొలుత డిసెంబరు 31వ తేదీలోగా ఉద్యోగాల ప్రకటన జారీచేస్తే వయోపరిమితిపరంగా అభ్యర్థులు నష్టపోకుండా ఉంటారని ఏపీపీఎస్సీ వర్గాలు భావించాయి. అయితే ప్రకటన జారీకి అవసరమైన సమాచారంలో స్పష్టత లేనందున ఇది సాధ్యమయ్యే సూచనలు కనిపించడంలేదు. పరిస్థితులన్నీ అనుకూలిస్తే.. సోమవారం లేదా జనవరిలో ఈ ఉద్యోగ నియామకాల ప్రకటన వెలువడనుంది. అలాగే 37 చక్కెర ఇన్‌స్పెక్టర్‌ పోస్టుల భర్తీ ప్రకటన సోమవారం జారీ కాబోతుంది. ఈ పోస్టులు సుమారు రెండువేల వరకు ఉంటాయని భావిస్తున్నారు.

Sunday, December 30, 2012

601 ఉద్యోగాల భర్తీకి ఏపీపీఎస్సీ ప్రకటన

601 ఉద్యోగాల భర్తీకి ఏపీపీఎస్సీ ప్రకటనఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలోని వివిధ శాఖల్లోని 601 ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ నియామక సంస్థ (ఏపీపీఎస్సీ) ఎట్టకేలకు శనివారం ప్రకటన (నోటిఫికేషన్‌) జారీ చేసింది. సీఆర్‌ బిస్వాల్‌ సంఘం నూతన ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం వెలువడిన మొట్టమొదటి ప్రకటన ఇదే. వచ్చే నెల నుంచి దరఖాస్తులను స్వీకరించి మేలో పరీక్షలు నిర్వహించాలని ఏపీపీఎస్సీ నిర్ణయించింది.రవాణా సబార్డినేటు సర్వీసులో 64 సహాయ మోటారు వాహన ఇన్‌స్పెక్టరు పోస్టులకు వచ్చే నెల 22 నుంచి ఫిబ్రవరి 21 వరకు దరఖాస్తు చేసుకోవాలి. పరీక్షలు మే 26న జరుగుతాయి.కళాశాల విద్యాశాఖలో 12 మంది వ్యాయామ సంచాలకులు, 21 మంది గ్రంథపాలకుల పోస్టులకు జనవరి 21 నుంచి ఫిబ్రవరి 23 వరకు దరఖాస్తులు చేసుకోవాలి. మే అయిదో తేదీన పరీక్ష నిర్వహిస్తారు.గ్రామీణ నీటిసరఫరా శాఖ సబార్డినేటు సర్వీసులో 362 సహాయ ఇంజినీర్‌ పోస్టులకు వచ్చే నెల 29 నుంచి ఫిబ్రవరి 28 వరకు దరఖాస్తు చేసుకోవాలి. 

మే 26న పరీక్ష నిర్వహిస్తారు.స్త్రీశిశు సంక్షేమ శాఖలో 107 సీడీపీవో పోస్టులకు వచ్చే నెల 22 నుంచి ఫిబ్రవరి 21 వరకు దరఖాస్తులు స్వీకరించి, మే అయిదో తేదీన పరీక్ష జరుపుతారు.ఇంజినీరింగు శాఖలోని సహాయ పరిశోధన అధికారి పోస్టులు 6, పరిశోధక సహాయకుడి పోస్టులు 17, ఇంజినీరింగేతర విభాగంలో మరో పరిశోధక సహాయకుని పోస్టులకు వచ్చే ఫిబ్రవరి అయిదో తేదీ నుంచి మార్చినాలుగో తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. వీరికి మే నెల 5,9,5 తేదీల్లో పరీక్షలు నిర్వహిస్తారు. ఇంజినీరింగు శాఖలో 10 పరిశీలక పోస్టులు, ఇంజినీరింగేతర విభాగంలో ఒక పోస్టులు ఫిబ్రవరి ఎనిమిదో తేదీ నుంచి మార్చి ఏడో తేదీ వరకు దరఖాస్తులను స్వీకరించి మే 23, 26 తేదీల్లో పరీక్షలు జరుపుతారు.వాహన ఇన్‌స్పెక్టరు పోస్టులకు 21 నుంచి 34 ఏళ్ల వయోపరిమితిని నిర్దేశించారు. మిగిలిన పోస్టులకు 18 నుంచి 34 ఏళ్ల వయస్సు గలవారు దరఖాస్తు చేసుకోవాలి. పూర్తి వివరాల కోసం తమ వెబ్‌సైట్‌ను సందర్శించాలని ఏపీపీఎస్సీ కార్యదర్శి కోరారు.

Click Here

Saturday, December 29, 2012

ఏపీపీఎస్సీపై గౌరవం పెంచుతాం



ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(ఏపీపీఎస్సీ) చైర్మన్‌గా చిత్తరంజన్ బిస్వాల్ శుక్రవారం సాయంత్రం బాధ్యతలు స్వీకరించారు. ఇన్నాళ్లూ చైర్మన్‌గా పనిచేసిన రేచల్ ఛటర్జీ పదవీ కాలం శుక్రవారంతో ముగియడంతో ఆ స్థానంలో బిస్వాల్‌ను ప్రభుత్వం నియమించింది. బాధ్యతలు స్వీకరించిన అనంతరం బిస్వాల్ విలేకరులతో మాట్లాడారు. నిరుద్యోగుల్లో ఏపీపీఎస్సీపై ఎలాంటి అపనమ్మకం కలుగకుండా, గౌరవం పెరిగేలా తనవంతు కృషి చేస్తానన్నారు. అందరి సహకారంతో నిరుద్యోగులకు మేలు చేకూర్చేందుకు అవసరమైన అన్ని చర్యలూ చేపడతానన్నారు. పరీక్షలు, ఇంటర్వ్యూల విషయంలో ఎలాంటి అపోహలకూ తావులేకుండా, పారదర్శకతకు పెద్దపీట వేస్తామన్నారు. మెరిట్ సాధించే అభ్యర్థులకు మేలు చేకూర్చేందుకు చర్యలు చేపడతామన్నారు.

అయితే ఇటీవల నిర్వహించిన వివిధ ఉద్యోగాలకు నిర్వహించిన రాత పరీక్షల్లో తప్పులు దొర్లాయని, అనువాద దోషాలు వచ్చాయని ఈ సందర్భంగా విలేకరులు ఆయన దృష్టికి తీసుకెళ్లగా.. తప్పులు దొర్లకుండా, నిరుద్యోగులు ఎవరికీ అన్యాయం జరక్కుండా పక్కా చర్యలు చేపడతామన్నారు. బిస్వాల్ బాధ్యత లు స్వీకరించిన సందర్భంగా ఏపీపీఎస్సీ సభ్యులు నౌమాన్, మాలిక్, ప్రొఫెసర్ జి.పద్దయ్య, పి.రవీందర్‌రావు, గుబ్బా చంద్రశేఖర్, డాక్టర్ బీవీ సోమశేఖర్, జీఎస్ సీతారామరాజు తదితరులు ఆయన్ను మర్యాదపూర్వకంగా కలిశారు. అభినందనలు తెలియజేశారు. అనంతరం కార్యాలయ అధికారులు, సిబ్బంది ఆయన్ను కలిసి అభినందనలు తెలియజేశారు.

ఐదు నోటిఫికేషన్ల జారీకి చర్యలు: వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న ఐదు నోటిఫికేషన్ల జారీకి చర్యలు చేపట్టినట్లు ఏపీపీఎస్సీ ఇన్‌చార్జి కార్యదర్శి ఒక ప్రకటనలో తెలిపారు. నిరుద్యోగులకు వయోపరిమితి సమస్య రావద్దనే ఉద్దేశంతో జీఓ 623 ప్రకారం నిర్ణీత వ్యవధిలో పరీక్షలు నిర్వహించేందుకు నోటిఫికేషన్లు జారీ చేయాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. నోటిఫికేషన్లు జారీ చేయనున్న పోస్టుల్లో అసిస్టెంట్ ఇంజనీర్, ఫిజికల్ డెరైక్టర్, అసిస్టెంట్ మోటారు వెహికల్ ఇన్‌స్పెక్టర్, అబ్జర్వర్లు, రీసెర్చ్ అసిస్టెంట్లు(ఇంజనీరింగ్, నాన్ ఇంజనీరింగ్) పోస్టులు ఉన్నాయని వివరించారు. గ్రూపు-1, గ్రూపు-2లకు సంబంధించి ప్రస్తుతం ఎలాంటి చర్యలూ చేపట్టలేదని తెలిపారు.

2007 GROUP 2 TOTAL CANDIDATES MARK LIST

2007 GROUP 2 TOTAL CANDIDATES MARK LIST

(or)

New Link  


After click on the above link clik on file menu and download the excel sheet.


 

Friday, December 28, 2012

కొత్త నోటిఫికేషన్లకు ఏపీపీఎస్సీ ఆమోదముద్ర

కొత్త నోటిఫికేషన్లకు ఏపీపీఎస్సీ ఆమోదముద్ర

జీవో నెం. 622, 623లకు లోబడే పరీక్షా విధానం

సర్కారు ఆదేశాలే ఫైనల్: రేచల్ చటర్జీ

ఆంధ్ర ప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) లో కొత్త నోటిఫికేషన్ల జారీకి లైన్ క్లియర్ అయ్యింది. దీంతో కొద్ది రోజులుగా జీవో నం.622, 623 ల అమలుపై ఏర్పడిన ప్రతిష్ఠంభనకు తెరదించుతూ.. మూడు కొత్త నోటిఫికేషన్ల విడుదలకు కమిషన్ ఆమోదముద్ర వేసింది. సంబంధిత ఫైళ్లపై గురువారం కమిషన్ సభ్యులందరూ సంతకాలు చేయటం గమనార్హం. గ్రూప్-2లోని ఎగ్జిక్యూటివ్ పోస్టులను గ్రూప్-1 (బి)లో చేర్చిన వ్యవహారంపై నిరుద్యోగుల్లో పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తమవడంతో.. ఆ యా జీవోల అమలుకు సంబంధించిన ఫైళ్లపై సభ్యులు తమ అభిప్రాయాలను వెల్లడించారు.

కమిషన్‌లో ఆమోదం తర్వాతే ఆయా జీవోలను అమలు చేయాలని కోరారు. అయితే ఏపీపీఎస్సీలో తాజా పరిణామాల నేపధ్యంలో ఆ ఫైల్‌పై సభ్యుల అభిప్రాయాలు అవసరం లేదని, ప్రభుత్వ ఉత్తర్వులే ఫైనల్ అని రేచల్ ఛటర్జీ ఫైల్‌లో రాయటంతో ఇక చేసేది లేక సభ్యులందరూ గురువారం సంతకాలు చేశారు. దీంతో జీవో 622, 623లకు అనుగుణంగా కొత్త నోటిఫికేషన్ల జారీకి ఏపీపీఎస్సీ పచ్చజెండా ఊపినట్లయ్యింది. డిపార్ట్‌మెంటల్ పరీక్షల ఫలితాల విడుదలకూ మార్గం సుగమమైంది.

Thursday, December 27, 2012

సభ్యత లేని సభ్యులు - గవర్నర్‌కు ఏపీపీఎస్సీ చైర్‌పర్సన్ నివేదిక

సభ్యుల తీరు ఏ మాత్రం సవ్యంగా లేదని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) చైర్‌పర్సన్ రేచల్ చటర్జీ రాష్ట్ర గవర్నర్‌కు నివేదించారు. తమ అధికార పరిధిని మించి వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వ ఆదేశాలను అమలు కాకుండా అడ్డుకుంటున్నారని ఫిర్యాదు చేశారు. జీవో 420ని ప్రశ్నిస్తూ వ్యాఖ్యలు చేస్తున్నారని నివేదికలో పేర్కొన్నారు. సాఫీగా జరగాల్సిన అభ్యర్థుల ఎంపిక జాబితాల విడుదల విషయంలో ఘోరంగా వ్యవహరించారని, పోస్టుల భర్తీని ఆపేందుకు ప్రయత్నించారని వివరించారు.

నోటిఫికేషన్ విడుదల చేశాక అందుకు అనుగుణంగానే ఎంపిక ప్రక్రియ చేపట్టాలని నిబంధనలు ఉన్నాయని ఆమె స్పష్టం చేశారు. రాత పరీక్షలకు ముందే నిర్ణయం తీసుకుంటే ఇబ్బంది ఉండదని, అభ్యర్థుల ఎంపిక సమయంలో సభ్యులు అడ్డుపడటం వల్ల నిరుద్యోగులు నిరాశా నిస్పృహలకు లోనవుతున్నారని రేచల్ అభిప్రాయపడ్డారు. కమిషన్‌లో మెజారిటీ అభిప్రాయమే చెల్లుబాటుకావాలని సభ్యులు వాదిస్తున్నప్పటికీ.. సర్కారు ఆదేశాలను పాటించాలన్నదే తన అభిప్రాయమన్నారు.

అభ్యర్థుల ఎంపిక విధానంలో అక్రమాలు జరుగుతున్నట్లు ఆరోపణలు చేస్తూ కమిషన్ పరువు తీసేందుకు సభ్యులు సిద్ధపడ్డారని ఆమె తన నివేదికలో పేర్కొన్నారు. కమిషన్ అనుమతి లేకుండా ఫలితాలు ప్రకటించారని కార్యదర్శిపై లోకాయుక్తలో ఫిర్యాదు చే శారని, హైకోర్టు పిటిషన్‌లోనూ అభ్యంతరకరమైన భాష వాడారని వివరించారు. ఈ సందర్భంగా కమిషన్ చైర్‌పర్సన్‌గా ఆమె బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి జరిగిన పరిణామాలను నివేదికలో పేర్కొనట్లు సమాచారం.

మరో ముగ్గురు సభ్యులపైనా ఏసీబీ కన్ను!

రిపుంజయరెడ్డి ఆస్తులకు సంబంధించి స్వాధీనం చేసుకున్న పత్రాల్లో ఏసీబీకి కీలక సమాచారం లభించినట్లు తెలిసింది. దీని ఆధారంగా మరో ముగ్గురు సభ్యుల ఇంటి తలుపు తట్టేందుకు కూడా రెడీ అవుతున్నట్లు సమాచారం. గతంలో ఉద్యోగాలకు జరిగిన మౌఖిక పరీక్షల సందర్భంగా వీరి పాత్రపైనా ఆరోపణలు వచ్చిన నేప«థ్యంలో ఆ ముగ్గురి ఆస్తులపైనా ఏసీబీ కన్నేసినట్లు తెలుస్తోంది.

ఏపీపీఎస్సీకి రిపుంజయరెడ్డి రాజీనామా

ఏపీపీఎస్సీ సభ్యుడి హోదాకు రిపుంజయరెడ్డి రాజీనామా సమర్పించారు. రాజీనామా లేఖను గవర్నర్‌ నరసింహన్కు రిపుంజయరెడ్డి పంపారు. సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ఆదేశాలతోనే తనపై కక్ష సాధింపు చర్యలు చేపట్టారని ఆయన ఆరోపించారు. బంధువుల ఆస్తులు కూడా తన ఆస్తులుగా చూపించారని ఆయన అన్నారు. తనపై వస్తున్న ఆరోపణలపై మనస్థాపం చెందిన తాను రాజీ నామా చేశానని ఓ ప్రశ్నకు రిపుంజయ్‌రెడ్డి సమాధానమిచ్చారు. 

HOSTEL WELFARE OFFICERS (55/2011) FINAL KEY

పచ్చనోట్లే ఇంధనం

 పచ్చనోట్లే ఇంధనంప్రభుత్వ ఉద్యోగుల నియామకం కోసం రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన వివిధ రాష్ట్రాల్లోని ప్రజాసేవా సంఘాలు (పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్స్‌) దోపిడీ కేంద్రాలుగా మారాయి. నిష్పక్షపాతంగా, నిజాయితీతో వ్యవహరించాల్సిన ఈ సంఘాల సభ్యులు.. ఉద్యోగాలను ఎరగాచూపి నిరుద్యోగుల నుంచి రూ.కోట్లలో దండుకొని తమ ఆదాయాన్ని కొండల్లా పెంచుకొంటున్నారు. ఇది ఒక్క ఆంధ్రప్రదేశ్‌కే పరిమితమైన సమస్య కాదు. పొరుగునున్న తమిళనాడులోనూ అక్కడి ప్రజా సేవా సంఘం (ప్రసేసం) సభ్యులు భారీ అక్రమాలకు తెరలేపారు. నిరుద్యోగుల నుంచి పెద్దఎత్తున దండుకున్నారన్న ఆరోపణలపై తమిళనాడు ప్రసేసం ఛైర్మన్‌సహా 13 మంది సభ్యుల గృహాలపై అక్టోబర్‌లో ఆ రాష్ట్ర నిఘా(విజిలెన్స్‌), అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడులు చేశారు. భారీగా నగదు స్వాధీనం చేసుకున్నారు. తాజాగా మన రాష్ట్రంలోనూ ప్రసేసం సభ్యుడు రిపుంజయ రెడ్డి ఇంటిపై బుధవారం అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడులు చేశారు. దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రాల ప్రజా సేవా సంఘాలకు సభ్యులను అక్కడి రాష్ట్ర ప్రభుత్వాలే నియమిస్తున్నాయి. రాజకీయ ఒత్తిళ్లు, లాలూచీ వ్యవహారాలతో అధికారంలో ఉన్న వారూ తమకు అనుకూలమైన వారినే సభ్యులుగా నియమించుకొంటున్నారు. క్రమంగా ఇది సభ్యుల విశృంఖల ప్రవర్తనకు దారితీస్తోంది. డబ్బుకు, సిఫార్సులకు ప్రాధాన్యం పెరగటంతో నిజాయితీగా కష్టపడి చదువుతున్న నిరుద్యోగులు తీవ్రంగా నష్టపోతున్నారు. 

