Sunday, October 21, 2012

ఏపీపీఎస్సీపై ట్రిబ్యునల్ ఆగ్రహం

ఏపీపీఎస్సీ అధికారుల తీరుపై రాష్ట్ర పరిపాలన ట్రిబ్యునల్ ఆగ్రహం వ్యక్తం చేసింది. గ్రూప్-1 కీలో రెండు తప్పులపై దాఖలైన కేసులో వివరణ ఇవ్వాలంటూ ట్రిబ్యునల్ ఆదేశాలు జారీచేసినప్పటికీ, ఏపీపీఎస్సీ స్పందించకపోవడంపై ట్రిబ్యునల్ మండిపడింది. సకాలంలో కౌంటర్ దాఖలు చేయడంలో ఎందుకు జాప్యం చేస్తున్నారని ఏపీపీఎస్సీ అధికారులను ప్రశ్నించింది. గ్రూప్-1 కీ పత్రంలో ప్రకటించిన తప్పులకు గాను ఇప్పటికే 11 మార్కులను అభ్యర్థులకు కలిపిన విషయం తెలిసిందే. అయితే కీ లో మరిన్ని తప్పులు ఉన్నాయని, మెయిన్స్ పరీక్ష రద్దు చేయాలంటూ కొంత మంది అభ్యర్థులు అక్టోబర్ మొదటి వారంలో ట్రిబ్యునల్‌లో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ట్రిబ్యునల్ విచారించింది.

No comments:

Post a Comment