ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ డిసెంబర్‌లో ప్రకటించబోయే గ్రూప్-1, గ్రూప్-2 నోటిఫికేషన్లలో అనూహ్య మార్పులు చేయాలని ప్రయత్నించడం, దీనిని నిరసిస్తూ అభ్యర్ధులు ధర్నాలు, రాస్తారోకోలు చేయడం, చివరకు ప్రజాసంఘాలు, రాజకీయ నాయకులు కూడా అభ్యర్ధులకు మద్దతు తెలపడం వంటి సంఘటనల దృష్ట్యా కమిషన్ నిర్ణయాన్ని విభిన్న కోణాల్లో పరిశీలించాల్సిన అవసరం ఉంది.రాష్ట్రంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిరుద్యోగుల ఆశాజ్యోతి. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి గాను రాజ్యాంగ బద్ధంగా ఏర్పాటు చేసిన ఈ కమిషన్ ఇప్పటి వరకు వివిధ విభాగాలకు చెందిన లక్షలాది ఉద్యోగాలను అర్హతగల నిరుద్యోగులకు, చిరుద్యోగులకు అందించింది. డియస్సీ, పోలీస్ రిక్రూట్‌మెంట్ తప్ప దాదాపు అన్ని రకాల డిపార్ట్‌మెంట్లకు అవసరమయిన ఉద్యోగాలను సర్వీసు కమిషన్ భర్తీ చేస్తున్న విషయం తెలిసిందే.
కమిషన్‌కు రాజ్యాంగ బద్ధత ఎందుకు?
బ్రిటీష్ పాలనా కాలంలోనే అంతర్జాతీయ ప్రమాణాల ఆధారంగా కేవలం సామర్ధ్యం ప్రాతిపదికన పారదర్శకంగా అర్హతగల, సమర్ధులైన ఉద్యోగుల ఎంపిక కుగాను చట్టబద్ధమైన యంత్రాంగం ఉండేది. సామాజిక ఉద్యమాల ప్రభావం వంటి అనేక అంశాలను పరిగణలోకి తీసుకొని స్వాత్రంత్యానంతరం రాజ్యాంగ రూపకల్పన సమయంలోనే సామాజిక న్యాయం, దేశ పాలన, సంపదలో అన్ని వర్గాలకు అవకాశం కల్పించాలనే లక్ష్యంతో జాతీయ స్థాయిలో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. రాష్ట్రాలలో రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్లను ఏర్పాటు చేశారు.కమిషన్ ఛైర్మన్, ఇతర సభ్యుల ఎంపిక పదవీకాల భద్రత, స్వతంత్ర వంటి విషయాలను రాజ్యాంగంలో పేర్కొనడం వల్ల సహజంగానే నిష్పక్షపాతంగా భర్తీ ప్రక్రియ జరగడానికి అవకాశం ఉంటుంది. అంతే కాకుండా రాజ్యాంగబద్ధ సంస్థ అయినందున రాజకీయాలకు అతీతంగా నియమాల ఆధారంగా ఉద్యోగాలను భర్తీ చేస్తుంది. అయితే మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా, పరిపాలనా పరంగా చోటు చేసుకుంటున్న మార్పులను పరిగణనలోకి తీసుకొని భర్తీ ప్రక్రియలో నూతన పద్ధతులను ప్రవేశపెట్టేందు కుగాను ఛైర్మన్ కమిషన్ సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసి కమిటి సిఫార్సులను ప్రభుత్వ అనుమతి కోరుతుంటారు. ఇలా ఇప్పటివరకు అనేక మార్పులు చేశారు. అయితే మార్పులు చేస్తున్న ప్రతిసారి సహజంగానే మార్పును వ్యతిరేకించే వర్గాలు నిరసన వ్యక్తం చేయడాన్ని కూడా గమనించవచ్చు.
గ్రూప్-1ఎ, 1బి ప్రతిపాదనకు కారణం?
