ప్రభుత్వం తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక చర్యల కారణంగా లక్షలాది మంది నిరుద్యోగులు రోడ్డున పడుతున్నారని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆందోళన వ్యక్తం చేశారు. ఇందుకు నిరసనగా ఈ నెల 31 తేదీ నాడు ఆర్.కృష్ణయ్య ఇక్కడ ఇందిరాపార్కు వద్ద ‘నిరుద్యోగుల గర్జన’ కార్యక్రమాన్ని నిర్వహిం చనున్నట్లు ప్రకటించారు. యూనివర్సిటీ విద్యార్థుల కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో సోమవారంనాడిక్కడ బీసీ భవన్‌లో జరిగిన నిరుద్యోగుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అనేక ప్రభుత్వ శాఖల లో ఖాళీలను భర్తీ చేయకపోవడంతో అభివృద్ధి కుంటుపడి అవినీతి పెరిగిపోతోందన్నారు.
ఇలాంటి వాటికి చోటివ్వకుండా, ప్రభుత్వంలోని వివి ద శాఖలలో ఏర్పడిన నాలుగున్నర లక్షల ఖాళీలను వెంటనే భర్తీ చేయా లని ఆర్.కృష్ణయ్య ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా జరిపే ఉద్యోగ నియామకాలకు ఇంటర్వ్యూ విధానాన్ని రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. యూని వర్సిటీ విద్యార్థుల కార్యాచరణ కమిటీ కన్వీనర్ కె.జగదీష్ ఆధ్వ ర్యంలో జరిగిన ఈ సమావేశంలో పలు బీసీ సంఘాల నేతలు గుజ్జ కృష్ణ, ర్యాగ రమేష్, కాశీం, రాజేందర్, బాల్‌రాజ్, నీలవెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు

No comments:
Post a Comment