మన రాష్ట్రంలో వై.ఎస్‌. రాజశేఖరరెడ్డి ప్రభుత్వ హయాంలోనూ ఆ తర్వాతా కొంత మంది కాంగ్రెస్‌ నేతలనే ప్రసేసం సభ్యులుగా నియమించిన విషయం తెలిసిందే. ఇలా నియమితులైన సభ్యుల్లో కొందరు అక్రమ వసూళ్లకు తెగించి కోట్ల రూపాయలు పోగేసుకొన్నారన్న ఆరోపణలు వస్తున్న విషయం తెలిసిందే. రాష్ట్ర ప్రసేసం సభ్యుడు రిపుంజయ రెడ్డి ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారన్న సంగతి బుధవారం నాటి అవినీతి నిరోధక శాఖ దాడుల్లో తేలింది. వై.ఎస్‌. సహాయకుడిగా ఉన్న సూరీడుతో కలిసి రిపుంజయరెడ్డి భూములు కొనుగోలు చేసిన విషయం వెలుగులోకి వచ్చింది. 'నాకు అన్ని ఆస్తులు లేవ'ని రిపుంజయ రెడ్డి ప్రకటించిన రెండు రోజుల్లోనే ఏసీబీ దాడుల్లో వాస్తవమేమిటో తెలియవచ్చింది. మిగిలిన సభ్యుల్లో ఒకరిద్దరు కూడా ఇలానే అక్రమాస్తులు కూడబెట్టారని నిరుద్యోగులు ఆరోపిస్తున్నారు. డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌లాంటి కొన్ని ఉద్యోగాలకు ఒక్కొక్కరి నుంచి రూ.15 లక్షల వరకు వసూలు చేశారని వారు చెబుతున్నారు. ఇలాంటి సభ్యుల ఇళ్లపై కూడా దాడులు చేస్తే వారి బండారమూ బయటపడుతుందని అంటున్నారు.రాష్ట్ర ప్రసేసం సభ్యులపై అవినీతి ఆరోపణలు వస్తున్న నేపథ్యంలోనే ఇతర రాష్ట్రాల్లోని ప్రజా సేవా సంఘాల తీరును 'ఈనాడు' పరిశీలించింది. ఈ క్రమంలోనే తమిళనాడు ప్రసేసం ఛైర్మన్‌, 13 మంది సభ్యుల తీరు తెలియవచ్చింది. అక్టోబర్‌ నెలలో ఛైర్మన్‌, సభ్యులందరి ఇళ్లపైనా తమిళనాడు నిఘా-అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడులు చేసినప్పుడు ఒక సభ్యుడి ఇంటిలో ఏకంగా రూ.26.3 లక్షల నగదు పట్టుబడింది. మరో సభ్యుడి సోదరుడి పక్క ఇంటి నుంచి రూ.17 లక్షలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రూ.కోట్ల విలువైన ఆస్తుల్నీ గుర్తించారు. సభ్యులపై అవినీతి నిరోధక చట్టంలోని వివిధ నిబంధనల కింద కేసులు నమోదు చేశారు. సమగ్ర విచారణ జరుగుతోంది.


రిపుంజయరెడ్డి అరెస్టు


రిపుంజయరెడ్డి అరెస్టుపాపం పండింది. నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న ఆంధ్రప్రదేశ్‌ ఏపీపీఎస్సీ సభ్యుడు రిపుంజయరెడ్డి అవినీతి బండారం బట్టబయలైంది. కమిషన్‌లో సభ్యత్వ పదవిని ఆడ్డుపెట్టుకొని రూ.నాలుగు కోట్లకు పైగా అక్రమాస్తులు కూడబెట్టుకున్నట్లు అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) బుధవారం జరిపిన దాడుల్లో వెల్లడైంది. ఇదంతా ఆయన ఏపీపీఎస్సీ సభ్యుడిగా ఎంపికైన తర్వాత సంపాదించిన ఆస్తిగానే భావిస్తున్నామని ఏసీబీ అధికారులు ప్రకటించారు. బుధవారం రాత్రి తొమ్మిదిన్నర గంటలకు రింపుజయరెడ్డిని హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో అరెస్టు చేశారు. ఏసీబీ కార్యాలయానికి తరలించారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఈ అవినీతి బాగోతంపై గవర్నర్‌కు పూర్తి స్థాయి నివేదిక పంపింది. రిపుంజయరెడ్డిని పదవి నుంచి తొలగించాలని సిఫార్సు చేసింది. గురు లేదా శుక్రవారం నిర్ణయం వెలువడే అవకాశం ఉందని సమాచారం. రాష్ట్ర చరిత్రలో ఏపీపీఎస్సీ సభ్యుడు అరెస్టు కావడం ఇదే ప్రథమం.

ఏపీపీఎస్సీ సభ్యులైన కొందరు తమ స్వార్థ ప్రయోజనాల కోసం లక్షలాది మంది యువత ఆశలను దెబ్బ తీస్తున్నారని ఆధారాలతో సహా 'ఈనాడు' ప్రచురించిన కథనాలు తాజా పరిణామాలతో అక్షర సత్యాలే అయ్యాయి.'ఈనాడు' కథనాల నేపథ్యంలో అసలు ఏపీపీఎస్‌సీలో జరిగింది ఏమిటో నివేదికను పంపమని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించిన రెండు రోజుల్లోనే ఏసీబీ దాడులు జరగడం సంచలనం సృష్టించింది. ఏపీపీఎస్‌సీలో పదవిలో ఉంటూ భారీఎత్తున అక్రమాలకు, అక్రమార్జనకు పాల్పడ్డ రిపుంజయరెడ్డికి ఈ పదవిని ఇచ్చింది వై.ఎస్‌.రాజశేఖరెడ్డి కావడం గమనార్హం. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన వ్యక్తిగత సహాయకుడు సూరీడు సిఫార్సుతో ఈ పదవిని ఆయనకు కట్టబెట్టారు. రిపుంజయరెడ్డితో వ్యాపార సంబంధాలున్న సూరీడు ఇంటిమీదా ( హైదరాబాద్‌లో) దాడులు జరిగాయి. అక్కడ రిపుంజయరెడ్డికి సంబంధించిన కొన్ని పత్రాలు లభించాయి. వాటిని అధ్యయనం చేస్తున్నారు. హైదరాబాద్‌లో, రిపుంజయరెడ్డి స్వస్థలమైన కడపలో దాడులు నిర్వహించారు. సోమవారం ఉదయం మొదలైన దాడులు రాత్రి ఎనిమిది గంటల వరకూ కొనసాగాయి. మొత్తం 8 బృందాలు దాడుల్లో పాల్గొన్నాయి. యూసఫ్‌గూడలోని వెంకటగిరిలో ఉన్న ఆయన ఇల్లు, సమీపంలోని ఆయన ఇద్దరు సోదరుల ఇళ్ళు, జుబ్లీహిల్స్‌ గాయత్రీనగర్‌లోని సూరీడు ఇంట్లో సోదాలు నిర్వహించారు. ఏసీబీ డీఎస్పీల ఆధ్వర్యంలో హైదారాబాద్‌లో దాడులు జరిగాయి. దాడుల్లో రూ.నాలుగు కోట్లకుపైగా ముఖ విలువైన ఆస్తులు బయటపడ్డాయి. బహిరంగ మార్కెట్‌లో కొన్ని రెట్ల విలువ ఉంటుందని చెబుతున్నారు. ఈ ఆస్తులన్నీ రిపుంజయరెడ్డి ఏపీపీఎస్సీ సభ్యుడు అయ్యాక సమకూర్చుకున్నవని భావిస్తున్నామని ఏసీబీ డీఎస్పీ చంద్రశేఖర్‌ వెల్లడించారు. రిపుంజయరెడ్డి తొలుత జీవిత బీమా ఏజెంట్‌. 1998 నుంచి 2003 వరకూ జీవిత బీమా సంస్థలో వ్యాపారాభివృద్ధి అధికారిగా పని చేశారు. 2008లో ఏపీపీఎస్సీ సభ్యుడిగా నియమితులయ్యారు.

ఏసీబీ దాడుల్లో తిరుపతి, కొండాపూర్‌, రాజేంద్రనగర్‌లలో ఐదు అపార్లుమెంట్లలో అయిదు ఫ్లాట్లు ఉన్నట్లు వెల్లడయింది. వెంకటగిరిలో మూడు, మణికొండ, గాంధీనగర్‌లలో ఒకటి చొప్పున మొత్తం ఐదు ఇళ్ళ స్థలాలు ఉన్నట్లు తేలింది. కడపలో రెండు, మాదాపూర్‌, కొండాపూర్‌లలో ఒక్కోటి చొప్పున నాలుగు ఇళ్ళు, రిపుంజయరెడ్డి నివసిస్తున్న వెంకటగిరిలోని అపార్టుమెంట్లో మూడు ప్లాట్లు ఉన్నట్లు బయటపడింది. కడప, రేణిగుంటలలో 36 ఎకరాల పొలం ఉంది. పత్రాల రూపంలో ఉన్న స్థిరాస్తి విలువే రూ.3.5 కోట్లు ఉంటుందని ఏసీబీ తెలిపింది. నిందితుడు, అతని కుటుంబ సభ్యుల పేర్లమీద రూ.30.5 లక్షల బ్యాంకు డిపాజిట్లు ఉన్నట్లు గుర్తించామన్నారు. 63 తులాల బంగారం, 3.5 కిలోల వెండి, రూ.12.50 లక్షల విలువైన రెండు కార్లు కూడా స్వాధీనం చేసుకున్నారు. మాదాపూర్‌ కెనరా బ్యాంకులో లాకర్‌ ఉన్నట్లు గుర్తించామని, దాన్ని కూడా పరిశీలించాల్సి ఉందని తెలిపారు. ఇప్పటి వరకు గుర్తించిన మొత్తం ఆస్తుల ముఖ విలువ రూ.4 కోట్లు పైన ఉంటుందని ఆ ప్రకటనలో వివరించారు.



'నాపై కుట్ర జరుగుతోంది. ఏపీపీఎస్‌సీ సభ్యుడయ్యాక నేను ఆస్తులు సంపాదించలేదు' అంటూ రెండు రోజుల కిందట ఈనాడుపై ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన రిపుంజయరెడ్డి అసలు భాగోతాన్ని ఏసీబీ బయటపెట్టింది. 2008లో కమిషన్‌ సభ్యుడైన తరువాతే రూ.4 కోట్ల విలువైన ఆస్తులను సంపాదించారని వెలుగులోకి తెచ్చింది. ఇంకా పెద్దఎత్తున బినామీ పేర్లతో ఆస్తులు ఉన్నాయని అనేక మంది ఈనాడుకు ఫోన్‌ చేసి మరీ చెబుతున్నారు. వై.ఎస్‌. హయాంలో అయిదుగురు సభ్యులు నియమితులు అయ్యారు. అందులో కొందరిపై పెద్దఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. సూరీడు సిఫార్సుతో రిపుంజయరెడ్డి కమిషన్‌ సభ్యుడిగా నియమితుడయ్యాక ఇద్దరి మధ్యా వ్యాపార బంధాలు బలపడ్డాయని చెబుతున్నారు. వీరిద్దరు కల్సి రాష్ట్రంలోని అనేక పట్టణాల్లో రియల్‌ ఎస్టేస్‌ వ్యాపారం చేశారని అంటున్నారు. బినామీ పేర్లతో ఆస్తులు కొన్నారని సమాచారం అందుతోంది. బినామీ పేర్లతో ఉండటంతో ఏసీబీ విచారణలో వెలుగులోనికి రావడం లేదు. సూరీడుతోనే కాకుండా కొంతమంది కాంగ్రెస్‌ నేతలతో కలిసి రిపుంజయరెడ్డి వ్యాపారం చేశారని అంటున్నారు. ఈ వ్యాపారమంతా కమిషన్‌ సభ్యుడిగా నియమితుడయ్యాక చేసిందే. దీన్నిబట్టి చూస్తే కమిషన్‌లో ఎంతపెద్ద ఎత్తున అక్రమాలు చోటు చేసుకున్నాయోననే అనుమానం బలపడుతోంది. కొన్ని పోస్టులకు రూ.2 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు వసూలు చేశారని నిరుద్యోగులు చెబుతున్నారు. 

దీనివల్లే కొందరు సభ్యులు కొద్దికాలంలోనే రూ.కోట్లకు పడగలెత్తారని అంటున్నారు.కమిషన్‌ సభ్యుల్లో అక్రమాలను ఈనాడు వెలుగులోనికి తేవడంతో ప్రభుత్వం, గవర్నర్‌ స్పందించారు. రిపుంజయరెడ్డి అక్రమాలపై 'నాడు అప్పుల్లో, నేడు కోట్లలో' శీర్షికతో కథనం ఇవ్వడంతో ప్రభుత్వం సీరియస్‌గా దృష్టి సారించింది. ఏసీబీ రంగంలోకి దిగింది. దాడులతో కమిషన్‌ సభ్యుల అక్రమాలు వెలుగులోనికి వచ్చాయి. రిపుంజయరెడ్డికి మరికొందరితో ఉన్న అనుబంధాన్ని గురించి ఏసీబీ అధికారులు ఆరాతీస్తున్నారు. బినామీ ఆస్తులు వెలుగులోకి వస్తే మొత్తం మరింత పెరిగే అవకాశం ఉంది.రిపుంజయరెడ్డిని ఏపీపీఎస్సీ పదవి నుంచి తొలగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. రాజ్యాంగబద్ధ సంస్థ అయినప్పటికీ అభియోగాలు వచ్చిన వారిని తొలగించేందుకు ప్రభుత్వానికి అధికారం ఉంటుంది. బుధవారం రిపుంజయరెడ్డి అరెస్టు అనంతరం ప్రభుత్వం రాష్ట్ర గవర్నర్‌కు బుధవారం రాత్రి నివేదిక పంపింది. అరెస్టు నేపథ్యంలో పదవి నుంచి తొలగించాలని కోరినట్లు సమాచారం. గవర్నర్‌ ఆదేశాలకు అనుగుణంగా సభ్యుడి పదవీచ్యుతి ఉత్తర్వులు జారీ అవుతాయని అధికార వర్గాల ద్వారా తెలిసింది. రిపుంజయరెడ్డిని గురువారం కోర్టులో హాజరు పరుస్తారు.

Wednesday, December 26, 2012

ఏపిపిఎస్సి కొత్త ఛైర్మన్ గా చిత్తరంజన్ బిస్వాల్

C.R. BISWAL
ఏపీపీఎస్సీ ఛైర్మన్‌గా బిస్వాల్‌ఈనాడు, హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌ ప్రజాసేవా సంఘం(ఏపీపీఎస్సీ) నూతన ఛైర్మన్‌గా విశ్రాంత ఐఏఎస్‌ అధికారి చిత్తరంజన్‌ బిస్వాల్‌ నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన నియామకం ఈ నెల 29 నుంచి అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది. కమిషన్‌ ప్రస్తుత ఛైర్మన్‌ రేచల్‌ ఛటర్జీ ఈ నెల 28న పదవీ విరమణ పొందనున్నారు. ఏపీపీఎస్సీ సభ్యులపై ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో కొత్త ఛైర్మన్‌ ఎంపిక ఉత్కంఠ కలిగించింది. రేచల్‌ ఛటర్జీ స్థానంలో ఛైర్మన్‌ ఎంపిక కోసం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మిన్నీమాథ్యూ సహా పలువురు అధికారుల పేర్లను పరిశీలించారు. మిన్నీ మాథ్యూను సీఎస్‌గా కొనసాగించే అవకాశం ఉండడంతో ఏపీపీఎస్సీకి మరొకరిని నియమించాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి నిర్ణయించినట్లు తెలిసింది. మిన్నీ మాథ్యూ సైతం ఈ పోస్టుపై అంతగా ఆసక్తి చూపలేదు. ఆమె మినహా ఇతర అభ్యర్థుల పేర్లను పరిశీలించాక చివరికి బిస్వాల్‌ వైపు మొగ్గుచూపారు. ఒడిశాకు చెందిన బిస్వాల్‌ 1981 బ్యాచ్‌ అధికారి. గత నెలాఖరులో పదవీ విరమణ పొందారు. రాష్ట్రంలో పలు శాఖల్లో పనిచేశారు. సాధారణ పరిపాలన శాఖ, ఉన్నత విద్యాశాఖ ముఖ్యకార్యదర్శిగా ఎక్కువ కాలం విధులు నిర్వర్తించారు. పరిపాలన అనుభవాన్ని, రాష్ట్రంలో నెలకొన్న ప్రాంతీయ సమీకరణాలను పరిగణనలోకి తీసుకొని.. రాష్ట్రేతర అధికారి నియామకమే మేలన్న ఉద్దేశంతో బిస్వాల్‌కు అవకాశం ఇచ్చినట్లు తెలుస్తోంది.

Final Answer Key of Accounts Officer In MPL.ACCTS.Sub-Services

SelectionList for Notification No.43/2011 : Dt. 29/12/2011,Lecturers in Government Degree Colleges in A.PCollegiate Education Service

ఏపీపీఎస్సీ కొత్త సారథి ఎవరో? మిన్నీ మాథ్యూనా? పంకజ్ ద్వివేదీయా? ఇన్‌చార్జి పాలనా?

 రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) కొత్త చైర్మన్ నియామకంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ప్రస్తుత చైర్‌పర్సన్ రేచల్ చటర్జీ పదవీ కాలం ఈ నెల 28తో ముగియనుండటమే ఇందుకు కారణం. ఆమె స్థానంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మిన్నీ మాథ్యూను నియమించాలని సీఎం కిరణ్ భావిస్తున్నప్పటికీ.. ఆమె పదవీ కాలం మరో నెల ఉన్నందున కొంత సందేహం వ్యక్తమవుతోంది. మాజీ సీఎస్ పంకజ్ ద్వివేదీని నియమిస్తారా అన్న చర్చ కూడా ఉన్నత స్థాయిలో జరుగుతున్నట్లు తెలిసింది. రేచల్ స్థానంలో ప్రస్తుతానికి ఇన్‌చార్జిని నియమిస్తారన్న వార్తలు కూడా వస్తున్నాయి. గతంలో ఇదే పద్ధతిని అవలంబించినా.. కమిషన్ సీనియర్ సభ్యుల పాత్రపై రకరకాల కథనాలు వినిపిస్తున్న నేపథ్యంలో ఇన్‌చార్జి నియామకంపై సందేహం నెలకొంది. మరో రెండు రోజుల్లో రేచల్ పదవీకాలం ముగుస్తున్నా.. కొత్త చైర్మన్ నియామకంపై ప్రభుత్వం ఇంకా కసరత్తు ప్రారంభించలేదు. ఈ నెల 27- 29 తేదీల్లో జరగనున్న ప్రపంచ తెలుగు మహా సభల నేపథ్యంలో సీఎం ఈ విషయమై దృష్టి సారించే పరిస్థితి కనిపించడం లేదు. ఏపీపీఎస్సీలో వివాదాల నేపథ్యంలో కొత్త చైర్మన్ నియామకం సర్కారుకు పరీక్ష కానుంది.

ప్రతిభ ఉన్నా ఉద్యోగాలు రావడం లేదు: చంద్రబాబు

 తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు 'వస్తున్నా.. మీకోసం' పాదయాత్ర బుధవారం మధ్యాహ్నం కరీంనగర్‌ జిల్లా గంగారం నుంచి ప్రారంభమైంది. గంగారంలో చంద్రబాబు మాట్లాడుతూ విద్యార్థుల్లో ప్రతిభ ఉన్నా ఉద్యోగాలు మాత్రం రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీపీఎస్సీలో వైఎస్‌ తన అనుకూల వ్యక్తులను పెట్టి వ్యవస్థను భ్రష్టుపట్టించారని విమర్శించారు.

సూరీడు ఇంట్లో ఏసీబీ సోదాలు

దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి వ్యక్తిగత సహాయకుడు సూరీడు ఇంటిపై ఏసీబీ దాడి చేసింది. జూబ్లిహిల్స్‌ గాయత్రినగర్‌లోని సూరీడు నివాసంలో సోదాలు నిర్వహిస్తోంది. ఏపీపీఎస్సీ సభ్యుడు రిపుంజయ్‌రెడ్డితో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నారనే నేపథ్యంలో ఈ సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా ఏసీబీ డీఎస్పీ చంద్రశేఖర్‌ మాట్లాడుతూ రిపుంజయ్‌రెడ్డి, సూరీడులు కలిసి ఆస్తులు కూడబెట్టారని చెప్పారు.

ఏపీపీఎస్సీ సభ్యుడి ఇంటిపై ఏసీబీ దాడి

ఏపీపీఎస్సీ సభ్యుడు రిపుంజయరెడ్డి ఇంటిపై ఏసీబీ దాడి చేసింది. యూసఫ్‌గూడలోని ఆయన నివాసంలో ఏసీబీ సోదాలు నిర్వహిస్తోంది. ఈ సోదాలో కొన్ని బ్యాంక్‌ పత్రాలతో పాటు మరికొన్ని కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారని, ఇంటర్‌ బోర్డు, ఏపీపీఎస్సీ సభ్యుడిగా అవినీతి పాల్పడ్డారని ఆరోపణలు రావడంతో రిపుంజయ్‌రెడ్డి నివాసంలో ఏసీబీ సోదాలు నిర్వహిస్తోంది.




Monday, December 24, 2012

నాడు అప్పుల్లో.. నేడు కోట్లల్లో

LIC AGENT &
APPSC MEMBER
నాడు అప్పుల్లో.. నేడు కోట్లల్లోఒక్క పైరవీ అతని జీవితాన్నే మార్చేసింది. నాలుగేళ్లలోనే కోటీశ్వరుడిని చేసింది. మొన్నటి వరకు అపార్ట్‌మెంట్‌లోని ఫ్లాట్‌ను సొంత నిధులతో కొనుగోలు చేసే స్థోమత లేక బ్యాంకు రుణం తీసుకొన్న ఆ అధికారి ఇప్పుడు రాయలసీమలోనూ, రాజధానిలోనూ సుమారు రూ.100కోట్ల విలువైన పొలాలు, స్థలాలు, ఫ్లాట్లు సొంతం చేసుకొన్నారు. ఇంతకీ ఎవరీ ఘనాపాఠి అని ఆలోచిస్తున్నారా! ఆయనే..ఘనత వహించిన ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ సభ్యుడు. సొంత కుటుంబీకుల పేరుతోనూ బినామీ పేర్లతోనూ ఉన్న అతని ఆస్తులను పరిశీలిస్తే అతని సంపాదనా తీరు ఎలా ఉందో ఇట్టే తెలిసిపోతోంది. ఏపీపీఎస్సీ పరీక్షల్లో మౌఖికం ఉండాల్సిందేనని పట్టుపడుతున్న ఈ సభ్యుడి తీరుపై 'ఈనాడు' ప్రతినిధులు దృష్టి సారించినపుడు స్వల్పకాలంలోనే అతను సంపాదించిన ఆస్తులు వెలుగులోకి వచ్చాయి.

ఉద్యోగార్థులకు పైసల పరీక్ష

ఏపీపీఎస్సీలో కొందరు సభ్యుల వ్యవహార శైలిని ఈనాడు వెలుగులోనికి తెచ్చిన విషయం తెలిసిందే. కమిషన్‌లోని ఆరుగురు సభ్యులు ప్రభుత్వ ఆదేశాలను ధిక్కరించి దాదాపు 5 వేల ఉద్యోగ ఖాళీల భర్తీకి ఉద్దేశించిన రాత పరీక్షల ఫలితాలు వెల్లడించకుండా అడ్డుపడిన విషయమూ విదితమే. రాత పరీక్ష ఆధారంగా ఉద్యోగాలిచ్చే అవకాశం ఉన్నా అభ్యర్థులకు మౌఖిక పరీక్షను కూడా నిర్వహించాల్సిందేనని కమిషన్‌ సభ్యులు ఆరుగురు పట్టుబడుతున్నారు. వీరి మొండిపట్టుదలకు కారణం మౌఖికం పేరుతో నిరుద్యోగుల నుంచి రూ.లక్షల్లో లంచాలు దండుకోవటానికేనని పెద్దఎత్తున ఆరోపణలువస్తున్నాయి. గతంలో ఇలాగే కొంతమంది సభ్యులు అక్రమ వసూళ్లకు పాల్పడి రూ.కోట్లు పోగేశారని, ఏపీపీఎస్సీ వ్యవస్థనే అపహాస్యం పాల్జేచేశారు. తాము కోరినంత డబ్బు ముట్టజెప్పిన వారికి మౌఖిక పరీక్షలో అధికమార్కులు వేయటం, ప్రతిభ కలిగి డబ్బులివ్వలేని వారికి చాలా తక్కువ మార్కులు వేయడం వంటి అక్రమాలకు వ్యతిరేకంగా తీవ్ర ఆందోళనలు జరిగాయి. వీటన్నిటి దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం కొన్నింటికి మినహా మిగిలిన పోటీ పరీక్షలకు మౌఖిక పరీక్షలను రద్దు చేసింది. దీంతో అక్రమ సంపాదనకు కొంతవరకు అడ్డుకట్టపడే అవకాశం కలిగింది. ఇది ఏమాత్రం ఇష్టంలేని కమిషన్‌లోని ఆరుగురు సభ్యులు అన్ని పోటీ పరీక్షలకు మౌఖికం ఉండాల్సిందేనని కోరుతున్నారు. దీని కోసమే రాత పరీక్షల ఫలితాలను సైతం వెల్లడించకుండా అడ్డుపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే 'ఈనాడు ప్రతినిధులు' గత కొన్నేళ్లుగా ఏపీపీఎస్సీలో సభ్యుడిగా పని చేస్తున్న ఒక అధికారి ఆర్థిక స్థితిపై ఆరా తీసింది. దీంతో నివ్వెరపరిచే విషయాలు వెలుగులోకి వచ్చాయి. వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి ప్రభుత్వంలో ఆయన అనుంగు అనుచరుడి పైరవీతో ఏపీపీఎస్సీ సభ్యునిగా నియమితుడైన ఈ అధికారి జీవిత విధానం ఒక్కసారిగా మారిపోయింది. తొలుత ఒక ప్రభుత్వ రంగ సంస్థలో అధికారిగా పనిచేసిన ఆయన 2000లో హైదరాబాద్‌లో ఓ అపార్ట్‌మెంట్‌లోని అయిదో అంతస్తులో ఒక ఫ్లాట్‌ను బ్యాంకు రుణంతో కొనుగోలు చేసి అందులోనే నివాసం ఉండేవారు. అలాంటి ఆర్థికస్థితి ఉన్న వ్యక్తి ఏపీపీఎస్సీ సభ్యుడైన తర్వాత కొన్ని ఉద్యోగాల భర్తీకి నిర్వహించిన మౌఖిక పరీక్షల్లో అక్రమ వసూళ్లకు తెరలేపారన్న ఆరోపణలు వచ్చాయి. కొందరు ఏజెంట్లను ఏర్పాటు చేసుకొని వారి ద్వారా ఒకొక్క అభ్యర్థి నుంచి రూ.లక్షకు తగ్గకుండా వసూలు చేసినట్లు తెలిసింది. ఇప్పటికీ ఆయనకు డబ్బులిచ్చి ఉద్యోగాలు రాని బాధితులున్నారని సమాచారం.

ఇవీ ఆస్తులు :

  • కడప జిల్లా సంబేపల్లి, చిత్తూరు జిల్లా కలగడ మండలాల్లోని ఈ రెండు జిల్లాల సరిహద్దులో 50 ఎకరాల పట్టాభూమిని ఈ ఏడాది జులైలో కొనుగోలు చేశారు. 
  • కలగడ మెయిన్‌రోడ్డులో నాలుగు ఎకరాలు, పీలేరు వద్ద కేవీపురం ఒంటిళ్లు వద్ద 6 ఎకరాలు కొనుగోలు చేశారు. 
  • బెంగళూరు-హోసూరు రోడ్డులోని బెంగళూరు గ్రామీణ జిల్లా పరిధిలోని 'గెస్ట్‌లైన్‌ డేస్‌' హోటల్‌ వద్ద 15 ఎకరాలు... 
  • హైదరాబాద్‌ యూసుఫ్‌గూడ ఇండోర్‌ స్టేడియం వెనుక వెంకటగిరి ప్రాంతంలో ఓ అపార్ట్‌మెంట్‌లో ఆరు ప్లాట్లు కుటుంబ సభ్యుల పేరిట కొనుగోలు.. 
  • షాద్‌నగర్‌ సమీపంలో ఓ ద్రాక్ష తోట. 
  • హైటెక్‌ సిటీ వద్ద గురుకుల ట్రస్ట్‌ భూముల్లో ఒక్కోటి వేయి గజాల విస్తీర్ణమున్న మూడు ప్లాట్లు కొనుగోలు చేసి అందులో నాలుగంతస్తుల దుకాణ సముదాయాన్ని నిర్మించారు. 
  • ఆయా ఆస్తులన్నీ భార్య, తండ్రి, సోదరులు, సోదరిలు, మరికొందరు బినామీల పేరిట ఉన్నాయి. 
  • తనను ఏపీపీఎస్సీలో సభ్యునిగా నియమించడంలో సహాయపడిన వై.ఎస్‌. అనుంగు అనుచరుడినే ప్రస్తుతం ఆమడ దూరం పెట్టడం కొసమెరుపు.

Sunday, December 23, 2012

రంగంలోకి నరసింహన్‌

రంగంలోకి నరసింహన్‌ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీసు కమిషన్‌ (ఏపీపీఎస్సీ)లో భారీ కదలిక.. సభ్యుల వ్యవహారంపై ఒకవైపు ప్రభుత్వం చర్యలకు రంగం సిద్ధం చేస్తుంటే, మరోవైపు గవర్నర్‌ కమిషన్‌ తీరుపై ఆగ్రహోదగ్రుడయ్యారు. సమగ్ర నివేదికను పంపాలని ఆదేశించారు. ఇదే సమయంలో ఏడాదికాలంగా నిలిచిపోయిన వేలాది ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన నియామక పక్రియను ఏపీపీఎస్సీ శనివారం నుంచి మొదలుపెట్టింది. నిన్నటి వరకు అన్ని నోటిఫికేషన్ల ఆధారంగా నియామకాలకు మౌఖిక పరీక్ష జరగాల్సిందేనని పట్టుబట్టిన సభ్యులు రెండు రోజులు వచ్చిన ఒత్తిడితో శనివారం నాటికి మరో మెలిక పెడుతూ ఒక్కసారిగా వెనక్కి తగ్గారు. ఈ సంఘటనలన్నీ శనివారం ఒక్కొక్కటిగా జరిగాయి.దీంతో నిరుద్యోగుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. ఏపీపీఎస్సీ సభ్యుల తీరును 'ఈనాడు' వెలుగులోకి తేవడం వల్లే తమకు న్యాయం జరుగుతోందని అనేకమంది నిరుద్యోగులు 'ఈనాడు' కార్యాలయానికి ఫోన్‌ చేసి మరీ కృతజ్ఞలు చెప్పడం గమనార్హం.

ఏపీపీఎస్సీపై వచ్చిన వరస కథనాల నేపథ్యంలో పెండింగులో నియామకాలపై కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ రేచల్‌ ఛటర్జీ దృష్టిపెట్టారు. ఫలితాలపై పూర్తిస్థాయిలో సమీక్షించారు. ఇప్పటికే వెల్లడించిన రాత పరీక్ష ఫలితాల ఆధారంగా అభ్యర్థుల నియామక ప్రక్రియను మొదలుపెట్టారు. డ్రగ్‌ఇన్‌స్పెక్టర్లు (56), వైద్యవిధాన పరిషత్‌ టైపిస్టు పోస్టులు (70), భూగర్భ జలశాఖ టెక్నికల్‌ అసిస్టెంట్‌(1), అసిస్టెంట్‌ హైడ్రాలజిస్టు (1), ఏపీజీఎల్‌ఐ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ (6) ఖాళీలకు అభ్యర్థులను ఎంపిక ఫలితాలను వెల్లడించినట్లు అధికారులు తెలిపారు. ఫైలును మొదట మౌఖిక పరీక్షకోసం పట్టుబడుతున్న కమిషన్‌ సభ్యులకు పంపించారు. ఇప్పటికే తమ వైఖరి వివాదాస్పదంగా మారడంతో ఫలితాల ప్రకట నకు సభ్యులు ఆమోదముద్ర వేశారు. అయితే.. మరో కొర్రీ వేశారు. కమిషన్‌ ఛైర్మన్‌, కార్యదర్శిపై పలువురు సభ్యులు హైకోర్టులో ఫిర్యాదు చేసినందున ఈ నియామక ప్రకియ కోర్టు తుది తీర్పునకు లోబడే ఉండాలంటూ రాసినట్లు తెలిసింది. విచిత్రమేమిటంటే... సభ్యులు హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు ఇంకా విచారణకు స్వీకరించనేలేదు.. అయినా కేసు కోర్టులో ఉందన్నట్లుగా పేర్కొనడం విశేషం.

మరోవైపు.. ఏపీపీఎస్పీ సభ్యుల తీరుపై గవర్నర్‌ నరసింహన్‌ తీవ్ర అసంతృప్తిగా ఉన్నారని సమాచారం. మొదటి నుంచి ఆయన ఏపీపీఎస్‌సీ వంటి రాజ్యాంగబద్ధ సంస్థలు సక్రమంగా పని చేయాలని ఆయన పదేపదే కోరుతూనే ఉన్నారు. అటువంటి రాజ్యాంగబద్ధ సంస్థల్లో ఒకటైన ఏపీపీఎస్సీలో కొందరి సభ్యుల వైఖరి వల్ల లక్షలమంది నిరుద్యోగులకు అన్యాయం జరుగుతుందంటూ 'ఈనాడు'లో వచ్చిన కథనాలు గవర్నర్‌ను కదలించాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవో 420పై వివాదాస్పదంగా అసమ్మతి నోట్‌ ఇచ్చిన వ్యవహారంపై కూడా ఆయన ఆగ్రహంగా ఉన్నారని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కమిషన్‌పై వచ్చిన కథనాలపై తనకు సమగ్ర నివేదికను పంపించాలని ఏపీపీఎస్సీ కార్యదర్శికి లేఖ రాశారు. కమిషన్‌లోని వాస్తవ పరిస్థితులపై పూర్తి సమాచారాన్ని ఇవ్వాలని కోరారు.

