ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఎపిపిఎస్సి) నిర్వహిస్తున్న పరీక్షల్లో గ్రూప్ 1ను మినహాయించి మిగితా పరీక్షలకు ఇంటర్వ్యూ విధానాన్నీఎత్తివేయాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఆర్. కృష్ణయ్య డిమాండ్ చేశారు. గ్రూప్ సర్వీసెస్ ఉద్యోగాల భర్తీని రాత పరీక్ష ద్వారానే పూర్తి చేయాలనీ, ఇంటర్వ్యూ విధానాన్నీ రద్దు చేయాలనీ కోరుతూ సోమవారం నాంపల్లి లోని ఎపిపిఎస్సి కార్యాలయం ఎదుట బీసీ సంఘాల ఆద్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో కృష్ణయ్య మాట్లాడుతూ గ్రూప్-2 లో 40 కేటగిరీల పరీక్షలకు సంబందించిన ఫలితాలు ప్రకటించకుండా సంవత్సరాల తరబడి జాప్యం చేయడమేమిటని ప్రశ్నించారు. కొన్ని పరీక్షల విషయంలో నోటిఫికేషన్ లో రాత పరీక్ష మార్కుల అధారంగా భర్తీ చేస్తామని ప్రకటించి నేడు అందుకు విరుద్దంగా ఇంటర్వ్యూ లు నిర్వహిస్తామని ప్రకటించడం ఎంత వరకు సబబని ప్రశ్నించారు. ఈ విషయమై నేడు ముఖ్యమంత్రిని, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలిసి విన్నవించనున్నట్లు తెలిపారు. మూడు నాలుగు రోజుల్లో ఎపిపిఎస్సి అధికారులు స్పందించకపోతే ఇందిరాపార్క్ వద్ద భారీ ఎత్తున ఆందోళనకు దిగుతామని హెచ్చరించార. ఈ కార్యక్రమంలో వివిధ బీసీ సంఘాల నేతలు పాల్గొన్నారు.
yes, he is write.no need to conduct interviews for group 2 and other subodinate services.
ReplyDelete