ఎపిపియస్‌సి 2007లో గ్రూప్-1లో ఆప్షనల్స్‌కు బదులు కామన్ పేపర్లను ప్రవేశపెట్టడం, ఇంటర్వ్యూ మార్కుల శాతాన్ని తగ్గించడం, ఒకే బోర్డ్ ద్వారా ఇంటర్వ్యూ జరపడం వంటి సంస్కరణలు మంచి ఫలితాలనే ఇచ్చాయి. అయితే ఇంటర్వ్యూ మార్కుల విషయంలో మాత్రం అభ్యర్ధుల మధ్య వ్యత్యాసం 50 వరకు ఉండడం వివాదాస్పదంగా మారింది. గ్రూప్-2 విషయంలో కూడా ఇలాంటి వివాదం తలెత్తడం వల్ల ప్రభుత్వం ఒక కమిటీని నియమించింది. ఈ కమిటి గ్రూప్-1, లెక్చరర్స్ వంటి రిక్రూట్‌మెంట్స్ కు మాత్రం ఇంటర్వ్యూ ఉంటే సరిపోతుందని గ్రూప్-2తోపాటు మిగతా ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు అవసరం లేదని సూచించింది.గ్రూప్-2లోని ఎగ్జిక్యూటివ్ పోస్టులైన ఎసిటిఓ, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ సబ్ రిజిస్ట్రార్, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఇన్ రూరల్ డెవలప్‌మెంట్ వంటి పోస్టులు కొన్ని యూనిట్ ఆఫీసులుగా ఉండటం, ప్రమోషన్ ద్వారా గ్రూప్-1 స్థాయికి చేరే అవకాశం ఉన్నందున వీటికి ఇంటర్వ్యూలు అవసరమని అయితే గ్రూప్-2లో ఇంటర్వ్యూలు రద్దుచేసినందున ఈ పోస్టులను గ్రూప్-1లో చేర్చి కొత్తగా గ్రూప్-1బిని ఏర్పాటు చేయాలని కమిషన్ భావిస్తున్నది.
అభ్యర్ధుల్లో ఆందోళన ఎందుకు?
సాధారణంగా పోటీ పరీక్షలకు ప్రిపేరయ్యే అభ్యర్ధులు రెండు రకాలుగా ఉంటారు. 1. డిస్క్రిప్టివ్ విధానంలో వుండే గ్రూప్-1కు ప్రిపేరయ్యే అభ్యర్ధులు విశ్లేషణా సామర్ధ్యం, సమకాలీన విషయాలను ఆకళింపు చేసుకొని తార్కిక కోణంలో, విమర్శణాత్మక ధోరణిలో క్లుప్తంగా విషయాన్ని వివరించగలుగుతారు. 2. ఆబ్జెక్టివ్ విధానంలో వుండే గ్రూప్-2 లాంటి పరీక్షలకు ప్రిపేరయ్యే అభ్యర్ధులు ఎక్కువగా జ్ఞాపకశక్తిని కలిగి ఉండి ప్రతి టాపిక్‌లోని ప్రాముఖ్యతగల అంశాన్ని గుర్తించే సామర్ధ్యం, స్థూల అవగాహనను కూడా కలిగి ఉంటారు.కాగా గ్రూప్-2లో ఇంటర్వ్యూను రద్దు చేసినప్పుడు ఎలాంటి అభ్యంతరం చెప్పని అభ్యర్ధులు గ్రూప్-1బిని వ్యతిరేకించటానికి ప్రధాన కారణం గత దశాబ్ధ కాలంపాటు గ్రూప్-2లో టాప్ పోస్ట్ లక్ష్యంగా ప్రిపేరవుతున్న సీనియర్ అభ్యర్ధులతో పాటు ప్రిపరేషన్‌కు ఎక్కువ సమయం కేటాయించలేని వారు, ఆర్థిక సమస్య లున్నవారు, ఇతర చిన్నచిన్న ఉద్యోగాలు చేసుకుంటూ ప్రిపేర య్యేవారు డిస్క్రిప్టివ్ విధానంలో విజయం సాధించలేమన్న భయం ఉన్నం దున పాత పద్ధతిలోనే గ్రూప్-2 ఉండాలని కోరుకుంటున్నారు. గ్రూప్-1బిని ప్రవేశపెడితే గ్రూప్-1లో తక్కువ మార్కులు వచ్చిన వారికి కూడా ఏదో ఒక పోస్ట్ రావచ్చు. కానీ ఆబ్జెక్టివ్ విధానంలో గరిష్ట మార్కులు సంపా దించుకునే అభ్యర్ధులు డిస్క్రిప్టివ్ విధానంలో కనీస మార్కులు పొందలేకపోవచ్చు. అంతిమంగా తక్కువ నాలెడ్జ్ వుండి కూడా డిస్క్రిప్టివ్ విధానానికి అనుసరణ చెందిన వాళ్ళకు మంచి పోస్టులు వచ్చే అవకావం ఉండటం వల్ల ప్రతిభగల అభ్యర్ధులకు అవకాశాలు తగ్గే ప్రమాదం కూడా ఉండవచ్చు.
గ్రూప్-1బిల పోస్టుల స్వభావం?
