రాష్ట్రంలో 21,343 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నిర్వహించిన డీఎస్సీ రాత పరీక్షకు సంబంధించిన జిల్లాల వారీ మెరిట్ జాబితాలను దసరా పండుగ తరువాతే జిల్లాలకు పంపించాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఇటీవల రాత పరీక్ష ఫలితాలను విడుదల చేసిన విద్యాశాఖ ఈ నెల 8 నుంచి అభ్యర్థుల ఆన్‌లైన్ దరఖాస్తుల్లో తప్పుల సవరణకు అవకాశం ఇచ్చింది. గురువారంతో ఈ గడువు ముగిసింది. దాదాపు 4,500 మంది అభ్యర్థులు దరఖాస్తుల్లో పొరపాట్లను సరిదిద్దుకున్నారు. ఇక అభ్యర్థులకు సంబంధించిన రాత పరీక్ష మార్కులను, ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) మార్కులను కలిపి జిల్లాల వారీగా మెరిట్ జాబితాలను రూపొందించే పనిపై దృష్టి సారించింది. ఈ ప్రక్రియ పూర్తయ్యేందుకు మరో 10 రోజులకు పైగా సమయం పట్టనుంది. దసరా పండుగ తరువాతే మెరిట్ జాబితాలను హార్డ్ కాపీలతోపాటు సాఫ్ట్ కాపీలను జిల్లాలకు పంపనుంది.
No comments:
Post a Comment