Saturday, October 20, 2012

గ్రూప్-2 2011 వైట్నర్ వివాదం పై సుప్రీమ్ కోర్టుకు వెళ్ళిన ఎపిపిఎస్సి - CASE NUMBER SPL(CIVIL) 30781/2012

గ్రూప్-2 2011 వైట్నర్ వివాదం ఇంకా ఒక కొలిక్కి రాలేదు. వివరాల్లోకి వెళితే 600 ఎగ్జిక్యూటివ్ పోస్టులకు గాను 1200  అభ్యర్థులను ఇంటర్వ్యూ కి ఎపిపిఎస్సి పిలిచింది.అయితే ఫైనల్ ఫలితాలు ప్రకటించే లోగానే అనూహ్యంగా వైట్నర్ వివాదం తెరపైకి వచ్చింది. పరీక్షలో వైట్నర్ వాడిన అభ్యర్థులను ఎలా ఇంటర్వ్యూ లకు, ఆపై ఉద్యోగాలకు ఎంపిక చేస్తారంటూ వైట్నర్ వాడని కైలాస రావు ప్రధాన పిటిషనర్ దారుగా మరొక ఎనిమిది మంది  అభ్యర్థులు కోర్టను ఆశ్రయించారు.ట్రిబ్యునల్, హైకోర్ట్ లలో వాదోపవాదనలు జరిగాయి.

ఈ విషమై ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వైట్నర్ వాడిన అభ్యర్థులకు అనుగుణంగా, ఇప్పటికే ఇంటర్వ్యూ ల ప్రక్రియ పూర్తయినందున, ఈసారికి, వైట్నర్ వాడటం ఇది తోలిసారి  కాబట్టి, మానవతా దృక్పథంతో కన్సిడర్ చేయాలనీ సుప్రీమ్ కోర్టకు వెళ్ళినట్లు తెలుస్తుంది. సుప్రీమ్ కోర్టు తీర్పు ఒక పది రోజుల్లో తేలనుంది. విషయం తేలిన తరువాత సుప్రీమ్ కోర్టు ఆదేశాలనుగునంగా ఎపిపిఎస్సి గ్రూప్-2 2011 నియామకాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది.  

గ్రూప్-2 2012 రిజల్ట్స్


గత సంవత్సరం జరిగిన గ్రూప్-2 ఫలితాలకు సంబంధించిన వైట్నర్ కేసులో  సుప్రీమ్ కోర్టు  తీర్పు మరో 10 రోజుల్లో ప్రకటించనుందని ఎపిపిఎస్‌సి అధికారులు భావిస్తున్నారు. ఈ తీర్పు మేరకు పెండింగ్ లోఉన్న గ్రూప్-2 పోస్టుల ఎంపిక ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా ఈ ఏడాది జులై 21, 22వ తేదీలలో జరిగిన తాజా గ్రూప్-2 పరీక్ష పేపర్ల వేల్యూయేషన్ పక్రియ పూర్తయిందని మరో వారం పదిరోజులలో కోడింగ్, డీకోడింగ్ ,కాన్ఫిడెన్షియాలిటీ పనులు పూర్తిచేసి ఫలితాల వెల్లడికి సిద్ధం చేస్తామని తెలిపారు. మొత్తం మీద పాత గ్రూప్-2 పోస్టుల ఎంపిక పక్రియ పూర్తి చేసిన నెల రోజులలోనే తాజా గ్రూప్-2 పోస్టుల పరీక్ష ఫలితాలు వెల్లడిస్తామన్నారు. దాదాపు 3 లక్షల మంది అభ్యర్థులు ఎదురుచూస్తున్న గ్రూప్-2 పరీక్ష ఫలితాలు వచ్చే నెలలో వెలువడుతాయని అభ్యర్థులు భావించవచ్చు. తాజా గ్రూప్-2 పోస్టుల భర్తీలో ఇంటర్యూలు లేక పోవటంతో రాతపరీక్ష మెరిట్‌తోనే ఎగ్జిక్యూటివ్, నాన్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలను సొంతం చేసుకోవచ్చని అభ్యర్థులు భావిస్తున్నారు.


గ్రూప్-1 వేల్యూయేషన్....

శరవేగంగా గ్రూప్-1 వేల్యూయేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. సెప్టెంబర్ 18న ప్రారంభమైన గ్రూప్-1 వేల్యూయేషన్ పక్రియను 45 రోజుల వ్యవధిలో పూర్తిచేయాలనే షెడ్యూల్‌తో కమిషన్ దూసుకెళ్తోంది. ఇప్పటికే రెండు పేపర్ల వేల్యూయేషన్ ప్రక్రియ ముగిసిందని, మిగతా పేపర్ల వాల్యుయేషన్ నవంబర్ మొదటి వారం కల్లా పూర్తి కానుందని అధికారుల ద్వారా తెలిసింది.

సాధారణంగా గ్రూప్-1 పేపర్ల వేల్యూయే షన్ ప్రక్రియ నెల రోజుల వ్యవధిలో పూర్తి చేసే సామర్థ్యం ఎపిపిఎస్‌సికి ఉంది. అయితే ఈ సారి డబుల్ వేల్యూయేషన్ విధానం అమలు చేస్తున్న దృష్ట్యా మరో 15 రోజులు అదనపు వ్యవధి కమిషన్‌కు అవసరమని అధికారులు వివరిం చారు. ఈ రిక్రూట్‌మెంట్‌లో 314 గ్రూప్-1 పోస్టులకు 1ః2 నిష్పత్తిలో 628 మంది అభ్యర్థులను ఇంటర్వ్యూకు ఎంపికచేస్తారు.

ఈ మొత్తం అభ్యర్థులకు నెల రోజుల వ్యవధిలో ఇంటర్వ్యూలు పూర్తి చేయనున్నట్లు సమాచారం. మొత్తం మీద గ్రూప్-1 పోస్టుల ఎంపిక పక్రియ మొత్తం ఈ ఏడాది డిసెంబర్‌లోగా పూర్తి చేసేలా కమిషన్ కట్టుది ట్టమైన చర్యలు చేపట్టింది. అయితే గ్రూప్-1 రిక్రూట్‌మెంట్‌పై వేసిన పలు కోర్టు కేసుల తుది తీర్పునకు లోబడి మెయిన్స్ పరీక్ష ఫలితాలు కమిషన్ ప్రకటించనుంది.

1 comment: