Tuesday, October 16, 2012

గ్రూప్ 2 2011 వైట్నర్ కేసు ఎప్పుడు ముగుస్తుందో దేవుడు కూడా చెప్పలేడు - కైలాస రావు


కైలాస రావు, గ్రూప్ 2 2011 అభ్యర్థులకు పరిచయం అవసరం లేని పేరు, ఎనిమిది నెలలుగా ఫైనల్ సెలక్షన్ లిస్టు ను ఆపిన ఘనత వీరికి మరియు ఎపిపిఎస్సి వారికే చెందుతుంది.ముందు కైలాస రావు వాదన ఏంటో చూద్దా. " ఆంధ్ర ప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వైట్నర్ ఫ్లూయిడ్ వాడిన అభ్యర్థుల OMR షీట్లను వాల్యుయేషన్ చేయడమే కాకుండా వారిని ఎగ్జిక్యూటివ్ పోస్టల భర్తీకి పరిగణలోకి తిసుకోవడం జరిగినది, ఇది అన్యాయం మరియు రాజ్యాంగ విరుద్దం, కావున  వైట్నర్ ఫ్లూయిడ్ వాడిన అభ్యర్థులను పూర్తిగా సెలక్షన్ కు మినహాయించి మిగిలిన మొత్తం అభ్యర్థులతో క్రొత్త సెలక్షన్ లిస్టును తయారు చేసి వారికే ఇంటర్వ్యూ లను నిర్వహించి ఎగ్జిక్యూటివ్  మరియు నాన్ - ఎగ్జిక్యూటివ్ పోస్టల భర్తీని  చేయవలసినదిగా కోరడమైనది." ఇది కైలాస రావు వాదన.

కైలాస రావు వాదనను పూర్తిగా పరిశీలించినట్లైతే కొంత న్యాయం మరికొంత అన్యాయం కనిపిస్తుంది. పూర్తిగా  వైట్నర్ ఫ్లూయిడ్ వాడిన అభ్యర్థులను తొలగించాలి అని కోరడం అది అన్యాయం, కేవలం వైట్నర్ ఫ్లూయిడ్ వాడిన ప్రశ్నలను తొలగించాలి అని కోరితే సరిపోయేది . కైలాస రావు ఈ చిన్న విషయమై కోర్టకు వెళ్ళడం నాకైతే సబబుగా అనిపించడం లేదు ఎందుకంటే ఇది వరకు పెన్సిల్ వాడినప్పుడు తప్పుడు  సమాదానంను గుర్తించాం అని అనుకొన్నప్పుడు  దాన్ని రబ్బరు తో చెరిపివేసి సరైన సమాదానంను గుర్తించే అవకాశం ఉండేది.ఇప్పుడు పెన్సిల్ బదులు పెన్ వాడమని ఎపిపిఎస్సి వారు చెప్పడంతో అందరు పెన్ నే ఉపయోగించారు.ఎపిపిఎస్సి వారు పెన్ ను ఉపయోగించమన్నారు కానీ వైట్నర్ ఫ్లూయిడ్ ను ఉపయోగించమని కానీ ఉపయోగించకూడదు అని కానీ చెప్పకపోవడంతో ఈ గందరగోల పరిస్థితికి కారణం అయింది.వైట్నర్ ఫ్లూయిడ్ ఉపయోగించవచ్చు అని అనుకోన్నవారు ఉయోగించారు ఉపయోగించకూడదు అని అనుకోన్నవారు ఉపయోగించలేదు.  ఇక్కడ అభ్యర్థులు ఏమనుకొన్నారు  అనేది ముఖ్యం కాదు నోటిఫికేషన్ లోని నిబందనలో ఏమున్నది అనేదే ముఖ్యం. నోటిఫికేషన్ లోని నిబందనలో వైట్నర్ ఫ్లూయిడ్ గురించి ఎక్కడా ఏమిలేదు. అలాంటప్పుడు వైట్నర్ ఫ్లూయిడ్ ను ఉపయోగించిన వారిని తప్పుపట్టడం ఎంతవరకు సబబు.పూర్తిగా తప్పంత ఎపిపిఎస్సి  అదికారులదే, నోటిఫికేషన్ లో వైట్నర్ ఫ్లూయిడ్ ఉపయోగించాలో లేదో ఏమి తేలపకపోవడంతో ఈ గందరగోల పరిస్థితికి కారణం అయింది.

ఇక్కడ నన్ను ఆశ్చర్యపరిచే విషయం ఏమిటంటే కైలాస రావు కేసు గెలిచినా, ఓడిన అతనికి వ్యక్తిగతంగా కలిగే ప్రయోజనం ఏమిలేదు. అతను ఇంటర్వ్యూ లకు సెలెక్ట్ అయిన 1203 అభ్యర్తులలో లేనేలేడు. నేను అతనిని కేసు ఎప్పుడు కొలిక్కి వస్తుంది అని అడిగినప్పుడు అతను నాకిచ్చిన నిర్లక్షపు సమాదానం " గ్రూప్ 2 2011 వైట్నర్ కేసు ఎప్పుడు ముగుస్తుందో దేవుడు కూడా చెప్పలేడు ".