APPSC SELECTION LISTS ON DECEMBER 23

SelectionList for Notification No.53/2011 Dt: 31/12/2011,Vaidya Vidhana Parishad for the Post ofPC.Nos. 03 , 06 Junior Accountant, Junior Assistant,Junior Stenographers and Typists in A.P.

http://website.apspsc.gov.in/Documents/SELECTIONLIST/184.pdf


SelectionList for Notification No.11/2012,Technical AssistantGEO PHYSICS in A.P. Ground Water Sub Service

http://website.apspsc.gov.in/Documents/SELECTIONLIST/183.pdf


SelectionList for Notification No.12/2012 Dated: 11/04/2012, Technical AssistantGEO PHYSICS in A.P. Ground Water Sub Service

http://website.apspsc.gov.in/Documents/SELECTIONLIST/182.pdf


SelectionList for Notification No.11/2012,Assistant Hydrologist in A.P. Ground Water Service

http://website.apspsc.gov.in/Documents/SELECTIONLIST/181.pdf

Saturday, December 22, 2012

ముదిరి పాకన పడ్డ ఏపీపీఎస్సీ విభేదాలు

•తారాస్థాయికి చేరిన ఏపీపీఎస్సీ రచ్చ

•మరోసారి లాంగ్‌లీవ్‌పై వెళ్లిన పూనంమాలకొండయ్య

•అంతర్గత విభేదాలే కారణమని అనుమానం

•రెండు నెలల విరామం తర్వాత ఇటీవలే విధుల్లోకి చేరిన పూనం

•సభ్యులు లోకాయుక్తకు వెళ్లడంపై మనస్థాపం...?

•ఆందోళనలో నిరుద్యోగులు

•సభ్యులపై చర్యలకు విద్యార్థి సంఘాల డిమాండ్‌

ఏపీపీఎస్సీలో విభేదాలు ముదిరి పాకాన పడ్డాయి. కొన్నాళ్లుగా కమిషన్‌ సభ్యులకు, అధికారులకు మధ్య విభేదాలతో రాతపరీక్షల ఫలితాలు నిలిచిపోయాయి. ఇప్పటికే అధికారుల తీరును నిరసిస్తూ కొంతమంది సభ్యులు లోకాయుక్తకు వెళ్లడం తదనంతర పరిణామాలతో కార్యదర్శి పూనం మాలకొండయ్య మరోసారి లాంగ్‌లీవ్‌పై వెళ్లిపోయారు.తాజా పరిస్థితులతో నిరుద్యోగుల్లో కలవరం మొదలైంది.మొత్తానికి ఏపీపీఎస్సీ సభ్యులు అనుకున్నది సాధించారు. తమను పట్టించుకోవడం లేదంటూ కమిషన్‌ కార్యదర్శిపై లోకాయుక్తకు కంప్లైంట్‌ చేసినప్పటికీ అక్కడ వెనుదిరిగారు మెంబర్లు. ఎలాగైనా తమ కోపం తీర్చుకోవాలనుకున్నారు. రాత పరీక్షల ఫలితాల విడుదలను అడ్డుకోవడం, ఇంటర్య్వూలు నిర్వహించాలని పట్టుపట్టడం... ఇలా రకరకాలుగా సెక్రటరీతో విభేదిస్తూ వచ్చారు సభ్యులు. కమిషన్‌లోని ఆరుగురు సభ్యులు ఏపీపీఎస్సీ ప్రతిష్టను రచ్చకీడ్చారు.

లక్షలాది నిరుద్యోగులకు ఆశాదీపంగా చెప్పుకునే ఏపీపీఎస్సీలో జరుగుతున్న పరిణామాలతో నిరుద్యోగుల్లో ఆందోళన మొదలైంది.కాలిగాయంతో రెండునెలల విరామం తర్వాత విధుల్లోకి చేరిన కార్యదర్శి పూనం మాలకొండయ్య... జరుగుతున్న పరిణామాలతో విసిగిచెందినట్లు సమాచారం. అందుకే మరోసారి నెలరోజులపాటు సెలవుపై వెళ్లిపోయారు. ఇటీవల కాలంలో వరుసగా రాతపరీక్షల ఫలితాలు విడుదల చేస్తూ నిరుద్యోగుల్లో ఆశలు నింపారు. ఇప్పుడు పూనం సెలవుపై వెళ్లడం, త్వరలోనే ఛైర్‌పర్సన్‌ పదవీకాలం ముగుస్తుండటంతో నిరుద్యోగులు ఆందోళన చెందుతున్నారు. ఎన్నో ఆరోపణలు ఎదుర్కొంటున్న మెంబర్లపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి, యువజన సంఘాలు కమిషన్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగుతున్నారు. పెండింగ్‌లో ఉన్న ఫలితాలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు.ఇప్పటికే ఫలితాలు విడుదల కోసం లక్షలాదిమంది ఎదురుచూస్తుంటే తాజా పరిణామాలతో అసలు ఎప్పుడు వస్తాయో తెలియని గందరగోళం నెలకొంది. ఇప్పటికైనా ప్రభుత్వం ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని నిరుద్యోగులు డిమాండ్‌ చేస్తున్నారు.

DRUG INSPECTOR FINAL SELECTION LIST

ASSISTANT SOCIAL WELFARE OFFICER IN A.P. SOCIAL WELFARE SERVICE CERTIFICATE VERIFICATION LIST

తప్పుల కుప్ప! వివాదాల కేంద్రంగా ఏపీపీఎస్సీ నియామకాలన్నీ కేరాఫ్ కోర్టులే అనువాద దోషాలు.. తప్పుడు 'కీ'లు, పరిధి దాటే ప్రశ్నలు ప్రహసనంగా మారిన ఇంటర్వ్యూల ప్రక్రియ నిరుద్యోగులతో కమిషన్, సర్కారు ఆటలు

ఆర్థిక మాంద్యం సమయంలో ప్రైవేటు కొలువులు గాలిలో దీపాలుగా మారాయి. అప్పటిదాకా వేలు, లక్షల్లో జీతాలందుకున్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు దిక్కుతోచక రోడ్డున పడ్డారు. అప్పుడు అందరికీ తెలిసొచ్చింది... ప్రభుత్వ ఉద్యోగానికి ఉన్న విలువెంతో! ఆ తర్వాత సర్కారీ కొలువులకు క్రేజ్ మరింత పెరిగింది. ఒక్కొక్కరు పుస్తకాల పురుగులయ్యారు. వేల రూపాయలు ఖర్చుపెట్టి కోచింగ్‌లు తీసుకుంటున్నారు. పోస్టుల సంఖ్య వందల్లో, పోటీపడే అభ్యర్థుల సంఖ్య లక్షల్లో! కానీ... ఘనత వహించిన మన ఏపీపీఎస్సీ నోటిఫికేషన్లు విడుదల చేసిన ప్రతిసారీ నిరుద్యోగులను ముప్పతిప్పలు పెట్టి ముప్పై చెరువుల నీళ్లు తాగిస్తోంది. కమిషన్ అసమర్థ నిర్వాకంవల్ల కోర్టుల్లో కుప్పలు తెప్పలుగా పిటిషన్లు దాఖలవుతున్నాయి.

అతని పేరు శ్రీనాథ్. 2008 డిసెంబర్‌లో ఏపీపీఎస్సీ జారీ చేసిన గ్రూప్-2, గ్రూప్-1 నోటిఫికేషన్లకు శ్రీనాథ్ దరఖాస్తు చేసుకున్నాడు. రెండింటిలో నెగ్గాడు. కానీ... ఇప్పటిదాకా ఏ ఉద్యోగమూ రాలేదు. సుమారు మూడేళ్ల సర్వీసు, జీతం, జీవితం కోల్పోయి... కుటుంబ సభ్యులు, మిత్రులకు సమాధానం చెప్పుకోలేక పీకల్లోతు అప్పుల్లో మునిగి శ్రీనాథ్‌లాంటి వారు ఎంతోమంది దిక్కులు చూస్తున్నారు. దీనికి కారణం... సర్వీస్ కమిషన్ నిర్వాకమే. గ్రూప్-2 విషయానికి వస్తే... రాత పరీక్షలో తెల్లఇంకు (వైట్‌నర్) వాడటం నిషిద్ధమని కమిషన్ స్పష్టంగా చెప్పలేదు. దీంతో కొందరు వైట్‌నర్‌ను వాడారు. ఇలా.. తెల్ల ఇంకు వాడిన అభ్యర్థులను తొలగించాలని కొందరు ట్రిబ్యునల్‌లో పిటిషన్ వేశారు. ఈ వివాదం హైకోర్టుకు, ప్రస్తుతం సుప్రీం కోర్టుకు చేరింది. సుప్రీం తీర్పురానిదే ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు అందవు. ఇది పూర్తవడానికి ఎన్ని నెలలైనా పట్టొచ్చు. ఇక.. గ్రూప్-1 పోస్టుల భర్తీకి కమిషన్ 2008 డిసెంబర్ 31న నోటిఫికేషన్ విడుదల చేసింది. 2011కు గానీ మెయిన్స్ పరీక్ష నిర్వహించలేకపోయారు. మెయిన్స్ పరీక్షల్లో తెలుగు మాధ్యమ ప్రశ్నపత్రాల్లో దర్శనమిచ్చిన అనువాద దోషాలు ఏపీపీఎస్సీ పరువుతీశాయి. పరీక్షను రద్దు చేయాలని కోర్టు తీర్పు ఇవ్వకపోవడంతో కమిషన్ ఊపిరి పీల్చుకుంది. అయితే... కోర్టు తీర్పు ప్రకారం మార్కుల్లో మార్పులు చేయాల్సి ఉండటంతో నియామక ప్రక్రియ పెండింగ్‌లో పడింది.

ఇక 2011లో జారీ అయిన గ్రూప్-1 నోటిఫికేషన్‌ది మరో కథ! ఇప్పటికే ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షలు ముగిసి ఫలితాల కోసం అభ్యర్థులు ఎదురుచూస్తున్నారు. ప్రిలిమ్స్‌లో ఆరు ప్రశ్నలకు తప్పుడు జవాబులున్నట్టు గ్రహించి కమిషన్ వాటికి అందరికీ మార్కులిచ్చింది. మరో ఏడు ప్రశ్నలకు ఏపీపీఎస్సీ తన 'కీ'లోనే తప్పుడు జవాబులు ఇచ్చింది. దీనివల్ల తాము మెయిన్స్‌కు అర్హత కోల్పోయామంటూ కొందరు రాష్ట్ర పరిపాలనా ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు. ఈ కేసు కొనసాగుతోంది. డిగ్రీ అధ్యాపక పోస్టుల భర్తీదీ అదే కథ! రాత పరీక్ష 'కీ' విడుదల చేయకుండా ఇంటర్వ్యూలు జరపడం సరికాదంటూ అభ్యర్థులు కొందరు కోర్టుకెక్కారు. ఇంటర్వ్యూలు ముగియగానే 'కీ' విడుదల చేయాలని ఏపీపీఎస్సీని హైకోర్టు ఆదేశించింది. జూనియర్ లెక్చరర్ పోస్టుల భర్తీకి నిరుడు నిర్వహించిన జనరల్ స్టడీస్ రాత పరీక్షలో మొత్తం 150 ప్రశ్నలకు 30 ప్రశ్నలు పూర్తిగా ఆంగ్లంలో, మరో 33 ప్రశ్నలు సగం ఆంగ్లం- సగం తెలుగులో ఉండటం చూసి తెలుగు మాధ్యమం అభ్యర్థులు కంగుతిన్నారు.

ఇక 2008 గ్రూప్-2, 2011 గ్రూప్-2 నోటిఫికేషన్ల రాత పరీక్షల 'కీ' ని కమిషన్ ఇంకా ప్రకటించలేదు. సమాచారం లేదు... రాదు! ఏపీపీఎస్సీ పారదర్శకతకు ఆమడ దూరంలో ఉంటుంది. 'అసలు ఏమిటీ గందరగోళం? ఏది నిజం?' అని ఎవరైనా సమాచార హక్కు చట్టం కింద ఏపీపీఎస్సీకి దరఖాస్తు చేసుకుంటే... అది వారి అమాయకత్వమే అవుతుంది. కమిషన్ నుంచి వారికి 'ఫీల్ గుడ్' తరహా సమాధానమొస్తుంది! "నియామకాల ప్రక్రియ బ్రహ్మాండంగా సాగుతోంది. ఎంపిక ప్రక్రియ పూర్తికాగానే మీరు కోరిన సమాచారం పువ్వులో పెట్టి ఇస్తాం'' అంటూ రొటీన్ సమాధానం ఇస్తుంది. ఆర్టీఐ చట్టాన్ని పదేపదే తుంగలో తొక్కుతుండటంతో ఏపీపీఎస్సీకి రాష్ట్ర సమాచార కమిషన్ జరిమానాల రూపంలో మొట్టికాయలు వేసింది. మాయదారి ఇంటర్వ్యూలు రాత పరీక్షలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన అభ్యర్థులు సైతం ఏపీపీఎస్సీ చిత్ర విచిత్ర ఇంటర్వ్యూల దెబ్బకు బొక్కబోర్లాపడుతుంటారు. ఇంటర్వ్యూల నిర్వహణకు ఏపీపీఎస్సీ సభ్యుల నాయకత్వంలో నాలుగైదు బోర్డులు ఏర్పాటవుతుంటాయి. పీజీలు, ఎంఫిల్‌లు చేసి ఏళ్లతరబడి పోటీపరీక్షలకు సన్నద్ధమై ఇంటర్వ్యూ దశకొచ్చిన తమను కమిషన్‌లో సాధారణ విద్యార్హతలు గల సభ్యులు కొందరు మిడిమిడి జ్ఞానంతో నేలబారు ప్రశ్నలు వేసి విసిగిస్తున్నారనేది అభ్యర్థుల విమర్శ.

కమిషన్ ఛైర్మన్‌గా వెంకట్రామిరెడ్డి ఉన్నప్పుడు మౌఖిక పరీక్షల తీరుతెన్నులపై పలు ఆరోపణలు వెల్లువెత్తాయి. అనంతరం ఏపీపీఎస్సీలో అక్రమాలు, అవకతవకలపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సత్యనారాయణ కమిటీ.. గ్రూప్-1, జేఎల్-డీఎల్ మినహా ఇతర పోస్టులకు మౌఖిక పరీక్షలు అక్కర్లేదని అది తేల్చి చెప్పింది. ఆ ప్రకారం గ్రూప్-2 సహా ఇతర పోస్టులకు ఇంటర్వ్యూలు ఉండవంటూ రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 420 జారీ చేసింది. తమ పెత్తనానికి ఈ జీవో గండికొడుతుందని భావించిన ఏపీపీఎస్సీ సభ్యులు అది అమలు కాకుండా ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్నీ చేశారు. ఇండస్ట్రియల్ ప్రమోషన్ ఆఫీసర్లు, ఫ్యాక్టరీ ఇన్‌స్పెక్టర్లు, అసిస్టెంట్ డైరెక్టర్స్ ఇన్ ఏపీ లైఫ్ ఇన్స్యూరెన్స్, అసిస్టెంట్ డైరెక్టర్ ఇన్ ఏపీ టౌన్ ప్లానింగ్ పోస్టులకు కొద్ది నెలల క్రితం రాత పరీక్షలు నిర్వహించారు. వాటికి ఇంటర్వ్యూలు ఉండవని నోటిఫికేషన్లలో ఏపీపీఎస్సీ స్పష్టీకరించింది. అయినా, మౌఖిక పరీక్షలు జరపాల్సిందేనని మొండికేసిన కమిషన్ సభ్యులు రాత పరీక్షల ఫలితాలు విడుదలవకుండా ఆపేయించారు. జీవో 420ను అమలు చేయాల్సిందేనని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మిన్నీ మ్యాథ్యూ ఆదేశాలివ్వడంతో త్వరలో ఆ పరీక్షల ఫలితాలు విడుదలకు కమిషన్ ఏర్పాట్లు చేస్తోంది. ఓటు బ్యాంకు రాజకీయాలు నిరుద్యోగుల జీవితాలు బుగ్గిపాలవడానికి ఆయా రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు, వాటి ఓటు బ్యాంకు రాజకీయాలూ కారణమే. ఖాళీల సంఖ్య ఎక్కువా , తక్కువా అనే దానితో నిమిత్తం లేకుండా యూపీఎస్సీ ప్రతి ఏటా క్రమం తప్పకుండా నోటిఫికేషన్లు జారీ చేస్తుంది. షెడ్యూల్ ప్రకారం నియామక ప్రక్రియ ముగించేస్తుంది. మన రాష్ట్రంలో పరిస్థితి ఇందుకు విరుద్ధం. ఐదేళ్లకోసారి ఎన్నికలొచ్చినప్పుడే అధికార పార్టీలకు నియామకాల సంగతి గుర్తొస్తుంది.

