గ్రూప్-2 ఉద్యోగాలను గ్రూప్-1 లో విలీనం చేయాలనే ఆలోచనను విరమించకపోతే వేలాదిమంది నిరుద్యోగులతో ఎపిపిఎస్సి ని ముట్టడిస్తామని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అద్యక్షలు ఆర్.కృష్ణయ్య హెచ్చరించారు.చీఫ్ సెక్రటరీని ప్రిన్సిపల్ సెక్రటరీగా, ప్రిన్సిపల్ సెక్రటరీని కలెక్టర్ గా నియమిస్తారా? వేర్వేరు స్థాయి కలిగిన గ్రూప్-2 ఉద్యోగాలను గ్రూప్-1 లో ఎలా విలీనం చేస్తారని ఆయన ప్రశ్నిచారు. రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం ఆద్వర్యంలో వేలాది మంది నిరుద్యోగులు ఇందిరా పార్క్ వద్ద నిర్వహించిన ప్రదర్శనలో ఆయన మట్లాడుతూ గ్రూప్-2 లోని ఎగ్జిక్యూటివ్ పోస్టులను, గ్రూప్-1(బీ) సర్వీసుగా మార్చడం న్యాయపరంగా, చట్టపరంగా విరుద్దమన్నారు. ఆరువేల గ్రూప్-2 ఉద్యోగాలను తక్షణమే భర్తిచేయాలని, పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో అవినీతిని అరికట్టాలని, అన్ని కేటగిరీల ఉద్యోగాలను రాత పరీక్షల మార్కుల ఆధారంగా మెరిట్ ప్రకారమే భర్తీ చేయాలనీ సూచించారు.గ్రూప్-2 ఉద్యోగాలను గ్రూప్ 1 లో విలీనం చేయాలనే ప్రభుత్వ ప్రతిపాదనను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.ఇలా విలినంచేస్తే రెండు మార్కుల తేడాతో డిప్యూటీ కలెక్టర్ నుంచి డిప్యూటీ తహసిల్దార్ పోస్టుకు పడిపోయే ప్రమాదం ఉంటుందని తెలిపారు .ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోకపోతే వేలదిమందితో ఎపిపిఎస్సి ని దిగ్బందం చేస్తామని హెచ్చరించారు. ఖాళీగా ఉన్న 4.50 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేసారు.
No comments:
Post a Comment