విశ్వం అనంతమైనది. భూమి మరియు అంతరిక్షాన్ని కలిపి విశ్వం(Universe) అని లేక Space అని అంటారు. భూమి మరియు భూవాతవరణము తప్ప మిగిలిన ప్రదేశామంతటిని అంతరిక్షము(Outer space) అని అంటారు.
నీహరికలు(Nebula):
విశ్వంలో నక్షత్రాలే కాక నీహరికలు(Nebula) కూడా ఉంటాయి. అంతరిక్షంలో వేడి వాయువులచే ఏర్పడి చలన సహితంగా ఉన్న ధూళి మరియు వాయు మేఘాలు లాంటి ఖగోళ వస్తువునే నీహరికలు(Nebula) అంటారు. వీటిని మొదట హ్యుజేన్(జర్మనీ) అనే శాస్త్రవేత్త గుర్తించారు. నక్షత్రాలన్నీ నిజానికి ఈ మేఘలలోనే పుడతాయి.
నక్షత్రవీధి(Galaxy) :
నక్షత్రాల గుంపును నక్షత్రవీధి(Galaxy) అంటారు.మనం నిత్యం చూచే సూర్యుడు కూడా భూమికంటే 333,000 రెట్లు బరువైనవాడు. భూమి కంటే సూర్యుని వ్యాసం 109 రెట్లు ఎక్కువ. మనం నివసించే నక్షత్రవీధి సముదాయాన్ని పాలపుంత(Milky way) లేక ఆకాశగంగ అంటారు. గెలాక్సీలో 98% ద్రవ్యరాశి నక్షత్రాలుగా ఉంటుంది. మిగిలిన 2% వాయువుగా, దూళిగా ఉంటుంది. ఒక్కొక్క గెలాక్సీ లో ఒకటినుండి పది బిలియన్ల వరకు నక్షత్రాలు ఉంటాయి. ఒక్కొక గెలాక్సీ మందము కనీసము 1000 కాంతి సంవత్సరాలు ఉంటుంది. కాంతి సంవత్సరం విలువ 9.3 x 1012 కి.మీ. భూమికి సమీపంలో మేఘలేనిక్ మేఘము(Magellanic cloud) అను గేలక్సికి భూమికి మద్య దూరం 1,55,000 కాంతి సంవత్సరములు. మనకు సమీపంలో ఉన్న గెలాక్సీ పేరు ఆండ్రోమెడ (Andromeda). ఆండ్రోమెడా సర్పిలాకారంలో ఉంటూ భూమికి సుమారు 2.5 మిల్లియన్ల కాంతి సంవత్సరాల (2.4×1019 km) దూరంలో కలదు. ఇప్పటివరకు గుర్తించిన వాటిలో అతిపెద్ద గెలాక్సీ హైడ్రా(Hydra). పాలపుంత గెలాక్సీ తప్ప మిగితా గెలాక్సీలు ఒకదానినుండి ఒకటి దూరమవుతూ అత్యంత వేగంతో విస్తరణ చెందుతాయని హబుల్ నిరూపించాడు. గెలాక్సీలు ఒకటినుండి 500ల వరకు సముదాయాలుగా (Cluster of galaxies) ఉంటాయి. వీటిని విశ్వము అనే సముద్రములో దీవులుగా వర్ణిస్తారు. గెలాక్సీ అనబడే గ్రీకు పదాన్ని భారతీయులు పాలపుంత అని చైనీయులు ఖగోళ నదులని, హిబ్రులు కాంతి నదులని, ఎస్కిమోలు తెల్లని భస్మి పటలాలని మరియు యకుట్స్ దేవుని అడుగుజాడలని పిలుస్తారు. పాలపుంతలోని నక్షత్రములు పాలపుంత కేంద్రము చుట్టూ ఒక పరిభ్రమణం చేయుటకు పట్టుకాలము 225 x 106. దీనిని కాస్మిక్ సంవత్సరము (Cosmic year) అని అంటారు.

