కార్పొరేట్ కాలేజీల్లో చదువుతున్న విద్యార్థులను చూస్తే బాధ, జాలి కలుగుతోంది. తెల్లవారుజాము నుంచి రాత్రి పొద్దుపోయేదాకా విద్యార్థులు నాలుగు గోడల మధ్యే నలిగిపోతున్నారు. ఎంసెట్ అని, ఐఐటీఅని రకరకాల పేర్లు పెట్టి, విద్యార్థులను విభజించి, తరగతి గదులను జైలు గదుల్లా మార్చేసి పుస్తకాలు తప్ప మరో ప్రపంచం తెలియకుండా చేసేస్తున్నారు. ఇంట్లో జరిగే శుభకార్యాలు, ఊళ్లో జరిగే పండగలు పబ్బాల్లో పాల్గొనాలని ఉన్నా సెలవు దొరకని పరిస్థితి. ఆదివారాలూ, సెలవు దినాల్లోనూ తరగతులు నిర్వహిస్తుంటే ఇక విద్యార్థులకు విశ్రాంతి దొరికేదెప్పుడు? కాలేజీల్లో మరయంత్రాల్లా మారిపోతుంటే యువతలో మనో వికాసం కలిగేదెలా? ఎవరికైనా యుక్తవయసులోనే వ్యక్తిత్వం రూపుదిద్దుకుంటుంది. అలాంటి వయసులో బాహ్య ప్రపంచానికి సంబంధించిన విషయాలపైన అవగాహన అవసరమవుతుంది. దాని ఆధారంగానే వారిలో భావాలు రూపుదాల్చుతాయి. సామాజిక స్పృహ, బాధ్యత వంటివి ఏర్పడాలన్నా యుక్త వయసే చాలా కీలకమైనది. ఇంత ముఖ్యమైన వయసులో పుస్తకాలు తప్ప మరో అంశంతో పరిచయం లేకుండా చేసేస్తున్నారు. విద్యార్థులకు కనీసం దినపత్రికలైనా చదవడానికి సమయం లేకుండా పుస్తకాలతో కుస్తీ చేయిస్తున్నారు. ఇక టీవీ చూడడానికి, వార్తలు చూడడానికి సమయమే ఉండడం లేదు.
కళాశాలల యాజమాన్యాల తీరుకు విద్యార్థుల తల్లిదండ్రులూ వంత పాడుతున్నారు. తమ పిల్లలకు మార్కులొస్తే చాలని భావిస్తున్నారు. దీనివల్ల భవిష్యత్తులో జరగబోయే నష్టం గురించి ఆలోచించడం లేదు. వృద్ధాప్యంలోని తల్లిదండ్రులను విస్మరించడానికి కారణం వారికి సామాజిక బాధ్యత, మానవతా విలువలు వంటివి నేర్పించకపోవడమేనని గుర్తించలేకపోతున్నారు. సెలవు దినాల్లో క్లాసులు నిర్వహించడం తప్పని విద్యార్థి సంఘాలు చెబుతున్నా వారికి విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి సరైన మద్దతు లభించడం లేదు.
ఇప్పటికైనా పరిస్థితి మారాలి. యాజమాన్యాలు, ప్రభుత్వం విద్యార్థుల తల్లిదండ్రులు ఆలోచించాలి. చదువులకు మార్కులే పరమావధి కాదని గుర్తించాలి. విద్యార్థుల మనో వికాసానికి అవసరమైన అన్ని చర్యలనూ చేపట్టాలి.

No comments:
Post a Comment