![]() |
| జ్యోతీబా గోవిందరావు ఫూలే |
గాంధీజీ కంటే ముందే మహాత్మునిగా గుర్తింపును పొందిన ఫూలే, మహారాష్ట్రలోని సతారా జిల్లా కత్గున్లో 1827 ఏప్రిల్ 11న మాలీ కులంలో జన్మించారు. తొమ్మిది నెలల పసిప్రాయంలో ఆయన తల్లిని కోల్పోయాడు. ఫూలే తండ్రి గోవిందు పుణెలో కూరగాయలు అమ్ముకుని జీవిక సాగించేవాడు. శూద్రుడైన ఫూలే చదువుకోవడం ఆ కుటుంబానికే అరిష్టమని అగ్రవర్ణాలవారు భయపెట్టడంతో గోవిందు కొడుకుని చదువు మానిపించేశాడు. తండ్రికి చేదోడువాదోడుగా ఉంటున్న ఫూలేలోని అద్భుత ప్రతిభను చూసి గోవిందు తోటివారు పిల్లవాడిని చదివించమని ప్రోత్సహించారు. అలా 1841లో పుణె స్కాటిష్ మిషనరీ స్కూల్లో ఆయన చదువు తిరిగి కొనసాగింది. జీవితకాల మిత్రుడు సదాశివ బల్లాల్ గోవాండేతో ఫూలేకు అక్కడే పరిచయమైంది. ఛత్రపతి శివాజీ, జార్జి వాషింగ్టన్ల జీవిత చరిత్రలు వారిద్దరికీ స్ఫూర్తి అయ్యాయి. ప్రత్యేకించి థామస్ పైన్ సుప్రసిద్ధ గ్రంథం ‘ది రైట్స్ ఆఫ్ మ్యాన్’ ఫూలేపై ప్రగాఢ ముద్రవేసింది. 1848లో ఒక బ్రాహ్మణ మిత్రుని పెళ్లి సందర్భంగా, తక్కువ జాతి వాడివంటూ ఎదురైన అవమానం ఆయన జీవిత లక్ష్యాన్ని నిర్దేశించింది. మనిషికి, మనిషికి మధ్య గోడలు కట్టే కులం సంఘ జీవితానికి హానికరమని, ఐక్యతకు అవరోధమని, అట్టడుగు వర్గాల వికాసానికి ప్రతిబంధకమని గుర్తించారు. ఇతడు స్త్రీలకు విద్య నిషేధమని ప్రవచించిన మనుస్మృతిని తిరస్కరించాడు. మానసిక బానిసత్వం నుండి శూద్రులను కాపాడాలని త్రితీయ రత్న అనే నాటకాన్ని రచించాడు. ప్రీస్ట్ క్రాఫ్ట్ ఎక్స్పోస్జ్ అనే గ్రంధాన్ని సమాజంలో పాతుకుపోయిన ఆచారాలను, మూఢ నమ్మకాలను ఖండించాడు. 1872లో గులాంగిరి అనే గ్రంధాన్ని ప్రచురించాడు. ఈయన స్థాపించిన సంస్థ - సత్య శోధక్ సమాజ్.
![]() |
| సావిత్రీబాయి |
కుల వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాటం
నిమ్న కులాలవారి కోసం, స్త్రీల కోసం దేశంలోనే ప్రప్రథమంగా పాఠశాలలు స్థాపించి, విద్యావ్యాప్తి ద్వారా వారిని దాస్య విముక్తుల్ని చేసేందుకు; కులవివక్షనూ, సాంఘిక దోపిడీనీ, మూఢనమ్మకాలనూ ... వాటికి కేంద్ర బిందువైన బ్రాహ్మణాధిపత్యాన్ని బద్దలు కొట్టేందుకు తిరుగుబాటు బావుటాను ఎగురవేసిన తొలితరం సామాజిక విప్లవకారుడు జోతిరావు ఫూలే (1827-1890). నిన్న మొన్నటి వరకూ మన దేశంలో విద్య అగ్రవర్ణాల గుత్తసొత్తుగా వుండేది. స్త్రీలైతే ఏ కులానికి చెందినవారైనా నాలుగు గోడల మధ్య బందీలుగా పడివుండాల్సిందే. విద్య మీదా, రాజ్యం మీదా, మతం మీదా బ్రాహ్మణులదే తిరుగులేని పెత్తనం. ఆచారాలు, సంప్రదాయాలు, ధర్మం న్యాయం అంటూ వారు బోధించే నీతులన్నీ వారి ఆధిపత్యం కొరకే అన్నట్టు నడిచిన కష్టమైన ఆనాటి కాలంలోనే సమానమైన మరో సమాజం కోసం నడుంబిగించాడు ఫూలే.ఎంతో సాహసోపేతంగా నిమ్న కులాల కోసం, స్త్రీల కోసం పాఠశాలల్ని నెలకొల్పి, వారి కొరకు తన భార్య సావిత్రీబాయికి చదువు చెప్పి ఆమెను టీచర్‌గా తీర్చిదిద్దాడు.అంతేకాక సతీ సహగమనాన్ని, అంటరానితనాన్ని, పురోహిత వ్యవస్థను నిర్మూలించేందుకు ఉద్యమించాడు. వితంతు వివాహాలను ప్రోత్సహించాడు. కార్మిక కర్షకుల హక్కులకోసం, సంఘ సంస్కరణ కోసం దళితులపై తరతరాలుగా సాగుతున్న బ్రాహ్మణీయ దోపిడీని ఎదిరిస్తూ తుదివరకు నిలబడ్డ ఫూలే జీవితం, పోరాటం తదనంతర కాలంలో డాక్టర్ అంబేడ్కర్ వంటి ఎందరో మహనీయులకు స్ఫూర్తినిచ్చింది. ఇలా మన హైందవ సమాజంలో తరతరాలుగా శూద్రులకు జరుగుతున్న అన్యాయాలనీ అవమానాలనీ గుర్తించిన మొట్టమొదటి భారతీయ దార్శనికుడు జ్యోతీరావు ఫూలే. 1890 నవంబర్ 28న శాశ్వతంగా విశ్రమించిన ఫూలే భారత సామాజిక విప్లవ పితామహునిగా, బహుజన విముక్తి ఉద్యమపు వేగుచుక్కగా చిరకాలం చరిత్రలో నిలుస్తారు.
"ధీనబందు" పత్రిక స్థాపన
సత్యశోధక సమాజ్ స్థాపన సమయంలో పత్రికలన్నీ బ్రాహ్మణులే నడిపేవారు. శూద్రులకు, అతి శూద్రులకు తమ భావ వ్యాప్తికోసం పత్రిక అవసరమని వెంకయ్య అయ్యవారూ, కాలేవార్ తదితరులు కలిసి 1200 రూపాయలు వెచ్చించి ఒక ముద్రణా యంత్రాన్ని కొని ‘సత్యశోధక సమాజ్’ కోసం బహూకరించారు. 1874 నవంబర్‌లో ఇది జరిగింది. ‘సర్కారు శాఖలోని వ్రాహ్మణుల నుంచి శుద్రాతిశూద్రులకు ఎన్ని కష్టాలు ఎదురవుచున్నావో బ్రిటిష్ ప్రభుత్వానికి తెలియజేయాలి’ అన్న ఆలోచనతో పత్రిక నడపాలని నిర్ణయించుకున్నారు. అయితే ఈ పత్రిక నడిపే శక్తి, ఆర్థిక వనరులు సరిపోవని భావించి పత్రిక స్థాపనను ఫూలే వ్యతిరేకించాడు. అయితే కృష్ణారావు బాలేకర్ పట్టుదలతో పత్రికను ‘దీనబంధు’ పేరిట నడిపించారు. అయితే చివరికి ఫూలే ఊహించినట్లుగానే అది ఎక్కువకాలం మనగలగ లేదు.
జ్యోతీబా గోవిందరావు ఫూలే అనుచరులు
1) ముకుందా రావ్ పాటిల్
2) ఛత్రపతి సాహు మహారాజ్ - కొల్హాపూర్ రాజు
- బ్రాహ్మనేతరులకు ఉద్యోగాలలో 50% రిజర్వేషన్లు
- దళితులకోసం వసతి గృహాలు పాఠశాలలు
- కులాంతర వివాహాలు
- సహపంక్తి భోజనాలు ను అమలుపరచడం
- అంబేద్కర్ కు ఆర్థిక సహాయం చేసిన రాజు
గులాంగిరి



No comments:
Post a Comment