 2009 అసెంబ్లీ ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకుని 2008 డిసెంబరులో నాటి కాంగ్రెస్ ప్రభుత్వం గ్రూప్స్ నోటిఫికేషన్లు జారీ చేసింది. అభ్యర్థుల వయోపరిమితిని 34 ఏళ్ల నుంచి 39 ఏళ్ల వరకు పెంచి ఐదేళ్ల మినహాయింపు ఇచ్చింది. 2011లో గ్రూప్స్ నోటిఫికేషన్ జారీ చేసినప్పుడు మాత్రం కిరణ్ సర్కారు పూర్వసంప్రదాయానికి నీళ్లొదిలి ఓపెన్ అభ్యర్థుల్ని 36 ఏళ్ల వరకే అనుమతించింది. ఫలితంగా వేల మంది పరీక్ష రాసే అర్హత కోల్పోయారు. 2014 ఎన్నికల సంవత్సరం కావడంతో... ఏపీపీఎస్సీ నుంచి నోటిఫికేషన్ల జాతర మొదలయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. గ్రూప్-1లో 300, గ్రూప్-2లో 600 ఎగ్జిక్యూటివ్, వెయ్యి నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఉండొచ్చని నిరుద్యోగుల అంచనా. రాబోయేది 'ఎన్నికల నోటిఫికేషన్' కనుక ఈసారి గరిష్ఠ వయో పరిమితి 39 ఏళ్లుగా నిర్ణయించవచ్చుననే అంచనాతో... సీనియర్ అభ్యర్థులు కూడా పరీక్షలకు సన్నద్ధమవుతున్నారు. కాగా.. ఎన్నికల్లో ఓడిన వారు, ఏ పదవులూ దక్కక అసమ్మతితో రగిలే చోటా నేతల్ని సంతృప్తిపర్చడానికి ఏపీపీఎస్సీని ఓ రాజకీయ పునరావాస కేంద్రంగా వాడుకుంటున్నాయి.

గల్లీ నాయకులూ కమిషన్ సభ్యులుగా నియమితులై నెలకు రూ.79 వేల గౌరవ వేతనం పొందుతూ దర్జా వెలగబెడుతున్నారు.

26న మోడీ ప్రమాణ స్వీకారం

గుజరాత్‌ ఎన్నికల్లో విజయదుందుభి మోగించిన నరేంద్రమోడీ ఈ నెల 26న నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయనున్నారు. రాజ్యాంగ నిబంధనల ప్రకారం ఎన్నికల ఫలితాల వెల్లడి అనంతరం... కొత్త సభ ఏర్పాటుకు వీలుగా ముఖ్యమంత్రి, ఆయన మంత్రివర్గం రాజీనామా చేయాల్సి ఉంటుంది. శుక్రవారం మోడీ రాజ్‌భవన్‌కు వెళ్లి... తన రాజీనామాను, మంత్రివర్గ సభ్యుల రాజీనామా పత్రాలను గవర్నర్‌ కమలా బేణీవాల్‌కు అందించారు. కొత్త అసెంబ్లీ ఫలితాలు వెల్లడయిన గురువారమే ప్రస్తుత అసెంబ్లీని గవర్నర్‌ రద్దుచేశారు. భాజపా శాసనసభాపక్ష నేతగా మోడీని ఎన్నుకునేందుకు ఈనెల 25న భాజపా ఎమ్మెల్యేలు సమావేశమవుతారు. ఈ సమావేశానికి పరిశీలకుడిగా పార్టీ సీనియర్‌ నేత అరుణ్‌జైట్లీ హాజరవుతారు. ఆ మరుసటి రోజు (26న) మోడీ సీఎంగా ప్రమాణం చేస్తారు.

ఆగ్నేయాసియా నేతలకు అపూర్వ విందు

 ఆగ్నేయాసియా దేశాల కూటమి(ఆసియాన్‌) ఏర్పాటై రెండు దశాబ్దాలు పూర్తయిన సందర్భంగా ఢిల్లీలో నిర్వహిస్తున్న రెండు రోజుల సదస్సుకు విచ్చేసిన వివిధ దేశాల నేతలకు ఢిల్లీలోని తాజ్‌ హోటల్‌లో భారత ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ అపూర్వ విందును ఇచ్చారు. ఆయన సతీమణి గుర్షన్‌ కౌర్‌ అతిథులను సాదరంగా ఆహ్వానించారు.

త్వరలో భారత్‌ సొంత దిశానిర్దేశ వ్యవస్థ

హైదరాబాద్‌: దిశానిర్దేశ (నావిగేషన్‌) రంగంలో ప్రపంచవ్యాప్తంగా అధునాతన మార్పులు వస్తున్నాయని, జీపీఎస్‌ అవసరాల దృష్ట్యా ఉపగ్రహ దిశానిర్దేశ అనుసంధాన అభివృద్ధి ప్రస్తుతం కీలకంగా మారిందని కేంద్ర శాస్త్ర, సాంకేతిక మంత్రి జైపాల్‌రెడ్డి పేర్కొన్నారు. డీఆర్‌డీవో, ఉస్మానియా విశ్వవిద్యాలయానికి చెందిన రీసెర్చ్‌ అండ్‌ ట్రైనింగ్‌ యూనిట్‌ ఫర్‌ నావిగేషనల్‌ ఎలక్ట్రానిక్స్‌(ఎన్‌ఈఆర్‌టీయూ) ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని జరిగిన రెండు రోజుల 'నావిగేషన్‌ అండ్‌ కమ్యూనికేషన్‌-2012' ముగింపు సమావేశంలో ఆయన ప్రసంగించారు. అమెరికా(జీపీఎస్‌), రష్యా(గ్లోనస్‌), ఈయూ(గెలీలియో), చైనా(కాంపాస్‌) మాదిరిగా భారత్‌ సొంత దిశానిర్దేశ వ్యవస్థ 'ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్‌' త్వరలో వాస్తవరూపం దాలుస్తుందని తెలిపారు. ఈ రంగంలో పోటీని తట్టుకునేందుకు, భవిష్యత్తు సవాళ్లను ముందుగానే గుర్తించి అధిగమించే కొత్త, ఆధునాతన సాంకేతితకను మనం అందిపుచ్చుకోవాల్సి ఉందన్నారు. యూపీఏ 12వ పంచవర్ష ప్రణాళికా కాలంలో శాస్త్ర సాంకేతిక పరిశోధన అభివృద్ధికి రూ.60 వేల కోట్లు ఖర్చు చేసిందని తెలిపారు. గతంతో పోలిస్తే 20% అధికమన్నారు. అయితే పరిశోధనల పరంగా విశ్వవిద్యాలయాల పనితీరుపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. నాణ్యమైన పరిశోధనలను కొనసాగించాలని సూచించారు. అంతర్జాతీయ భాగస్వామ్వ కార్యక్రమాల్లో పాల్గొని విదేశాలతో సమానంగా శాస్త్ర, రక్షణ అభివృద్ధికి విద్యాసంస్థలు, జాతీయ ప్రయోగశాలలు కలిసి కృషి చేయాల్సిన అవసరముందన్నారు.

  జపాన్‌లో ప్రతిపక్ష ఎల్డీపీ జయకేతనం!

 ప్రధాని పీఠం అధిష్ఠించనున్న షింజో అబే.

 జపాన్ పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతిపక్ష 'లిబరల్ డెమొక్షికాటిక్ పార్టీ' (ఎల్డీపీ) జయకేతనం ఎగురవేసింది. పార్లమెంట్ దిగువసభలోని మొత్తం 480 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో ఎల్డీపీ అత్యధికంగా 294 స్థానాలను కైవసం చేసుకుంది. అధికార డెమొక్షికాటిక్ పార్టీ కేవలం 57 స్థానాలతో సరిపెట్టుకుని అత్యంత ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ఈ ఫలితాలకు సంబంధించిన అధికారిక ప్రకటన మంగళవారం ఉదయం వెలుడనుంది. మూడేళ్ల వ్యవధిలో ముగ్గురు ప్రధానులు మారడం, అస్తవ్యస్త పరిపాలన కొనసాగించడం, 2009 ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడం వంటివి అధికార పార్టీపట్ల ప్రజల వ్యతిరేకతకు ప్రధాన కారణలయ్యాయి. వీటితోపాటు 2011లో సునామీ భూతం ఫుకుషిమా అణువిద్యుత్ కేంద్రం కుప్ప కూలడం కూడా అధికార పార్టీ ఓటమికి దారితీసింది. ఓటమి నేపథ్యంలో ప్రస్తుత ప్రధాని యోషిహికో నోడా రాజీనామా చేయనున్నట్లు ప్రకటించారు. ఎల్డీపీ గెలుపుతో ఆ పార్టీ నేత, మాజీ ప్రధాని షింజో అబే మరోసారి జపాన్ ప్రధాని పీఠాన్ని అధిష్ఠించబోతున్నారు. షింజో మాట్లాడుతూ.. చైనాతో వివాదానికి కేంద్రబిందువైన దీవుల సార్వభౌమాధికారం విషయంలో రాజీపడేదిలేదని హెచ్చరించారు. ఎన్నికల్లో ప్రజలు తమకు ఊహించినదానికన్నా ఎక్కువ స్థానాలు కట్టబెట్టి బాధ్యత పెంచారని వ్యాఖ్యానించారు.    

చీఫ్ జస్టిస్‌పై అభిశంసనకు శ్రీలంక అప్పీల్ కోర్టు చెక్

శ్రీలంక తొలి మహిళా చీఫ్ జస్టిస్ శిరాని బండారునాయకేకు వ్యతిరేకంగా పార్లమెంటరీ కమిటీ అభిశంసన ప్రక్రియను శుక్రవారం అప్పీల్‌కోర్టు నిలిపివేసింది. పార్లమెంటు స్పీకర్, సెలక్ట్ కమిటీ సభ్యులను జనవరి 3న తన ఎదుట హాజరు కావాలని న్యాయస్థానం ఆదేశించింది. కోర్టు విచారణ ముగిసే వరకు చీఫ్ జస్టిస్ గౌరవానికి భంగం కలిగే చర్యలు తీసుకోవద్దని స్పష్టం చేసింది.

సైంధవులపై వేటు!

లక్షలమంది నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుకుంటున్న ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌సర్వీస్‌ కమిషన్‌ (ఏపీపీఎస్సీ) సభ్యులను తొలగించడమే (అభిశంసించడం) మేలన్న నిర్ణయానికి రాష్ట్ర ప్రభుత్వం వచ్చిందని అత్యంత విశ్వనీయ వర్గాలు తెలిపాయి. వీరి తొలగింపునకు సంబంధించి శుక్రవారమే న్యాయనిపుణుల అభిప్రాయాలను తీసుకున్నట్లు సమాచారం. ఏపీపీఎస్సీ సభ్యుల వ్యవహార శైలిపై రెండు రోజులుగా 'ఈనాడు' వెలుగులోకి తెచ్చిన కథనాలు సంచలనం సృష్టించాయి. ఈ కథనాల నేపథ్యంలో రాష్ట్రంలో లక్షల మంది నిరుద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారం నిరుద్యోగ యువత ఆశలకు సంబంధించింది కావడంతో ప్రభుత్వం దీనిపై తీవ్రంగా స్పందించింది. ఏపీపీఎస్సీలో ఏమి జరుగుతోందన్న దానిపై శుక్రవారం ఉన్నతస్థాయి వర్గాల ద్వారా నివేదిక తెప్పించుకుందని సమాచారం. కొందరు సభ్యుల వ్యవహార శైలి ఏమాత్రం సంతృప్తికరంగా లేదన్న నిర్ణయానికి వచ్చింది. కొందరు సభ్యుల తీరు రాజ్యాంగ సంస్థ పరువు తీసేలా ఉందని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి.

ఏపీపీఎస్సీ నిర్వహించే కొన్ని పరీక్షలకు మౌఖిక పరీక్షను నిలుపు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం 420 జీవోను జారీ చేసింది. ఆ పరీక్షలకు మౌఖిక పరీక్ష లేకుండానే రాత పరీక్ష ఆధారంగా భర్తీ చేయొచ్చు. దీన్ని కమిషన్‌కు చెందిన ఆరుగురు సభ్యులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ జీవో జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వాన్నే దాదాపు నిలదీసినంత పనిచేశారు. జీవోపై ముఖ్యమంత్రికి కొందరు సభ్యులు లేఖ రాశారు. ఆ లేఖలో వారు ప్రస్తావించిన అంశాలు చాలా దారుణంగా ఉన్నాయని అధికారులు అభిప్రాయానికి వచ్చారు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తెచ్చారు. గత ఏడాది కాలంగా దాదాపు ఐదు వేల ఖాళీలను భర్తీ చేయాల్సి ఉండగా కమిషన్‌ సభ్యులు అడ్డుచెప్పడంతో ఆ ప్రక్రియ నిల్చిపోయింది. దీంతో పరీక్షలు రాసిన పదిలక్షలమంది అభ్యర్థుల భవిష్యత్తు త్రిశంకు స్వర్గంలో ఉండిపోయింది. సభ్యుల తీరుపై వందల మంది నిరుద్యోగులు అటు ప్రభుత్వానికి ఇటు ముఖ్యమంత్రికి కూడా పెద్దఎత్తున ఫిర్యాదు చేశారు.కొన్ని నియామకాలకు సంబంధించి దస్త్రాలను కొన్ని నెలలపాటు కొంతమంది సభ్యులు దాచిపెట్టడం కూడా ప్రభుత్వం దృష్టికి వచ్చింది. పరిస్థితి ఇలానే ఉంటే మొత్తం ప్రభావం నిరుద్యోగులపై పడుతుందన్న నిర్ణయానికి సర్కార్‌ వచ్చింది. తక్షణం సంబంధిత సభ్యులను తొలగించకపోతే ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందన్న భావనకు వచ్చింది. కమిషన్‌ సభ్యుల తొలగింపు కష్టసాధ్యమైన విషయం కాబట్టి దీనిపై శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం ఉన్నతస్థాయి న్యాయనిపుణులతో సంప్రదింపులు జరిపి నివేదికను తీసుకున్నట్లు చెబుతున్నారు. ముందుగా సంబంధిత సభ్యులపై రాష్ట్ర గవర్నర్‌ ద్వారా రాష్ట్రపతికి ఫిర్యాదు చేయాలన్న నిర్ణయానికి ప్రభుత్వం వచ్చినట్లు తెలిసింది. రాష్ట్రపతికి అందిన ఫిర్యాదు సుప్రీం కోర్టుకు చేరిన తరువాత దీనిపై విచారణ జరుగుతుంది. అక్కడ విచారణ పూర్తయిన తరువాత సభ్యులను తొలగిస్తారు. ఈ లోపు వారిని పదవుల నుంచి సస్పెండ్‌ చేసే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి.

మహా వాగ్గేయ కవి క్షేత్రయ్య

కర్ణాటక సంగీతంలో పేరెన్నికగన్న వాగ్గేయకారులలో క్షేత్రయ్య (1595-1660) ఒకడు. ఈయన అసలు పేరు మెువ్వా వరదయ్యగా భావిస్తున్నారు. అనేక పుణ్యక్షేత్రాలు, దేవాలయాలను సందర్శిస్తూ వాటి గురించి వివరాలు తెలుసుకుంటూ ఉండటం చేత ఈయనకు క్షేత్రజ్ఞుడనే పేరు వచ్చింది. క్రమేణా అది క్షేత్రయ్యగా మారింది. క్షేత్రయ్య జీవితకాలం 1595 - 1660 మధ్యకాలం కావచ్చును. ఇతని అసలుపేరు వరదయ్య. ఇంటిపేరు మెువ్వ. క్షేత్రయ్య పదాలలోని వరద అనే ముద్ర స్వనామ ముద్రగా భావించి అతని అసలుపేరు ’వరదయ్య’గా నిర్ణయించారు. ఈయన జన్మస్థ్థలం ప్రస్తుత ఆంధ్ర ప్రదేశ్‌లోని, కృష్ణా జిల్లాలో మెువ్వ గ్రామం. ఆ ఊరిలో వెలసిన వేణుగోపాల స్వామి క్షేత్రయ్యకు ఇష్టదైవం.

క్షేత్రయ్య
జనబాహుళ్యంలో ఉన్న కథ ప్రకారం చిన్నతనంనుండి వరదయ్యకు గాన అభినయాలంటే మక్కువ. కూచిపూడిలో ఒక ఆచార్యుని వద్ద నాట్యం నేర్చుకొన్నారు. సహపాఠి అయిన మోహనాంగి అనే దేవదాసితో సన్నిహితుడైయ్యారు. తరువాత మేనమామ కూతురు రుక్మిణిని పెండ్లాడారు. కానీ మోహనాంగి పట్ల అతని మక్కువ తగ్గలేదు. దేవదాసి అయిన మోహనాంగి చాలా వివేకం కలిగిన పండితురాలు. తమ ఆరాధ్య దైవమైన మువ్వగోపాలునిపై నాలుగు పదాలు పాడి తనను మెప్పించగలిగితే తాను వరదయ్య ప్రేమను అంగీకరిస్తానని మోహనాంగి షరతు విధించిందట. మోహనాంగి పెట్టిన షరతు కోసం వరదయ్య నిరంతరం సాధన చేయసాగాడట. ఆ సాధన కారణంగా ప్రపంచములోని జీవాత్మలన్నీ స్ర్తీలని, పరమాత్ముడయిన మువ్వగోపాలుడొక్కడే పురుషుడనే తత్వం వరదయ్యను అలుముకొన్నదట. క్రమంగా ఆ మధురభక్తితో అనేక పాటలు పాడాడు. వాటికి మోహనాంగి నాట్యం చేసిందట. బాల్యంలో విద్యాగంధం లేని వరదయ్య పశువుల కాపరిగా ఉండేవాడు. ఒక యోగి ఇతనికి ’గోపాల మంత్రం’ ఉపదేశించాడు. ఆనాటి నుండి అతనికి గొప్ప కవితా శక్తి అలవడిందని మరో కథనం..