ఇతని విషయం ఇలాఉంటే ఇక ఎపిపిఎస్సి ప్రవర్తన విస్మయం కలిగించేలా ఉంది. అక్టోబర్ 17 న కేసు గనుక ఓడిపోతే ఎపిపిఎస్సి సుప్రీమ్ కోర్టకు కూడా వెళ్ళడానికి కూడా సిద్దంగా ఉంది అట.అదే నిజం అయితే అభ్యర్థులందరూ పోరు బాట పట్టాల్సిందే న్యాయం కోసం ధర్నాలు చేయవలిసిందే. అంతే కాకుండా ఇప్పటివరకు హైకోర్టుకు మరియు ట్రిబ్యునల్ కు సహకరించకుండాఎపిపిఎస్సి వాయిదాలు కోరడం సమస్యను త్వరగా పరిష్కరించాలని చూడకపోవడం తన నిర్లక్షాన్ని చూపెడుతోంది. ఇది నిజంగా బాదాకరం.

5 comments:

  1. http://www.youtube.com/watch?v=nmUZrIVndP0 in this vedio poonam malakondayya clear ga chepparu once answer with the pen there is no chance to change because of that they asked to use pen. it is common practice to tell. it means not to use anything other than pen.

    ReplyDelete
  2. Whatever be the result of the case, justice delayed is denied. Candidates who are appeared/appearing for Group-2 should adapt the transparent procedures other wise you will be the looser. Earlier people used the pencil that's ok, it was long back, now pen is introduced what is the necessity is it not for transparency? Had it been pencil answers can be modified at any stage beyond your control, then what is the authenticity that could be the reason pen is introduced. A person may change 5 to 6 questions in stipulated time at the most, but outsider equally can change more then the question of transparency arises. Group-2 aspirants are well aware of this problem then why fight. It's clear that use whitener is not mentioned in instructions it doesn't mean that you can use whitner. In Present case at least APPSC should initiate in preparing the merit list by deleting the answers which used whitener. I think this is justified and the scope for third person influence in making the merit list can be avoided. APPSC should be bold/dare enough to come out with concrete ideas with doing maximum justice to the deserving candidates.

    ReplyDelete
  3. Group 2 2011 whitener case Adjournmened to 01-Nov-2012 in APAT.

    ReplyDelete
  4. I agree with Madam Shyamala's intention. I believe that APPSC had asked the candidates to use Pen only to avoid manipulation of OMR sheet at the time valuation. I donot mean that APPSC knows that during valuation manipulation is happening. Here the intention of APPSC is to input confidence in the aspirants that selection procedure is fair and transparent and suitable steps have been taken towards to impart transparency and to curtile unfair activities at the stage of valuation. The use of whitener defeats the very purpose of the same. No body could not say that either the aspirants have used the whitener in the examination hall nor any others on behalf of some candidates have used the whitener for the benefit of their favorable result. Only God knows. The candidates who used the whitener and selected for post will not agree for this. Because they are beneficiaries.

    The problem is with the losers only. That too with narrow margin and with those who have worked hard for years together by sacrificing their jobs, time, money, age etc.Here we should remember the sacrifices of their family members also. Especially parents.

    I think that entire Andhra Pradesh was happy when two eminent personalities were appointed in APPSC. All of us knows who they are. They wanted to bring transparency in selection.Accordingly bold steps were taken by them.Theinformation on the proposed reforms were published in the newspapers. Many of our aspirants are aware of that.

    If APPSC wants to implement reforms than suitable steps would have been taken without giving room for any body for filing cases against APPSC. The recruitment rules are to be framed error proof. APPSC is an autonomous body with many intellectuals from earlier days. But in practical we are seeing that totally against situations what we expected.

    Many aspirants are totally disappointed by the working of various constitutionals bodies. Here they not criticizing the constitutional bodies because they are responsible citizens. Just they want to express their dissatisfaction due to the delay caused by the Constitutional bodies. The Constitutional bodies should keep this aspect in their mind before conducting any examination.

    Ultimately, the common people of Andhra Pradesh are losing the services of the officials who are not yet selected for the delay caused by various constitutional bodies.Many government offices are not rendering proper services due to staff shortage. The intellectuals of Andhra Pradesh should think in this regard and represent the matter in the honorable courts to do justice in the shape of filing PILs.

    Every body should remember that worthy aspirants are losing their opportunities for selection only because of abnormal delay in the selection process. Over the years much experience was gained by APPSC in this way. But we find the same delay ( Recent Group - I preliminary case). No change in the attitude of APPSC even after appointment of two honest and sincere administrators. By watching over the situations any body would express doubts that really APPSC wants reforms to achieve transparency in selection procedure or to continue the same old practices. Only God Knows.

    ReplyDelete