Saturday, October 20, 2012

నిరుద్యోగులకు వరమనుకున్న ఏపీపీఎస్సీయే వారిపాలిట శాపంగా మారుతోంది

 •డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్స్‌ - పరీక్ష తేదీ ఏప్రియల్‌ 29

•ఇండస్ట్రియల్‌ ప్రమోషన్ ఆఫీసర్స్‌- పరీక్ష తేదీ మే 6

•ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్‌- పరీక్ష తేదీ జూన్‌ 3

•రాత పరీక్షల మార్కులే ఫైనల్‌ అంటున్న ప్రభుత్వం

•ఇంటర్వ్యూలు పెడతామంటున్న ఏపీపీఎస్సీ

•మధ్యలో నలిగిపోతున్న అభ్యర్థులు

•20 వేల పోస్టుల భర్తీకి 50 నోటిఫికేషన్లు

•రాతపరీక్షలతో పోస్టింగ్‌లు ఇస్తామన్న ప్రభుత్వం

•ఇంటర్వ్యూలు పెట్టి తారాలంటున్న ఏపీపీఎస్సీ

•కొన్ని పోస్టులకు ఇంటర్వ్యూలు వద్దని సూచించిన కమిటీ

•ఇంటర్య్వూలు రద్దుచేస్తూ జీవో 420 విడుదల

•ఇంటర్వ్యూలు కావాలని పట్టుపడుతున్న కమిషన్ సభ్యులు

•నిలిచిపోయిన 30 కిపైగా నోటిఫికేషన్‌ల ఫలితాలు

•లాంగ్‌లీవ్‌పై వెళ్లిన సెక్రటరీ పూనం మాలకొండయ్య?

•ఇంటర్వ్యూలు ఉండాల్సిందేనంటూ సీఎంపై ఒత్తిడి

నిరుద్యోగులకు వరమనుకున్న ఏపీపీఎస్సీయే వారిపాలిట శాపంగా మారుతోంది. నెలలు గడుస్తున్నా.. పరీక్షా ఫలితాలు మాత్రం విడుదల చేయడం లేదు. ప్రభుత్వం వద్దని చెప్పినా.. ఇంటర్య్వూలు నిర్వహించాలనే పట్టుబడుతోంది. అసలింతకీ కమిషన్‌లో ఏం జరుగుతుంది.? లక్షలాది మంది అభ్యర్ధుల జీవితాలతో ఏపీపీఎస్‌సీ ఎందుకు చెలగాటం ఆడుతుంది....వాచ్‌ దిస్‌ స్టోరీ.పరీక్షలు జరిగి ఐదునెలలైంది... ఫలితాలెప్పుడొస్తాయి సార్‌.... ఇదీ వందలాదిమంది నిరుద్యోగులు ఏపీపీఎస్సీ కార్యాలయంలో కనబడిన వారినందరినీ అడుగుతున్న ప్రశ్న. ఏళ్ల తరబడి ప్రిపేర్‌ అయి పరీక్షలు రాసిన అభ్యర్ధులు... ఇప్పడు ఫలితాల కోసం కళ్లు కాయలుకాసేలా ఎదురుచూస్తున్నారు. కానీ ఏపీపీఎస్సీ నుంచి వస్తున్న సమాధానం చూసి ఆశ్యర్యపోతున్నారు.

గతేడాది దాదాపు 20 వేల పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ 50కి పైగా నోటిఫికేషన్‌లు జారీ చేసింది. రాత పరీక్షలూ పూర్తయ్యాయి. కానీ ఏంలాభం నెలలు గడుస్తున్నా ఫలితాలు మాత్రం విడుదల కావడం లేదు. 30 నోటిఫికేషన్‌ల ఫలితాల విడుదలపై కమిషన్‌ తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. దీనికి కారణం కమిషన్‌లోని కొంతమంది నిర్వాకమే అని తెలుస్తుంది. వాస్తవానికి నోటిఫికేషన్‌లు విడుదల చేసినప్పుడు రాతపరీక్షల మార్కుల ఆధారంగానే పోస్టింగ్‌లు ఇస్తామని పేర్కొన్నారు. తీరా పరీక్షలయ్యాక ఇప్పడు ఇంటర్య్యూలు పెడితేగానీ కుదరదంటూ మడతపేచి పెడుతోంది. ప్రభుత్వ ఇంటర్య్వూలు ఉండవని చెబుతుంటే సభ్యులు మాత్రం ఇంటర్య్వూలు పెట్టాలని డిమాండ్‌ చేస్తుండటంతో నిరుద్యోగులు మండిపడుతున్నారు.

వాస్తవానికి గతేడాదే ఏపీపీఎస్సీలో సంస్కరణల కోసం వేసిన సత్యనారాయణ కమిటీ... ప్రజలతో సంబంధం ఉండని పోస్టులకు ఇంటర్య్వూలు అవసరం లేదని సూచించింది. దీని ప్రకారమే రాష్ట్ర ప్రభుత్వం ఏపీపీఎస్సీ నిర్వహిస్తున్న కొన్ని పరీక్షలకు ఇంటర్య్వూలు రద్దు చేస్తూ జీవో 420 ని విడుదల చేసింది. దీన్ని కమిషన్‌లోని మెజార్టీ సభ్యులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. స్వత్రంత్ర ప్రతిపత్తిగల సంస్థ కావడంతో ప్రభుత్వానికి తమపై పెత్తనం చేసే అధికారం ఉండదని చెప్పుకొస్తున్నారు కమిషన్‌ సభ్యులు.మార్కెట్‌లో డిమాండ్ ఉన్న పోస్టులకు అభ్యర్ధుల నుంచి భారీగా డబ్బులు గుంజుకోవచ్చనే ఉద్దేశంతో ఈ విధంగా చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఇంటర్య్వూల విషయంలో కమిషన్‌ సభ్యులు, కార్యదర్శి పూనం మాలకొండయ్య మధ్య కోల్డ్‌వార్‌ కారణంగా ఆమె లాంగ్‌లీవ్‌ పెట్టి వెళ్లినట్టుగా సమాచారం. ఇంటర్య్వూల నిర్వహణపై ఇటీవల కమిషన్‌ సభ్యులు కొంతమంది సీఎం కిరణ్‌ను కలిసి విన్నవించారు. ఇప్పటికే రచ్చబండ కార్యక్రమాల్లో చాలాసార్లు సీఎం కిరణ్ సైతం ఇంటర్య్వూలు రద్దు చేస్తామని ప్రకటించారు. ఇవేమీ పట్టించుకోకుండా ఏపీపీఎస్సీ ఇష్టానుసారంగా వ్యవహరిస్తుందనే ఆరోపణలు వస్తున్నాయి.కమిషన్‌ తీరుతో నిరుద్యోగులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న ఏపీపీఎస్సీ విషయంలో సర్కార్ జోక్యం చేసుకోకుంటే ప్రతిభ ఉన్న నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం జరిగే అవకాశం ఉంది.

3 comments:

  1. all the gr2 aspirants should meet cheif minister on this issue because it is his praposal to remove interview to shorten the selection process so that they can give jobs to the unemployed as early as possible.there is no use of going before appsc it is waste of time.

    ReplyDelete
  2. can anybody tell the status of go 420 is it passed or not

    ReplyDelete