Thursday, October 18, 2012

గ్రూప్-1 మెయిన్స్ ఫలితాలపై స్టే

హైదరాబాద్ : గ్రూప్ 1 మెయిన్స్ ఫలితాలను వచ్చే నెల 5 వరకు ప్రకటించరాదని రాష్ట్ర పరిపాలన ట్రిబ్యునల్ గురువారం ఏపీపీఎస్సీని అదేశించింది. ప్రిలిమ్స్ పరీక్ష కీ విషయంలో వారంలోగా కౌంటర్ దాఖలు చేయలని స్పష్టం చేసింది. కీలో మరో ఆరు తప్పులు ఉన్నాయని, వాటిని పట్టించుకోకుండా ఏపీపీఎస్సీ మెయిన్స్ పరీక్షను నిర్వహించటంపై కొందరు అభ్యర్థులు ట్రిబ్యునల్ ను ఆశ్రయించారు. ఈ విషయంలో ఏపీపీఎస్సీ పారదర్శకంగా వ్యవహరించటం లేదని, దీనివల్ల తమకు అన్యాయం జరిగిందని అభ్యర్థులు కోర్టుకు విన్నవించారు. అభ్యర్థుల వాదనలపై స్పందించిన ట్రిబ్యునల్ ఫలితాలపై స్టే విధించింది.

2 comments:

  1. నాకు దున్నపోతుకు ఎపిపిఎస్సి కి అట్టే తేడా తెలియట్లేదు. దున్నపోతును ఎన్ని తిట్టిన పట్టించుకోదు ఎపిపిఎస్సి కూడా అంతే కోర్టు ఎన్నిసార్లు మొట్టికయవేసిన పట్టించుకోదు.

    ReplyDelete