Friday, October 26, 2012

ఎపిపిఎస్సి ఉద్యోగాలకు ఇంటర్వ్యూ లు ఉండవు

 గ్రూప్-1 మినహా ఎపిపిఎస్సి నిర్వహించే మరే పరీక్షలకు ఇంటర్వ్యూ లను నిర్వహించబోమని ప్రభుత్వం హామీ ఇచ్చినట్లు బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అద్యక్షులు ఆర్.కృష్ణయ్య తెలిపారు. ఈ విషయమై కృష్ణయ్య నేతృత్వంలో వివిధ యూనివర్సిటీ లకు చెందిన విద్యార్థులు గురువారం సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మిన్నిమాథ్యును కలిసి చర్చలు జరిపారు. 40 కేటగిరి పోస్టులకు ఇంటర్వ్యూ లేకుండానే ఫలితాలివ్వాలని ఎపిపిఎస్సి అధికారులను ఆదేశిస్తామని, ఈ మేరకు శుక్రవారమే ఉత్తర్వులిస్తామని హామీ ఇచ్చారని కృష్ణయ్య తెలిపారు.

No comments:

Post a Comment