ప్రతిపాదిత విధానం ప్రకారం గ్రూప్-1బి పోస్టులు గ్రూప్-1ఎ పోస్టులకు ఫీడర్ పోస్టులు గా పరిగణిస్తారు. అంటే సంబంధిత పోస్టుకు ఆధారంగా ఉండటం. ఉదా॥ గ్రూప్-1లోని సబ్ రిజిస్ట్రార్ ప్రమోషన్ ద్వారా గ్రూప్-1ఎలోని డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్‌గా ఎదగవచ్చు. సహజంగా ఈ రకమైన ప్రమోషన్లుకు దాదాపు అన్ని విభాగాలలో సగటున 6 నుండి 10 సంవత్సరాల కాలం పట్టవచ్చు. ప్రస్తుతం ఆబ్జెక్టివ్ విధానంలో గ్రూప్-2 ఎంపికయినప్పటికి సంబంధిత పోస్టులో సుదీర్ఘ అనుభవాన్ని పొందిన తరువాతే గ్రూప్-1 స్థాయికి ప్రమోట్ అయినప్పుడు మరింత ఉత్సాహంగా విధులు నిర్వహించేవారు. ఎందుకంటే ఒక కేటగిరి నుండి మరో కేటగిరి అప్‌గ్రేడ్ అయినట్లు భావించటం వల్ల మంచి ఫలితాలు కనపడుతున్నాయి. అలాంటప్పుడు ప్రస్తుతం ప్రతిపాదించబోయే నూతన విధాన ప్రాముఖ్యత అదనంగా ఏముంటుందన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ఆబ్జెక్టివ్ విధానంలో ప్రతిభను గుర్తించలేమా?
జాతీయస్థాయిలో, రాష్ట్రస్థాయిలో ఉద్యోగాల భర్తీకి అవలంభిస్తున్న డిస్క్రిప్టివ్, ఆబ్జె క్టివ్ విధానాలలో రెండూ కూడా ఖచ్చితంగా 100% ప్రతిభావం తుల్ని ఎంపిక చేయడానికి దోహదపడతాయని చెప్పలేం, ప్రతి విధానంలో కొన్ని మెరిట్స్, డీమెరిట్స్ ఉంటా యి. అయితే పోస్టుల స్వభావం, పరీక్షకు హా జరయ్యే అభ్యర్ధుల సంఖ్య పేపర్ ఎవాల్యూ యేషన్ పద్ధతి, ఫలితాల వెల్లడికి పట్టే సమయం, పారదర్శకత, సాంకేతికత వినియోగం వంటి అంశాలను పరిగణలోకి తీసుకొని పరీక్షా విధానాన్ని కమిషన్ నిర్ణయిస్తుంది. ప్రభుత్వం రిజర్వేషన్లు (రోస్టర్) పోస్టుల సంఖ్యను గరిష్ట, కనిష్ట వయోపరిమితి, వేతనాన్ని నిర్ణయిస్తుంది. ఇక రిక్రూట్‌మెంట్ పద్ధతి విషయంలో మాత్రం కమిషన్‌కు స్వతంత్రత ఉంటుంది. సర్వీస్ కమిషన్ గత అనుభవాల దృష్ట్యా ఎప్పటికప్పుడు మార్పులు చేర్పులకు అవకాశం కల్పిస్తున్నది. అదే విధంగా అభ్యర్ధుల సలహాలు, సూచనలను కూడా పరిగణలోకి తీసుకుంటున్నది.ఆబ్జెక్టివ్ విధానం అనగానే చాలా మంది చాలా సులభమైన పరీక్ష అనుకుంటారు. జవాబులు అక్కడే ఉంటాయి కాబట్టి వాటిలో ఏదో ఒక ఆన్సర్‌ను గుర్తిస్తే సరిపోతుందని భావిస్తుంటారు. అదృష్టం ఉంటే సరిగా ప్రిపేర్ కాకపోయినా ఉద్యోగం సంపాదించవచ్చని అపోహ పడుతుంటారు. నిజానికి ఈ విధానం చాలా కఠినమైనది. ఎందుకంటే సిలబస్ సంబంధిత అంశాలనుండే అనువర్తన కోణంలో, వర్తమాన అంశాల ప్రాతిపదికన లేదా పుట్టు పూర్వోత్తరాల నుండి ప్రశ్నలు ఉంటాయి. వీటికి సమాధానాలు గుర్తించాలంటే నిరంతర అధ్యయనంతో పాటు లాజికల్ మైండ్ సెట్ కూడా అవసరం.