గుర్తింపు:  ఆంధ్ర దేశంలోని తిరుపతి, కడప, శ్రీశైలం మున్నగు క్షేత్రాలలో నెలకొన్న దేవతలపైనే కాక కంచి, శ్రీరంగం, మధుర, తిరువళ్ళూరులలో వెలసిన స్వామి వార్లపై కూడా క్షేత్రయ్య పదాలు రచించారు. కానీ అన్నిటిని మువ్వ గోపాలునికి అంకితం గావించి ఆ స్వామితో ఆయా దేవతలకు అభేదం కల్పించారు. ఈ దేశాటనం కారణంగానే అతనికి క్షేత్రయ్య అనే నామం స్థిరమైనదనిపిస్తున్నది. ముందుగా గుంటూరు జిల్లా బెల్లంకొండలో చలుపు చక్కరపురీశుని దర్శించారు.(చలువ చక్కెకపురి నిలయుడని మదిలో వలవేసి నిను వలపించలేద?). అనంతరం భద్రాచలంలోని సీతారామచంద్రస్వామిని, పిదప శ్రీశైలం మల్లికార్జునుని, ఆపై హంపి హేమాద్రి నిలయుని దర్శించారు. క్షేత్రయ్య దర్శించిన ఇతర క్షేత్రాలు - పాలగిరి చెన్నకేశవుడు, ఇనగలూరు ఇనపురి స్వామి, (దేవుని) కడప వెంకటేశ్వర స్వామిని దర్శించారు.

తిరుపతి చేరి వెంకటేశ్వర స్వామి, ఇతర దేవతామూర్తులపై అనేక పదాలు రచించారు.పిదప దక్షిణాభిముఖంగా సాగి (దక్షిణ ఆర్కాటు జిల్లా) కోవిల్లూరు మువ్వగోపాల స్వామిని దర్శించారు. తిరువళ్ళూరు వీర రాఘవస్వామి, వేద నారాయణపురం వేదపురీశుడు, సత్యవేడు సత్యపురవాసుదేవుడు, కరిగిరి స్వామి దేవుళ్ళ దర్శనం చేసుకుని మార్గంలో పండితుల, పాలకుల సత్కారాలందుకొన్నారు. క్షేత్రయ్యను ఎందరో ప్రభువులు సన్మానించారు. వారిలో మధురనేలిన తిరుమల నాయకుడు, గోల్కొండ నవాబు, తంజావూరు రఘునాధ నాయకుడు, చెంజి కృష్ణ్ణప్ప నాయుడు (తుపాకుల రాయుడు) ప్రముఖులు. రఘునాధ నాయకునిపై క్షేత్రయ్య వేయి పదాలు చెప్పారు.

చిదంబంరం గోవిందస్వామిని తిల్ల గోవిందస్వామి అని క్షేత్రయ్య ప్రస్తుతించారు. చిదంబరం పాలకుడైన కృష్ణప్పనాయకుని సన్మానం అనంతరం క్షేత్రయ్య తంజావూరు వెళ్ళి రఘునాధనాయకుని ఆస్థానంలో కొంతకాలం ఉన్నారు. అక్కడినుండే శ్రీరంగం, కంచి, రామేశ్వరం వంటి పుణ్యక్షేత్రాలను దర్శించారు. క్షేత్రయ్య దర్శించిన క్షేత్రాలలోని దైవం గురించి కొన్ని క్షేత్రయ్య పదాలు మనకు లభిస్తున్నాయి.1646లో తంజావూరు పతనమై గోల్కొండ నవాబు వశమైంది. గోల్కొండ సైన్యాధిపతి మీర్‌ జుమ్లా సాహిత్యాభిమాని. క్షేత్రయ్యను సగౌరవంగా గోల్కొండ నవాబు సుల్తాన్‌ అబ్దుల్లా కుతుబ్‌ షా వద్దకు తోడ్కొని వెళ్లాడు.ఆ నవాబు ఆస్తానంలో క్షేత్రయ్య పెక్కుకాలం ఉండి 1500 పదాలు వ్రాశారు.తిరుగుప్రయాణంలో భద్రాచలం క్రొత్త తాసిల్దార్‌ కంచెర్ల గోపన్న క్షేత్రయ్యను ఆదరించారు. అనంతరం క్షేత్రయ్య తన స్వగ్రామం మొవ్వకు తిరిగివచ్చారు. తాను వివిధ పాలకులవద్ద కూర్చిన పదాలగురించి క్షేత్రయ్య పదాల ద్వారా మనకు తెలుస్తుంది. క్షేత్రయ్య కథాంశంతో అక్కినేని నాగేశ్వరరావు నటించిన చిత్రం గతంలో విడుదలై విమర్శకుల ప్రశంసలందుకుంది.

ఏపీపీఎస్సీలో ప్రభుత్వ జోక్యాన్ని ఆపండి

ఏపీపీఎస్సీలో ప్రభుత్వ జోక్యాన్ని ఆపండి

- సలహాలకే పరిమితమయ్యేలా ఆదేశాలు ఇవ్వండి

- హైకోర్టులో ఎపీపీఎస్సీ సభ్యుల పిటిషన్

- పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన హైకోర్టు

- మూడు వారాల్లో వివరణ ఇవ్వాలని ఆదేశాలు

హైదరాబాద్, డిసెంబర్ 21 (టీ మీడియా): ఆంధ్రవూపదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) వ్యవహారాల్లో జోక్యం చేసుకోకుండా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీచేయాలంటూ హైకోర్టులో వ్యాజ్యం దాఖలైంది. ఏపీపీఎస్సీ చైర్మన్ రేటల్ ఛటర్జీ, కార్యదర్శి పూనం మాలకొండయ్యల కన్నుసన్నల్లోనే కమిషన్ పాలన వ్యవహారాలు జరిగేలా చూడాలని ఏపీపీఎస్సీ సభ్యులు డాక్టర్ మహ్మద్ నౌమాన్, గంగిశెట్టి పద్దయ్య, పీ రవీందర్‌రావు, ఎం పోచయ్య, కే రూపాంజనేయడ్డి, గుబ్బా చంద్రశేఖర్‌లు పిటిషన్ దాఖలు చేశారు. కమిషన్‌పై రాష్ట్ర ప్రభుత్వం అజామాయిషీ చేయవద్దంటూ కోరారు. ప్రభుత్వం కేవలం సూచనలకు పరిమితం కావాలన్నారు.

ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా కాకుండా, కమిషన్ వ్యవహారాలు స్వతంవూతంగా నిర్వహించేలా చైర్మన్ రేచల్ చటర్జీకి ఆదేశాలు జారీ చేయాలని సభ్యులు కోర్టును అభ్యర్థించారు. రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శిలా వ్యవహరిస్తున్న పూనం మాలకొండయ్యను కమిషన్ కార్యదర్శిగా విధులను నిర్వర్తించేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్‌లో పేర్కొన్నారు.ఏపీపీఎస్సీ కార్యదర్శి కేవలం కమిషన్‌లో ఒక ఉద్యోగి అని నిబంధనల్లో పేర్కొన్నా ప్రస్తుత కార్యదర్శి కమిషన్‌ను పక్కనబెడుతున్నారని తెలిపారు. చైర్మన్, కార్యదర్శులు ఇద్దరు స్వతంత్ర ప్రతిపత్తి కల్గిన ఏపీపీయస్సీ కమిషన్‌లో నియామకం జరిగినా వారు ప్రభుత్వ కార్యదర్శుల హోదాలో కొనసాగుతున్నారన్నారు.

ఏపీపీఎస్సీ ద్వారా నియామకం చేపట్టే ఉద్యోగాలకు ఇంటర్వ్యూ బోర్డుల ఏర్పాటు, నిర్వహణ తదితర విషయాల్లో కమిషన్ సిఫార్సులను ప్రభుత్వం పరిగణలోనికి తీసుకోవాల్సి ఉందన్నారు. అందుకు విరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం ఐదు కేటగీరీలు (డీఎస్పీ (కమ్యూనికేషన్), అటవీశాఖ సహాయ కన్జర్వేటర్, డిగ్రీ, జూనియర్, పాలిటెక్నిక్ కాలేజీల లెక్చరర్ల పోస్టులు) మినహా మిగితా పోస్టులకు ఇంటర్వ్యూలను రద్దుచేస్తూ ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ సూచనలను ఏపీపీఎస్సీకి రెగ్యుపూషన్ 14-ఎ ప్రకారం ఇవ్వాలని, కానీ ప్రభుత్వం పూర్తిగా కమిషన్ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటుందని వివరించారు.

కార్యదర్శి పూనం మాలకొండయ్య సహకారంతో చైర్మన్ రేచల్ ఛటర్జీ కమిషన్ వ్యవహారాలను పూర్తిగా తన ఆదుపు, ఆజ్ఞల్లోకి తీసుకొని సభ్యులను కేవలం సంఖ్యబలంగానే మార్చరని నివేదించారు. ఇంటర్వ్యూల రద్దు వ్యవహారంపై తాము స్పందించడం లేదని, కమిషన్‌కు ఆర్టికల్ 315, 320 ప్రకారం రాజ్యాంగం కల్పించిన స్వతంత్ర ప్రతిపత్తి కోల్పొతుందనే కారణంతో కోర్టును ఆశ్రయించినట్లు పేర్కొన్నారు. ఆరుగురు సభ్యుల తరపున పద్దయ్య పిటిషన్‌పై సంతకం చేశారు. రాష్ట్రవూపభుత్వ సాధరణ పరిపాలనా శాఖ ముఖ్యకార్యదర్శి, రేచల్ చటర్జీ, పూనం మాలకొండయ్య, ఏపీపీఎస్సీలను ప్రతివాదులుగా పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై హైకోర్టు శుక్రవారం విచారణ చేపట్టింది మూడు వారాల్లోగా వివరణను ఇవ్వాలంటూ ప్రతివాదులకు నోటీసులు జారీచేస్తూ తదుపరి విచారణను వాయిదా వేసింది.

Friday, December 21, 2012

Press Note: certificates verification and interviews for the unfilled vacancies of Notification No.38/2008, 11/2009 Executive Posts of Group-II Services

మిస్ యూనివర్స్ 2012 - ఒలీవియా కల్పో (Olivia Culpo)


• 2012 ప్రపంచ సుందరిగా ఒలీవియా కల్పో

• ఒలీవియాకు కిరీటం బహుకరించిన లైలా లోప్స్

• లాస్ వెగాస్ లో ఉత్కంఠ రేపిన మిస్ యూనివర్స్ పోటీలు

మిస్ యూనివర్స్ 2012 కిరీటం అమెరికాకు చెందిన ఒలీవియా కల్పోకు దక్కింది. లాస్ వెగాస్ లో ని ప్లానెట్ హాలీవుడ్ లో జరిగిన ఈ పోటీలు చివరి వరకు ఉత్కంఠ భరితంగా సాగాయి. ఒలీవియాకు గతేడాది మిస్ యూనివర్స్ గా ఎంపికైన అంగోలా అందగత్తె లైలాలోప్స్ కిరీటం బహుకరించింది. 89మంది అందాల భామలతో పోటీపడి ప్రపంచసుందరిగా ఎంపికవడంతో ఒలీవియా ఆనందానికి అవధుల్లేవు. ఫస్ట్ రన్నరప్ గా ఫిలిప్పీన్స్ భామ జనైన్ టుగోనన్ నిలిచింది. మూడో స్థానం వెనిజులా భామం ఐరిన్ ఎస్సార్ కి సొంతమైంది. భారత్ తరపున మిస్ యూనివర్స్ పోటీల్లో పాల్గొన్న శిల్పా సింగ్ 16వ స్థానంతోనే సరిపెట్టుకుంది.



నోటిఫికేషన్ నాటికి ఉన్న జీఓ ప్రకారమే నియామకాలు

గ్రూప్-1, గ్రూప్-2 పరీక్షలతో పాటు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఎపిపిఎస్‌సి) ఇటీవల నిర్వహించిన వివిధ పరీక్షలకు సంబంధించి నోటిఫికేషన్ ఏ జీఓ ప్రకారం ఇచ్చామో, అదే జీఓ ప్రకారం నియామకాలు జరుగుతాయని ఈ కమిషన్ చైర్మన్ రేచల్ చటర్జీ స్పష్టం చేశారు. ఏ పరీక్షలకు ఇంటర్వ్యూ ఉండదంటూ నోటిఫికేషన్‌లో తెలియచేశామో, అందుకు కట్టుబడి అభ్యర్థుల ఎంపిక ఉంటుందన్నారు. వేర్వేరు పోస్టులకు నోటిఫికేషన్ వెలువడ్డ తర్వాత జారీ అయిన జీఓలు పాత నోటిఫికేషన్లకు వర్తించబోవని వివరించారు. నోటిఫికేషన్‌కు విరుద్ధంగా నియామకాలు జరగబోవని చటర్జీ స్పష్టం చేశారు.

రేపటి నుంచి డీఎస్సీ నియామకాలు

డీఎస్సీ -2012 ఉపాధ్యాయ నియామకాలకు సంబంధించిన షెడ్యూల్‌ను ప్రభుత్వం గురువారం ప్రకటించింది. ఈ నెల 22న అభ్యర్థుల ప్రాథమిక జాబితాను వెల్లడిస్తారు. ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికెట్లను 23, 24 తేదీల్లో పరిశీలించి, 26న తుది జాబితాను వెల్లడిస్తారు. 27, 28 తేదీల్లో కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. ఈ మేరకు అన్ని జిల్లాల విద్యాశాఖ అధికారులకు పాఠశాల కమిషనర్ శివశంకర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటి వరకు ఉన్న జాబితాలను రద్దు చేసి తాజా జాబితా ప్రకారం నియామకాలు చేపట్టాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 610 జీవోకు అనుగుణంగా నాన్‌లోకల్ అభ్యర్థులను కట్టడి చేసే విధంగా మొదటి 20 శాతం ఓపెన్ కేటగిరీ అభ్యర్థులకు ఒకసారి, మిగతా 80 శాతం కేటగిరీ అభ్యర్థులకు ఒకసారి ప్రక్రియ చేపట్టి భర్తీ చేయాలని ఆదేశించారు.

నెలాఖరుకు గ్రూపు-1 ఫలితాలు!

త్వరలోనే గ్రూపు-2 ఫైనల్ కీ, ఫలితాలు వెల్లడిస్తాం

28న పదవీ విరమణ చేయనున్న రేచల్ చటర్జీ

గ్రూపు-1 మెయిన్స్ రాత పరీక్ష ఫలితాలను ఈనెలాఖరుకు వెల్లడించే అవకాశం ఉంది. గ్రూపు-1 కీలో తప్పులు దొర్లాయంటూ పలువురు అభ్యర్థులు ట్రిబ్యునల్‌లో వేసిన కేసుపై తీర్పు వెలువడిన వెంటనే ఫలితాలను ప్రకటిస్తామని ఏపీపీఎస్సీ చైర్మన్ రేచల్ ఛటర్జీ పేర్కొన్నారు. ఏపీపీఎస్సీ కార్యాలయంలో గురువారం ఆమె విలేకరులతో మాట్లాడారు. కీలో తప్పులపై ట్రిబ్యునల్‌లో తీర్పు రిజర్వు అయింది. మరో వారం పది రోజుల్లో తీర్పు వెలువడిన వెంటనే ఫలితాలను వెల్లడించే అవకాశం ఉంది. మరోవైపు గ్రూపు-2 రాత పరీక్ష ప్రాథమిక కీని ఇటీవల ప్రకటించి, అభ్యర్థుల నుంచి అభ్యంతరాలను స్వీకరించామని రేచల్ ఛటర్జీ చెప్పారు. ఆ అభ్యంతరాలను ప్రొఫెసర్ల పరిశీలనకు పంపించామని, రెండు మూడు రోజుల్లో వాటిపై వివరణ అందే అవకాశం ఉందన్నారు. ఆ తరువాత ఫైనల్ కీ ప్రకటించి ఫలితాలను వెల్లడిస్తామని పేర్కొన్నారు. మరోవైపు గ్రూపు-2 పోస్టుల విలీనంపై ప్రభుత్వానికి నివేదిక పంపిస్తామని చెప్పారు. విలీనంపై అభ్యర్థులకు కొంత సమయం ఇవ్వాలని ప్రభుత్వానికి లేఖ రాస్తామన్నారు.

ఆ 9 మంది జవాబు పత్రాల్ని అప్పుడే తిరస్కరించాం

జూలైలో జరిగిన గ్రూపు-2 రాత పరీక్షల సందర్భంగా గుంటూరులో పరీక్ష కేంద్రానికి ఆలస్యంగా వచ్చిన 9 మంది అభ్యర్థుల జవాబు పత్రాలను ఆ తరువాత రోజే తిరస్కరించామని రేచల్ పేర్కొన్నారు. ఇప్పుడది విష యమే కాదని, ఎప్పుడో పక్కన పడేశామని చెప్పారు. ఒక పత్రికలో (సాక్షి కాదు) వచ్చిన కథనంపై ఆమె స్పందిస్తూ.. కమిషన్ సభ్యుడు ప్రొఫెసర్ పద్దయ్యతో తాను మాట్లాడానని, మరోసారి అలా అనుమతించవద్దని చెప్పానని అన్నారు.

28న పదవీ విరమణ: రెండేళ్లుగా ఏపీపీఎస్సీ చైర్‌పర్సన్‌గా పనిచేస్తున్న రేచల్ చటర్జీ ఈనెల 28న పదవీ విరమణ చేయనున్నారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మిన్నీ మాథ్యూ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.

