Sunday, October 21, 2012

గ్రూప్-4 పరీక్ష పేపర్ల వేల్యూయేషన్ ప్రారంభమయింది

గ్రూప్-4 పరీక్ష పేపర్ల వేల్యూయేషన్ ప్రారంభమయింది. ముందుగా గ్రూప్-4లోని హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ కేటగిరి పేపర్ల వేల్యూ యేషన్ కమిషన్ మొద లు పెట్టింది. ఈ ప్రక్రి య పూర్తయిన తర్వాతే గ్రూప్-4 జూనియర్ అసి స్టెంట్స్ పేపర్ల వేల్యూయేషన్ ప్రారంభించ నున్నారు. 867 పోస్టులు గల హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ రాత పరీక్షకు 1.2 లక్షల మంది అభ్యర్ధులు పోటీపడిన సంగతి తెలిసిందే. కంప్యూటర్ వేల్యూయేషన్ ప్రక్రియను నవంబర్ నెలాఖరుకల్లా పూర్తి చేయనున్నారని సమాచారం. వేల్యూయేషన్ ప్రక్రియ ముగిసే క్రమంలో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ రాత పరీక్ష ‘కీ’ ప్రకటించి, అభ్యర్ధుల నుంచి అబ్జెక్షన్స్ తీసుకోవాలని కమిషన్ నిర్ణయించింది. ఈ పరీక్ష పేపరు జవాబులపై ఏవేని ఫిర్యాదులు వస్తే వాటిని సమీక్షించుకుని ఫైనల్ ‘కీ’ ప్రకటించిన తర్వాతే హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ పరీక్ష ఫలితాలు వెల్లడించనున్నారని కమిషన్ నుంచి సమాచారం. మొత్తం మీద డిసెంబర్ మొదటివారం కల్లా హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ ఫలితాలు అభ్యర్ధులు ఆశించవచ్చు. ఇదిలా ఉండగా, 6.7 లక్షల మంది హాజరైన గ్రూప్-4 జూనియర్ అసిస్టెంట్ ఫలితాలు 2013 జనవరి లేదా ఫ్రిబవరిలో వెలువడేలా కమిషన్ పనులు జరుగుతున్నాయి.

No comments:

Post a Comment