ఆబ్జెక్టివ్ విధానంలో అదృష్టం పాత్ర తక్కువే అని చెప్పవచ్చు. ఎందుకంటే ఏవో కొన్ని ప్రశ్నలకు గుడ్డిగా పెట్టిన సమాధానాలు కరెక్ట్ అయినప్పటికి, కన్ఫూజన్ తొందరపాటు, నిర్లక్ష్యం, అనువాద సమస్యల వల్ల తెలిసిన ప్రశ్నలకు కూడా తప్పుడు సమాధానాలను గుర్తించే ప్రమాదం సహజంగానే ఎక్కువ మందిలో ఉంటుంది. అంతిమంగా చూస్తే లక్‌తో వచ్చిన మార్కులు ఆటోమేటిక్‌గా మైనస్ అవుతాయి కాబట్టి నికరంగా అభ్యర్ధి ప్రతిభకు సమానంగా మార్కులు రావడానికి అవ కాశం ఉంటుంది. ముఖ్యంగా అబ్జెక్టివ్ విధానంలో అవక తవకలు జరగకుండా చూడటానికి గాను బాల్ పెన్నుతో ఓ.ఎం.ఆర్ షీట్‌లో మార్క్ చేయడం, కంప్యూటర్ ఆధారిత స్కానింగ్ ద్వారా ఎవాల్యూయేషన్ జరగడం వల్ల ప్రతిభగల అభ్యర్ధికి ఎట్టి పరిస్థితులోనూ అన్యాయం జరగకపోవచ్చు. డిస్క్రిప్టివ్ విధానంలో ప్రశ్న విభిన్న కోణాల్లో అడగటం నిర్ణీత సమయంలో ప్రశ్నకు తగ్గట్టు సమాధానాల్ని అర్ధమయ్యే విధంగా రాయాల్సి ఉంటుంది. ‘కీ’ పాయింట్ల ఆధారంగా ఎవాల్యూయేషన్ జరుగడం విశ్లేషణ విషయంలో ఎగ్జామినర్ మూడ్ కూడా ముఖ్యమే. కాబట్టి ఖచ్చితంగా 100% అభ్యర్ధి అనుకున్న స్థాయిలో మార్కులు రాకపోవచ్చు.
గతంలోనూ గ్రూప్-2లో డిస్క్రిప్టివ్ విధానం
పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రభుత్వ పాలనకు అవసరమయిన సమర్ధులైన ఉద్యోగులను అందించే యంత్రాంగం కాబట్టి పాలనలో మార్పులు వస్తే భర్తీ ప్రక్రియలో కూడా సహజంగానే మార్పులు వస్తాయి. 1995 వరకు గ్రూప్-2లో గ్రూప్-2ఎ, గ్రూప్-2బి కేటగిరి ఉండేవి. గ్రూప్-2ఎలో డిస్క్రిప్టివ్ ఆబ్జెక్టివ్ విధానం ఉండేది. అయితే ప్రతిభావంతులను ఎంపిక చేయడంలో, ఎవాల్యూయేషన్ పరంగా ఇబ్బందులు ఎదురవుతున్ట్లు గమనించారు. అదే సమయంలో పోస్టుల స్థాయిలో కూడా మార్పులు చేర్పులు జరిగాయి. (ఉదా॥ గ్రూప్-2ఎలో ఎం.ఆర్.ఓ పోస్ట్‌ను డిప్యూటీ తహసిల్దార్‌గా మార్చడం అదే విధంగా గ్రూప్-2ఎలో కొన్ని పోస్టులను తీసుకొచ్చి గ్రూప్-1లో చేర్చడం) ఫలితంగా గ్రూప్-2ను పూర్తిగా ఆబ్జెక్టివ్ విధానంగా మారుస్తూ ఇంటర్వ్యూ ఆధారంగా ఎగ్జిక్యూటివ్ పోస్టులను, కేవలం రాత పరీక్ష ఆధారంగా నాన్-ఎగ్జిక్యూటివ్ పోస్టులను భర్తీ చేసే విధానాన్ని అవలంభించింది. అయితే ఇంటర్వ్యూ మార్కుల విషయంలో వివాదాలు నెలకొనడంతో ప్రస్తుతం గ్రూప్-2లో ఇంటర్వ్యూలను రద్దుచేసి కేవలం రాతపరీక్ష ఆధారంగా మెరిట్ ప్రాతిపదిన రెండు రకాల పోస్టులను భర్తీ చేయడం జరుగుతున్నది.
ఎలాంటి విధానం సమర్ధనీయం?