నెల రోజుల సెలవులో కార్యదర్శి..: ఏపీపీఎస్సీ కార్యదర్శి పూనం మాలకొండయ్య నెల రోజులు సెలవుపై వె ళ్లారు. ఇటీవల జరిగిన ప్రమాదంలో ఆమె కాలుకి తీవ్ర గాయం కావడంతో దాదాపు 50 రోజులపాటు సెలవు పెట్టారు. ఇటీవలే విధుల్లో చేరిన ఆమె మరో నెల రోజులు వ్యక్తిగత సెలవుపై వెళ్లినట్లు ఏపీపీఎస్సీ వర్గాలు వెల్లడించాయి.

Thursday, December 20, 2012

పద్దయ్య ఇదేం పద్దతయ్య !!!

గ్రూప్-2లో 9 మంది అభ్యర్థులకు అడ్డదారిలో సహకారం

పరీక్ష ప్రారంభమైన 50 నిమిషాలకు లోపలికి అనుమతి

నేరుగా పరీక్ష గదుల్లోకి..

ఏపిపిఎస్సి సభ్యుడు పద్దయ్య నిర్వాకం

అదేరోజు నివేదిక పంపిన గుంటూరు కలెక్టర్

 పద్దయ్య
 లక్షలమంది అభ్యర్థులు ఎన్నో ఆశలతో జులైలో గ్రూప్-2 పరిక్షలు రాశారు. కాని, వీరిలో 9 మంది అసాధారణ రీతిలో పరీక్ష రాయడం చర్చనీయంశామైంది. దాదాపు 50 నిముషాలు ఆలస్యంగా పరీక్ష కేంద్రానికి వచ్చిన వీరిని ఏపిపిఎస్సి సభ్యుడు జి.పద్దయ్య హాలులోకి అనుమతించడం పలు సందేహాలకు తావిస్తుంది. అధికారుల అభ్యంతరాలను భేఖాతరు చేస్తూ అభ్యర్థులు పరీక్షరాయడం వివాదాస్పదంగా మారింది. ఈ వ్యవహారం పై గుంటూరు జిల్లా కలెక్టర్ సురేష్ కుమార్ అదే రోజు ఏపిపీస్సికి నివేదికను పంపించారు. పద్దయ్య తీరు పై కమిషన్ లో తీవ్రమైన అసంతృప్తి వ్యక్తమైనట్లు తెలియవచ్చింది. ఈ తొమ్మిది మంది అభ్యర్థుల ఫలితాలను నిలిపివేయాలని యోచిస్తున్నట్లు సమాచారం.

వివిధ ఉద్యోగాల భర్తీకి ఏపిపిఎస్సి నిర్వహించే గ్రూప్ పరిక్షల నిర్వహణను కమిషన్ లోని సభ్యులందరూ పర్యవేక్షిస్తుంటారు. దీనికోసం వారు ఆయా జిల్లాలకు వెళుతుంటారు. ఈ ఏడాది జూలై 21న నిర్వహించిన గ్రూప్-2 (837 పోస్టులు) పరీక్షకు 4.5 లక్షలమంది కి పైగా పోటిపడ్డారు. ఈ పరీక్ష జరిగిన కేంద్రాల్లో గుంటూరు జిల్లా వట్టి చెరుకూరు మండలం పుల్లడిగుంట లోని ప్రియదర్శిని ఇన్స్టిట్యుట్ అండ్ మేనేజ్ మెంట్ (సెంటర్ కోడ్ – 07049) ఒకటి. ఈ కేంద్రాన్ని పద్దయ్య సందర్శించారు. ఈ కేంద్రంలో మధ్యాహ్నం 2 గంటలకు ( పరీక్ష ప్రారంభ సమయం) ప్రధాన ద్వారాన్ని మూసివేశారు. ఆ తరువాత ఆయా గదుల్లోకి వెళ్ళిన అభ్యర్థులకు ప్రశ్నాపత్రాలను ఇన్విజిలేటర్లు అందచేశారు. పరీక్ష రాయడంలో అభ్యర్థులు మునిగిపోయారు. దాదాపు 50 నిమిషాల సమయం గడిచాక మధ్యాహ్నం 2.50 గంటల సమయంలో పరీక్ష కేంద్రం తలుపులు తెరుచుకోన్నాయి. తొమ్మిది మంది అభ్యర్దులు టివీగా పరీక్ష కేంద్రంలోనికి ప్రవేశించారు. ఈ పరిణామంతో విడుల్లో ఉన్న అధికారులు ఆశ్చర్యపోయారు. ఆలస్యంగా వచ్చిన ఆ అభ్యర్థులను అక్కడి చీఫ్ సూపరిండేంట్ డాక్టర్ పీ డీ రత్నకుమార్ నిలదీయగా వారు పద్దయ్య పేరు చెప్పారు. ఆ తర్వాత ఆ 9 మంది, మిగిలిన అభ్యర్థులతో పాటు పరీక్ష రాశారు. “ తన ముందస్తు అనుమతి లేకుండానే 9 మంది లోపలికి వచ్చారని, తాను దీనిపై ప్రశ్నిస్తే పద్దయ్య తానే పూర్తి భాద్యత వహిస్తానని చెప్పారని, మానవీయ కోణంలో పరీక్షను రాయనివ్వాలని కోరారని” రాత్నరాజు తన నివేదికలో కలెక్టర్ కో తెలిపారు. ఇదే విషయాన్నీ అక్కడ అసిస్టెంట్ లైజన్ ఆఫీసర్ గా వ్యవహరించిన వ్యక్తి కూడా తన నివేదికలో పేర్కొన్నారు.

JUNIOR ASSISTANTS IN DR.N.T.R. UNIVERSITY OF HEALTH SCIENCES (18/2012) FINAL KEY

ASSISTANT SOCIAL WELFARE OFFICERS (50/2011) FINAL KEY

Wednesday, December 19, 2012

A.P. Women Development and Child Welfare Sub Service Notification No.36/2011 Certificates Verification

It is hereby informed that the list of candidates picked up for verification of certificates for the post of Extension Officer Grade-I (Supervisor) in A.P. Women Development and Child Welfare Sub Service notified vide Notification No.36/2011 (General Recruitment) is placed at Commission website i.e. www.apspsc.gov.in.the verification of original certificates will be held on 26-12-2012, 11.30 am at commission’s office the candidate should download their memos, checklist, attestation form (two sets) and proformas of creamy layer(only for BC candidate) from commission website from 21/12/2012 # 11.00am onwords.

http://website.apspsc.gov.in/Documents/PRESSNOTE/367.pdf

ఎపిపిఎస్సి నిర్ణయాల్లో జోక్యం చేసుకోలేం – లోకాయుక్త

ఎపిపిఎస్సి ఏకపక్ష నిర్ణయాలు తీసుకుందంటూ కొందరు సభ్యులు చేసిన ఫిర్యాదు పై విచారణ జరిపిన లోకాయుక్త అందులో తాము జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పింది. చైర్ పర్సన్ పై కానీ, సభ్యులపై కానీ విచారణ జరిపే పరిధి తమకు లేదని స్పష్టం చేసింది. కొన్ని పోస్టులకు ఇంటర్వ్యులను రద్దు చేయడం తగదని, తమ ప్రమేయం లేకుండానే నిర్ణయాలు తీసుకుంటున్నారంటూ సభ్యులు ఎండి. నౌమాన్, రవీంద్ర రావు, ఎం.పోచయ్య, జి.పద్దయ్య, రిపుంజయ రెడ్డి, జి.చంద్రశేఖర్ లు ఇటివల లోకాయుక్త కూ ఫిర్యాదు చేశారు. కమిషన్ చైర్ పర్సన్, కార్యదర్శిల చర్యలను వారు ప్రశ్నించారు. దీనిపై లోకాయుక్త ఎపిపిఎస్సి వివరణ కోరింది. వీటన్నింటిని పరిశీలన మేరకు నియామకల్లోని లోపాలపై విచారణ కమిటి ఆదేశాలమేరకు ప్రభుత్వం జీవో నెం.420ను జారీ చేయడాన్ని ప్రస్తావిస్తూ ఇక దీనికి సంబంధించి అదనంగా తామేమీ పరిశీలించాల్సిన అవసరంలేదని తెలిపింది. కార్యదర్శి పై చర్యలు తీసుకోవాలన్న ఫిర్యాదుదారుల విజ్ఞప్తిని కూడా తోసిపుచ్చింది. కమిషన్ చైర్ పర్సన్ తీసుకున్న నిర్ణయాల ప్రకారమే అన్ని జరుగుతుంటాయని తెలిపింది. స్వతంత్రంగా ఎలాంటి నిర్ణయాలను తీసుకోలేరని పేర్కొంది. ఇక దీనిపై విచారణను ముగిస్తూ మంగళవారం లోకాయుక్త జస్టిస్ బి.సుభాషణ్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిసింది.

Sunday, December 16, 2012

రమణీయం రామప్ప


రామప్ప దేవాలయానికి నిర్మాణ సహకారాన్ని అందించింది రేచర్ల రుద్రుడు. అతడు శివలింగాన్ని ప్రతిష్టించి ఆలయాన్ని తన పేర ‘రుద్రేశ్వరుడ’ని పిలుచుకొన్నాడు. ఇప్పుడు దాన్ని ‘రామలింగేశ్వరుడ’ని పిలుస్తున్నారు.


ఈ దేవాలయానికి రామప్ప దేవాలయమని పేరెలా వచ్చిందో ఖచ్చితమైన ఆధారాలు లేవు. కొందరు గుడి కట్టిన శిల్పి పేరు రామప్ప అనీ, అందుకే ఆ దేవాలయాన్ని రామప్ప దేవాలయమని పిలుస్తున్నారని గ్రామస్తులంటారు. ఏమైనా, గణపతిదేవుని సైన్యాధ్యక్షుడిపైన రేచర్ల రుద్రిడ్డి (రువూదుడు) పాలంపేటలో క్రీ.శ.1213లో నిర్మించిన రామప్ప దేవాలయం కాకతీయ దేవాలయాలన్నింటిలోకీ మణిపూసగా చెప్పుకోవాలి.

దేవాలయ అమరిక

రామప్ప దేవాలయం గర్భాలయం, అర్ధమండపం, రంగమండపం, నంది మండపంతో కుడివైపున కామేశ్వరాలయం, కళ్యాణమండపం, ఎడమ వైపున కాటేశ్వరాలయాలతో చుట్టూ ప్రాకారంతో నిర్మాణమైంది.

ఉపపీఠం

పీఠమంటే అధిష్ఠానం. దేవాలయం మొత్తం దేనిమీద నిలబడి వుంటుందో దాన్ని ‘అధిష్ఠానం’ అంటారు. అంటే దేవాలయానికి ‘పాదం’ లాంటిది. ఈ అధిష్ఠానం కింద ఉండే వరుసల్ని ‘ఉపపీఠం’ అంటారు. రామప్ప దేవాలయ ఉపపీఠం చూడటానికి ఎత్తుగా, చుట్టూ ప్రదక్షిణ చేయటానికి విశాలంగా ఉంది. ఆధారశిల, ఉపానం, పద్మం, పట్టిక, కుముదం, పట్టిక, అధోపద్మం అనే ఉపపీఠం వరుసలపై ఎలాంటి అలంకార శిల్పమూ లేక సాదాగా వున్నాయి.

అధిష్ఠానం

అధిష్ఠానానికి ఉపానం, కుముదము, కపోతము దానిపైన ఏనుగుల వరుస (గజధార)లున్నాయి. కపోతం వరుసపై మట్టానికి సమంగా గర్భాలయ, అర్ధమండప, రంగమండపాల నేల రాళ్ళు పరచబడినాయి. ఏనుగుల వరుస గల రాయిపై ఏనుగులు మనిషిపై దాడి చేస్తున్నట్లు, గణపతి, భైరవ, గజలక్ష్మి, మల్లయుద్ధం, సూర్యుడు, మకరం (మొసలి), వ్యాళాలుఉన్నాయి.

కక్షాసనాలు

దేవాలయ రంగమండప అధిష్ఠానంపై గల ఏనుగుల వరుసలున్న రాయిపైన నిలువుగా ఒక పిట్టగోడ లాంటి రాయి వుంది. దీన్ని ‘కక్షాసనం’ (ఆనుకుని కూర్చోటానికి) అంటారు. మండపం లోపల ఒక మూడు వరుసల వేదిక, దానిపై భక్తులు కూర్చోవటానికి అరుగుగా ఉపెూగపడుతుంది. తూర్పువైపు ప్రవేశద్వారం నుంచి రంగమండపం అరుగుపైన 20 కక్షాసన ఫలకాలున్నాయి. వాటిపై జైనతీర్ధంకరులు, డాలు కత్తి పట్టిన యోధులు, నాట్యగణపతి, చామరధారి, విల్లు, బాణం పట్టుకొన్న వేటగత్తె, భటులు, భైరవుడు, గణిక, వేణుగోపాల, మల్లయుద్ధ దృశ్యాలు, సాలభంజిక (కొమ్మను పట్టుకొని వయ్యారంగా నిలబడిన స్త్రీ) నాట్యగత్తెలు, అటూ ఇటూ మద్దెలను వాయిస్తున్న వాద్యగాండ్లు, నాగిని, సూర్య, శృంగార మైథున శిల్పాలు, నగ్నంగా వున్న ఋషి పుంగవులు, శివభక్తులు, భటుల బొమ్మలు ఉన్నాయి. మధ్య మధ్యలో నాలుగు దళాల పద్మాలు, పట్టీలు వున్నాయి. ఈ కక్షాసనాలను వెనకగోడగా చేసుకొని రంగమండపం లోపలి వైపున చుట్టూ ఏడు చిన్న దేవాలయాలు ఉన్నాయి. రెండింటిలో మాత్రం దేవి, గణపతి విగ్రహాలున్నాయి. కేవలం కాకతీయుల దేవాలయ రంగమంటపాల్లోనే ఇలాంటి చిన్న దేవాలయాలు పరివారాలయాలుగా వుండటం గమనించాల్సిన విషయం.

పాదవర్గం

అధిష్ఠానంపైన ఉండే దేవాలయ గోడభాగాన్ని ‘పాదవర్గం’ అంటారు. రామప్ప దేవాలయ గర్భాలయ, అర్ధమండపాల వరకూ వున్న గోడభాగం, కింద వేదిక, పొడవాటి స్తంభభాగం, దానిపైన కలశం, ఫలిక, పద్మం, పోదిక (బోదె) వున్నాయి. అడ్డంగా చూస్తే ఒకవైపు నుంచి మరోవైపుకు కర్ణకూటం, అహార, పంజర, ముఖశాల మళ్ళీ పంజర, అహార, కర్ణకూటాల అమరిక వుంది. ముఖశాల మధ్యభాగంలో మూడంచెలున్న కోష్టము, దానిపై శిఖరం, కోష్టం పక్క గోడలకు స్వస్తిభద్ర కిటికీలు, ఒక్కో అంచెకు కపోతం, వ్యాళ వర్గాలున్నాయి. కోష్టం కింద గజధార, దానికింద యధావిధిగా అధిష్ఠానం ముందుకు పొడుచుకొచ్చాయి. కుముద భాగం మధ్యలో చక్కటి నంది విగ్రహం వుంది. నంది కేవలం శివుని వాహనమే కాదు. వ్యవసాయానికి తోడ్పడి తిండి గింజలందించేది. కాబట్టి, దానిపట్ల కాకతీయులు మక్కువ పెంచుకొన్నారు. అలాగే, గర్భాలయ గోడల ముఖశాల మధ్యలో మూడువైపులా మూడు కోష్ఠాలున్నాయి. కర్ణకూట అహార భాగాల్లో రెండు స్తంభాల కోష్ఠాలపై మూడంతస్తుల విమానముంది.

ప్రస్తరం (చూరుగల కప్పు)

గర్భాలయం, అర్ధ మండపం, రంగమండపంపైన గోడలపై వర్షం నీరు పడకుండా బాగా వెడపూ్పైన ప్రస్తర కపోతముంది. దాన్ని చూరు అనవచ్చు. కిందనుంచి చూసే వారికి కొయ్యతో బాడిసె ఉలిపెట్టి పట్టీలు, బద్దెలు, చివర చూరునుంచే వర్షపు బిందువుల మాదిరి బొంగరం లాంటి రాతి బుడిపెలు కనబడేలా చెక్కారు. ఈ బుడిపెలనే సమరాంగణ సూత్రధారమనే శిల్పశాస్త్రాన్ని రచించిన భోజమహారాజు నకీ.శ.1వ శతాబ్ది) ‘ఝారావళి’ అని పిలిచారు. అంటే చూరు నుంచి రాలే ‘చిటుక్కు, చిటుక్కు వానచుక్కలని’ అర్ధం. కపోతం కింద ఉత్తరమనే దూలం వరుస, కపోతంపైన వ్యాళమనే వరుసా వున్నాయి.

శిఖరం (విమానం)

కప్పు వరకూ రాతితో కట్టిన రామప్ప దేవాలయ ప్రస్తరం పైన ఇటుకలతో కట్టిన మూడంతస్తుల ‘విమాన’ముంది. అనేక రకాల కొలతలతో నిర్మించటం వల్ల దీన్ని విమాన (నానా మానవిధానత్పాత్ విమానం పరికల్పయేత్) మన్నారు. కాకతీయుల కాలపు విమానం శిథిలమైతే నలభై ఏళ్ళక్షికితం దీన్ని పునర్నిర్మించారు. కూటకోట లక్షణం ద్రావిడ పద్ధతిలో కట్టిన విమాన శిఖరం చదరంగా వుంది. దానిపైన కలశముంది. విమానం ముందు భాగాన అర్ధ మండపంపైన రెండో అంతస్తు వరకూ ఉన్న కట్టడాన్ని శుకనాసి చిలుకముక్కు (చి.ము) అంటారు.