![]() |
| Andromeda Spiral Galaxy |
![]() |
| Barred Spiral Galaxy |

శూన్యప్రదేశాలు :
గెలక్సీలకు, నిహరికలకు మధ్య ఖాళీ ప్రదేశం. ఇది మొత్తం విశ్వం పరిమాణంలో 97% ను ఆక్రమించి ఉంది. విశ్వమంటే నక్షత్రవీధుల, నీహారికల, మరియు వాటి మద్య ఉండే శూన్యప్రదేశముల సంకలనమే. విశ్వాన్ని గురించి అద్యయనం చేసే శాస్త్రాన్ని కాస్మాలజి (రష్యన్), ఆస్ట్రానమీ(అమెరికా) అని పిలుస్తున్నారు.
నక్షత్రాలు(Stars) :
![]() |
| Epsilon Aurigae Star |
నక్షత్రాలకు సంబందించిన కొన్ని ముఖ్యమైన విషయాలు :
- నక్షత్రాలు స్వయం ప్రకాశ శక్తిని కల్గి ఉంటాయి. నాడీ కొట్టుకుంటూ ఉన్న రీతిలో విద్యుత్ అయస్కాంత శక్తిని వెలువరిస్తూ ఉన్న నక్షత్రాలను పల్సర్ (Pulsar) అని అంటారు. వీటికి గల మరొక పేరు న్యూట్రాన్ నక్షత్రాలు.
- పూర్తి స్థాయి నక్షత్ర దశని పొందక ముందు శక్తి జనక ప్రక్రియ ప్రారంభమైన నక్షత్రాలను అర్ధనక్షత్రాలు అని అంటారు. వీటికి గల మరొక పేరు క్వాసార్ (Quasar).
- ఈ నక్షత్రాలలో శక్తి జనకనికి కారణమైన చర్య కేంద్రక సంలీనం (Nuclear fusion).
- ఈ చర్య ప్రారంభమైన తర్వాత నిలకడగా ఒకే ప్రకాశ శక్తితో కనిపించు నక్షత్రాలను స్థిరనక్షత్రాలు అంటారు.
- ఇందనం అయిపోయిన తర్వాత నిర్ధిష్ట కాలవ్యవధిలో ప్రకాశంలో మార్పుకు లోనయ్యే నక్షత్రాలను అస్థిరనక్షత్రాలు అంటారు. వీటికి గల మరొక పేరు చంచల నక్షత్రాలు (Cepheid variables).
- తొలిసారి ఇటువంటి నక్షత్రాన్ని కనుగొన్న వ్యక్తి జాన్ గూడ్రిక్ (John Goodricke). ఇతను కనుగొన్న నక్షత్రం పేరు డెల్టా సెఫీ (Delta Cephei). అందువలన చంచల నక్షత్రాలను సేఫిడ్ వేరియబుల్స్ (Cepheid variables) అంటారు.
- చంచల దశ తరువాత బాహ్య పొరలను ఆక్రమించుకొనే ప్రయత్నంలో మనకు ప్రేలినట్టుగా కనబడే నక్షత్రాలను "తాత్కాలిక నక్షత్రాలు" అంటారు. వీటికి గల ఇతరపేర్లు నోవా, సూపర్ నోవా.
- బాహ్య పొరలను ఆక్రమించి పరిమాణంలో, ప్రకాశంలో పూర్తి స్థాయి పొందిన నక్షత్ర దశ రెడ్ జెయింట్ (Red giant). సూర్యుడు ప్రస్తుతం రెడ్ జెయింట్ దశలో ఉన్నాడు. రెడ్ జెయింట్ దశ తర్వాత ఇందనాన్ని పీల్చుకొనే ప్రయత్నంలో తెల్లగా మారుతూ పరిమాణంలో చిన్నదిగా మారే నక్షత్రాన్ని మరుగుజ్జు నక్షత్రం (White dwarf) అంటారు.
- నక్షత్రంలో అణుసంలీన చర్య పూర్తిగా అంతరించిన తర్వాత పదార్థమంతా కేంద్రం దిశగా ఆకర్షించబడి ఏర్పడిన ఖగోళ వస్తువును కృష్ణ బిలం (Black hole) అంటారు. ఇది అత్యధిక సాంద్రతను మరియు అత్యధిక గురుత్వాకర్షణ శక్తిని కలిగి ఉంటుంది.
- ఈ కృష్ణ.బిలాల మీద పరిశోదన చేసిన భారత శాస్త్రవేత్త సుబ్రమణ్య చంద్రశేఖర్. ఇతను ప్రతిపాదించిన సిద్దాంతం "చంద్రశేఖర్ లిమిట్".
- సూర్యుడు గేలక్సీలో ఒంటరిగా ఉండటం వలన ఇతనిని ఒంటరి నక్షత్రం అంటారు. 2 కంటే ఎక్కువ నక్షత్రాలు కల్గి ఉంటె దానిని బహుళ నక్షత్రాలు అంటారు. ఉదా : అల్ఫా సెంటారీ (or) ప్రాక్సిమా సెంటారీ - 3 నక్షత్రాలు.

No comments:
Post a Comment