రిక్రూట్‌మెంట్ విధానానికి సంబంధించి పబ్లిక్ సర్వీస్ కమిషన్‌కు స్వతంత్రత ఉన్నప్పటికి, పాలనలో చోటు చేసుకుంటున్న మార్పులకు అనుగుణంగా, వివాదాలకు తావులేని విధంగా, పారదర్శకంగా ఎంపిక ప్రక్రియ ఉండాలని అభ్యర్ధులు, ప్రభుత్వం కోరుకుం టున్నది. గ్రూప్-2లో వున్న పోస్టులను గ్రూప్-1లో చేరిస్తే మరిన్ని కొత్త సమస్యలు కూడా తలెత్తవచ్చు. పాలనపరంగా గ్రూప్-2 పోస్టులు గ్రూప్-1 పోస్టులకు ఫీడర్ పోస్టులు కాబట్టి గ్రూప్-1 అధికార యూనిట్ ఆఫీసులలోని సంబంధిత గ్రూప్-2 అధికారుల పనితీరును సమీక్షించే అధికారం, ఆదేశాలను జారీ చేసే అధికారాన్ని కలిగి ఉంటారు. సహజంగానే సమన్వయం, విధేయత గౌరవం సాధ్యమవుతుంది. ఒక వేళ గ్రూప్-2లోని ఎగ్జిక్యూటివ్ పోస్టులను గ్రూప్-1బిగా మారిస్తే ఒకే రిక్రూట్‌మెంట్ ద్వారా ఎంపికయిన అభ్యుర్ధులు కొద్ది మార్కుల తేడాతో అధికారి, సబ్ ఆర్డినేట్ అధికారి కేటగిరిలలో చేరడం వల్ల న్యూనతాభావం ఏర్పడి సమన్వయం దెబ్బతినే అవకాశముండవచ్చు. అంతేకా కుండా ఒక పోస్టు నుంచి పై పోస్టులకు పరిగణలోకి 10 మార్కులు తక్కువ వచ్చినందుకు 10 సంవత్సరాల పాటు నిరీక్షించాల్సి రావచ్చు. ఉదాహరణకు ప్రస్తుతం వున్న గ్రూప్-1 ఆర్‌డిఓ, ఎంపిడిఓ ఒకే కేటగిరిలో ఉండడం గమనార్హం. ఎంపిడిఓ కేడర్‌లో ఇలాంటి నిరాశా అవరించి ఉంది.ప్రతి రిక్రూట్‌మెంట్ విధానంలో కొన్ని లోపాలు ఉండడం సహజమే. అయితే లోపాలు ఉన్నతం మాత్రాన మొత్తం విధానాన్ని మార్చుకుంటూపోతే చిరవకు గందరగోళం తలెత్త వచ్చు. లోపాలు శాస్త్రీయంగా పరిష్కారం చూపే ప్రయత్నం చేయాలి తప్ప ప్రతిసారీ విధానాన్ని సమూలంగా మార్చడం సరైంది కాదు.ప్రస్తుతం గ్రూప్-2లో వున్న ఎగ్జిక్యూటివ్ పోస్టులకు పాలన పరంగా ప్రాముఖ్యత ఉన్నందున వీటికి ఇంటర్వ్యూలు ఉండటం సమర్ధనీయమే. కాకపోతే ఇంటర్వ్యూ మార్కులను తగ్గించడం, సింగిల్ బోర్డు విధానం, ఇంటర్వ్యూ మార్కుల విషయంలో గరిష్ట, కనిష్ట మార్కుల మధ్య తేడా అతి తక్కువగా ఉండేటట్లు చూడటం, కేవలం ఇంటర్వ్యూ మార్కుల ఆధారంగానే టాప్ పోస్ట్ పొందే పరిస్థితి ఉండకుండా చూడటం, పారదర్శకంగా, నిష్పక్షపాతంగా ఇంటర్వ్యూలను నిర్వహించడంపై దృష్టి సారించాలి. ఈ పోస్టుల ద్వారా ప్రమోషన్ పొంది గ్రూప్-1 స్థాయికి చేరుకునే అవకాశమున్నందున నాయకత్వ లక్షణాలను కూడా పరీక్షించాల్సిన అవసరం ఉన్నందున వీటికి ఇంటర్వ్యూలు ఉండటం సమర్ధనీయమే అని భావిస్తున్నారు. అయితే గ్రూప్-1, గ్రూప్-2 కేటగిరీల విలీనాన్ని వ్యతిరేకిస్తున్నారు.

Interview for Group2 post is ok, but candidates for interviews are same as post publish, based on interview marks post type will be decided is correct.
ReplyDelete