నీళ్లపై తేలే ఇటుకలు

రామప్ప శిల్పులు సకల విద్యావూపవీణులు, ప్రయోగశీలురు. వాళ్లు ఎంతటి ప్రతిభాశాలులూ అంటే అప్పటికే భారీశిలలతో బరు దేవాలయానికి మరింత బరువు కాకూడదని, గర్భగుడిపై విమానాన్ని నీళ్లలో తేలే ఇటుకలతో నిర్మించి, నిర్మాణ రంగంలో యావత్ భారతదేశంలోనే తమకెవరూ సాటిలేరన్న విషయాన్ని రుజువు చేశారు.

రంగమండపం

రామప్ప దేవాలయ గర్భగృహం, అర్ధమండపం తరువాత వున్న చదరపు మండపాన్ని ‘రంగమండపం’ అంటారు. దీనికి మూడువైపులా భక్తులు లోనికి వెళ్ళడానికి దారులున్నాయి. దేవుని విగ్రహానికి చేసే అలంకరణలను అంగభోగమని, రంగశిలనుంచి అర్పించే నాట్యాన్ని రంగభోగమనీ, రెండింటినీ కలిపి అంగరంగ భోగాలనీ అంటారు. ఈ మండపంలో మధ్యన ఎత్తైన నాలుగు ప్రధాన స్తంభాలు, చుట్టూ వేదిక మీద కురచస్తంభాలు వున్నాయి. కపోతం వంగిపోతుంటే అప్పటి పురావస్తు శాఖ సంచాలకులు డా॥ గులాం యజ్దాని చుట్టూ అదే సాదాగా చెక్కించిన రాళ్ళతో స్తంభాపూత్తించాడు. దానిపై నున్న వ్యాళ వర్గం శిథిలమైతే దాన్ని కూడా రాతితో పిట్టగోడ మాదిరిగా కట్టించాడు. నిజానికి కాకతీయుల పిట్టగోడపై ప్రధాన ఆలయాన్ని పోలిన చిన్న ఆలయాల వరుస వుంటుంది.

రంగమండప స్తంభాలపై శిల్పం

రంగమండపం మధ్యనున్న నాలుగు స్తంభాలు, దూలాలు, కప్పు రాళ్ళను నల్ల శానపు రాతితో చెక్కారు. వాటిని ఎంత నున్నగా చెక్కారంటే చూసుకుంటే మన ముఖం కూడా కనపడుతుంది. ఇక, ఆగ్నేయంలో వున్న స్తంభానికి కింద అశ్వపాదం, స్తంభభాగం దానిపై నాట్య గణపతి, ఎకచెక్కాలాడుతూ శృంగారం భంగిమల్లో ఉన్న దంపతులు, ఒక సైనికుడు, అతని భార్య (కొంతమంది పరిశోధకులు ఈ శిల్పాన్ని రేచర్ల రుద్రసేనాని, అతని భార్యగా వర్ణించారు), నాట్యగత్తెలను చెక్కారు. నైరుతిలోని స్తంభంపైన నాట్యగత్తెలు, రతీ మన్మథ, అమృత మధన దృశ్యాలు, వాయువ్య స్తంభం మీద గోపికా వస్త్రాపహరణం, నాట్యగాళ్ళు, ఈశాన్య స్తంభంపై డిజైన్లు వున్నాయి. స్తంభాలపైన కలశం, దాడి, ఫలికా పద్మాలను బంగారు పనిచేసే కంసాలులు తీర్చి దిద్దారా అన్నట్లుంది. దానిపై నాలుగు వైపులా నాలుగు ముఖాలున్న బోదెలు వున్నాయి.

రంగమండప దూలాలు

బోదెలపైన గల దూలాలపై కూడా వెన్నతో తీర్చిదిద్దారా అన్నట్లుగా లెక్కలేనన్ని దేవతా మూర్తుల్ని సులువుగా చెక్కారు. తూర్పువైపు దూలం ఎదురుగా శివ కల్యాణ సుందరమూర్తి, దూలం కింది వైపున బ్రహ్మ, విష్ణువుల మధ్య నర్తనమాడుతున్న నటరాజు, ఏకాదశ రుద్రులు, లోపలి వైపు త్రిపుర సంహారమూర్తి, దక్షిణం వైపు దూలంపై ఎదురుగా, నందీశ్వర, బ్రహ్మ, విష్ణు, వాహనాలపైనున్న దిక్పాలకులు, సప్తర్షులు, దూలం కిందవైపున గజాసుర సంహారమూర్తి, లోపలివైపు అమృతకలశానికి అటూ ఇటూ దేవతలు, పడమర దూలం ఎదురుగా దేవతా శిల్పాలు, దూలం కింది వైపున దిక్పాలకుల మధ్య నటరాజు, లోపలి వైపు సాగరమధన దృశ్యం, ఉత్తరం వైపున దూలంపై ఎదురుగా రుషులు, కింది వైపు గజాసుర సంహారమూర్తి, లోపల రామరావణ యుద్ధ దృశ్యాలు రమణీయంగా మలిచారు. దూలాలపైన మధ్యలో (మూలరాళ్ళు) కోణవట్ట, చదరవట్టాల (చదరపు రాళ్ళు)పై దిక్పాల శిల్పాలు, మధ్యన నటరాజశిల్పం చూపరుల దృష్టిని మరల్చటమే కాక మెడనొప్పిని కూడా కలిగిస్తుంది. ఎందుకంటే, ఏ శిల్పానికి ఆ శిల్పం అద్వితీయం, కనుక!

మదనిక నాగిని శిల్పాలు

రంగమండప కక్షాసనాల వెనుక వేదికపై నిలబెట్టిన కురచ స్తంభాలున్నాయి గదా! వాటి వెలపలి వైపు నుంచి దూలాల బోదె భాగాల్లోకి నల్ల శానపురాతితో చెక్కిన ఏనుగుపైనున్న సింహాన్ని పోలిన ఉహాత్మక జంతువు -యాళి - గజకేసరి శిల్పాలు, నాగినీ, మదనికా శిల్పాలు ఉన్నాయి. చక్కటి అంగసౌష్టవంతో వొంపుసొంపులు, హొయలూ, వయ్యారాల కలపబోతగా తీర్చిదిద్దిన సుందరీమణులు కాకతీయుల కాలపు అందమైన యువతుల రూపలావణ్యానికి ప్రతిబింబాలు. నల్లశానపు రాతిలో చెక్కిన రంగమండప వాయువ్యభాగంలో ఐదు గజకేసరి శిల్పాలు, తరువాత తూర్పు ద్వారానికి రెండువైపులా ఇద్దరేసి నాట్యగత్తెలు, నాగినులు, మద్దెల వాయిస్తున్న యువతులు. తూర్పువైపు ద్వారానికి ఎడమవైపున్న యువతి ఎత్తు మడమల చెప్పులతో ఫ్యాషన్లలో ఫ్రెంచి అందగత్తెల్ని తలదన్నే రీతిలో ఉంది. మరో యువతి వంటిపై జారిపోతున్న ఎంబ్రాయిడరీ అల్లికలు, అప్పటికి కొంగొత్త డిజైన్లు అద్దుకున్న బట్టలతో అందమంతా తన సొంతమేనన్నట్లు ఆనందాన్ని వ్యక్తం చేస్తుంది. ఈ సుందరీమణులు తమ కురులను అందంగా అలంకరించుకొన్న తీరు, చెవులకు పెద్దసైజు గుండ్రటి దుద్దులు, నాజూకైన బంగారు నగలు, నాట్య భంగిమలు. ఆ సొగసుగత్తెల మాటే చేయి తిరిగిన శిల్పుల పనితనానికి మనం అబ్బురపడతాం. అంగాంగానికి పొందుపరచిన ఆభరణాలతో అప్సరసలను సైతం కవ్వించి, అలంకరణలో, అందంలో తమకు సాటిరాదన్న గర్వంతో సవాళ్ళు విసురుతూ, అలనాటి తెలంగాణ ప్రాంత యువతులు మొదటి నుంచీ సౌందర్యోపాసకులని రుజువు చేస్తున్నాయి.

ద్వారశాఖలు

గర్భాలయంలో ప్రతిష్టితమైన రుద్రేశ్వరుని దర్శించాలనుకొన్నా వీటన్నిటినుంచి దృష్టి మరల్చాలి. అవును. అపురూపంగా చెక్కిన ద్వారబంధాలు, వాటి శాఖలు, కింద సుందరశిల్పాలు, వేటగత్తెలపాట్లు, లోనికి వెలుతురు రావటానికి కిటికీలు, కిటికీ కళ్లపై అలనాటి నాట్యభంగిమలు, కరణాలు, అభినయ, నృత్యరీతులు మనల్ని మంత్రముగ్ధుల్ని చేస్తాయి. బహుశా రేచర్ల రుద్రుడు, జాయపసేనాని సహవాసం వల్ల అబ్బిన నాట్యాభిరుచిని ఇక్కడ తెలియజెప్పాలనుకున్నారేవెూ! ద్వార బంధాల కిందున్న గడపపై రమణీయ శిల్పం, పైనున్న పతంగంపై నటరాజు తాండవం చూపరులను మమేకం చేస్తుంది. ఇక్కడ మలచిన నాట్య భంగిమలను, జాయపసేనాని రచించిన ‘నృత్య రత్నావళి’లోని నాట్య సంప్రదాయాలను డా॥ నటరాజ రామకృష్ణ తులనాత్మకంగా పరిశీలించి, పరిశోధించిన ఎన్నో నాట్య విశేషాలను ప్రపంచానికి తెలియజెప్పారు. వారు 1985లో రామప్ప దేవాలయ ప్రాంగణంలో పేరిణి నృత్యవూపక్షికియను వేలమంది సమక్షంలో ప్రదర్శించిన విషయం లోక విదితమే.

నంది మండపం

దేవాలయ దర్శనమైన తరువాత రంగమండపం బయటికొచ్చిన వారికి, తంజావూరు బృహదీశ్వరాలయంలో మాదిరిగా వ్యవసాయం పట్ల మక్కువ గల కాకతీయ రాజుల అభిమతానికి మచ్చుతునకగా, దుక్కిటెడ్లపట్ల గల మమకారాన్నంతా కలిపి చెక్కించుకొన్న నంది కనిపిస్తుంది. దీన్ని ప్రతిష్టించిన నందిమండపం, అటు అంతకుముందు కళ్యాణి చాళుక్యుల దేవాలయాల్లోగానీ, లేక అప్పటి వరకూ కట్టిన కాకతీయదేవాలయాల్లోనూ ఎక్కడా లేనట్లు విలక్షణ వాస్తుశైలిలో ఉంటుంది.

కాటేశ్వరాలయం

అర్ధమండప, గర్భాలయం, మహామండపాలతో ఉన్న కాటేశ్వరాలయాన్ని రుద్రసేనాని తన తండ్రి కాట్రెడ్డి పేర నిర్మించాడు. చుట్టూ చిన్న ప్రదక్షిణ పథంగా వున్న ఉపపీఠం దానిపై చిన్న అధిష్టానం, పాదవర్గం, ప్రస్తర కపోతం, దానిపైన ఒక్క అంతస్థు వరకు మిగిలి వున్న ఇటుకరాతి శిథిల విమానం, కొంచెం ఎత్తైన అధిష్ఠానం, దానిపై కక్షాసనాలతో ఉన్న రంగమండపం, ప్రవేశం దగ్గర అటూ ఇటూ శిథిలమైనా పదిలంగా మెట్లెక్కండని భక్తులను ఆహ్వానించే రెండు ఏనుగు శిల్పాలు చూడముచ్చటగా ఉంటాయి.

రంగమండపంలో 16 స్తంభాలు, ద్వారబంధాలపై స్వస్తిభవూదజాలకాలతో రామప్ప ప్రధానాలయానికి తగ్గట్టుగా నిర్మితమైంది. ముందున్న మెట్లకు అటూ ఇటూ పొందికగా వున్న అధిష్ఠాన భాగాలను సంస్క ృతంలో గజహస్తాలనీ, ఆలంబన బాహులనీ అంటారు.

కామేశ్వరాలయం

రామప్ప దేవాలయానికి నైరుతి దిక్కులో నిర్మితమైన కామేశ్వరాలయం చిన్న ఉపపీఠం, సాదాగోడలు, దానిపై చిన్న కపోతం, వ్యాళ వర్గాలున్నాయి. ముందుభాగంలో అటూ ఇటూ రెండు కక్షాసనాలుండటం గమనించదగ్గ విషయం. ద్వారబంధాలు కాకతీయ శిల్ప వైశిష్ఠ్యాన్ని తెలియజేస్తున్నాయి.

కల్యాణ మండపం

రామప్ప ఆలయ దక్షిణ భాగంలో ప్రాకారానికి మధ్యగల కల్యాణ మండపం శిథిలమైపోగా దానిని భారత పురాతత్త్వ సర్వేక్షణ శాఖ పదిలపరుస్తోంది.

ప్రాకారం

ఆలయాలను అపురూపంగా కట్టించిన రుద్రుడు వాటి భద్రతను గురించి కూడా ఆలోచించాడు. ఆలయాల భద్రతతో పాటు పచ్చటి పరిసరాల నడుమ అందం ఇనుమడించేటట్లు చుట్టూ ఎత్తైన విశాలమైన ప్రాకారాన్ని నిర్మించాడు. తూర్పు, పడమర, దక్షిణ దిక్కుల్లో ప్రవేశ ద్వారాలను కల్పించాడు. ప్రాకారం దృఢంగా ఉండటానికి రెండు వరుసలతో గోడకట్టి, ఆ వరుసల మధ్య మట్టితో నింపి, పైన కప్పునూ, దానిపై అందం కోసం కలశాలను తలపించే కోడిపుంజు తలపై ఉండే తురాయి రీతిలో శిల్పకళాకృతులను నిర్మించాడు.

ఇతర దేవాలయాలు

రామప్పకు నైరుతి దిక్కులో 100 గజాల దూరంలో ఒక త్రికూటాలయం, వాయువ్యంలో చాళుక్య రీతిలో నిర్మించిన ఆలయం, చెరువుకట్టపై కుడివైపున కొండగట్టున మరో ఆలయం, చెరువుకట్టకు ఎడమవైపు ఒక త్రికూటాలయం, మరో ఏక కూటాలయం ఉన్నాయి. ఇవన్నీ శిథిలమైనా చూడదగ్గ కట్టడాలే.

కాకతీయ శిల్పంలో జైన తీర్ధంకరులు, శైవ, వైష్ణవ, శాక్త, గాణాపత్య శిల్పాలు, సామాజిక శిల్పంలో వేటగాళ్ళు, వేటగత్తెలు, నాట్యగాళ్ళు, నాట్యగత్తెలు, వాద్యగాళ్ళు, వాద్యగత్తెలు, దంపతి శిల్పాలు, నాగిని, మదనిక శిల్పాలు తలమానికాలు. శైవ శిల్పాల్లో, గణపతి, కార్తికేయ, వివిధ శివరూపాలలో నటరాజ, వైష్ణవ ప్రతిమల్లో విష్ణు, చెన్నకేశవ, శాక్త శిల్పాల్లో, సప్తమాతృక, మహిష మర్ధిని శిల్పాలు ముఖ్యమైనవి.

శాతవాహనుల తరువాత అంతటి చక్కటి రూపలావణ్యంతో బాగా నగిషీ చేసే శిల్ప ప్రక్రియ మళ్ళీ కాకతీయుల కాలంలోనే జరిగింది. మనుషులు, దేవతా శిల్పాలే కాక జంతువులకూ విశేష ప్రాధాన్యాన్నిచ్చారు శిల్పులు. దేవాలయ గోడలపై నంది, హంసలు, ఏనుగులు, గుర్రాల వరుసలు నాటి శిల్పుల ప్రతిభకు తార్కాణాలు. రామప్ప రంగమండప స్తంభాలకున్న నాగిని, యువతుల శిల్పాలు మరెక్కడా కాన రావు.

రెండున్నర శతాబ్దాల్లో వేలకొద్దీ శిల్పాలు చెక్కించి భారతీయ శిల్పకళా చరివూతలో తమకంటూ మహత్తర స్థానాన్ని కల్పించుకొన్న కాకతీయులు నిజంగా ధన్యజీవులు!

అపురూపమే కాక ఎంతో అరుదైన రామప్ప దేవాలయం మధ్యయుగపు రాజవంశ ఠీవిని, అప్పటి వాస్తు శిల్ప వైవిధ్యాన్నీ అట్లే నాటి శిల్పుల హస్తకళా లాఘవాన్ని ఆవిష్కరిస్తూ, ప్రపంచ వారసత్వ కట్టడాల జాబితాలో చోటుకోసం ఎదురుచూస్తోంది.

శాసన మండపం

గణపతి దేవుని అడుగుజాడల్లో నడుస్తున్న రేచర్ల రుద్రుడు ఆలయాన్ని కట్టిన సందర్భంగా సంస్కృతంలో ఒక శాసనాన్ని వేయించి, దానిని నిలబెట్టి ఎండావానల నుంచి రక్షణకు ఒక మండపాన్ని కట్టించాడు. చక్కటి ఉపపీ నాలుగు స్తంభాలపై అందమైన కప్పుతో నిర్మించిన శాసన మండపం కాకతీయ వాస్తు కట్టడాల్లో విలక్షణమైందిగా గుర్తింపు పొందింది.