Tuesday, November 6, 2012

‘వ్యవసాయం’నిండా ఖాళీలే!

తమది రెైతు ప్రభుత్వం అని ప్రచారం చేసుకుంటున్న కిరణ్‌ సర్కారు వ్యవసాయశాఖలో సంస్థాగత సమస్యలపెై దృష్టి పెట్టడంలేదు. రాష్ట్రంలో అత్యంత కీళకమైన వ్యవసాయరంగం శాఖపరమైన సమస్యలతో కొట్టుమిట్టాడుతోంది. ఆరు జిల్లాలకు గత కొంత కాలంగా వ్యవ సాయశాఖ అధికారులు లేరంటే ఈ శాఖలో నెలకున్న పరిస్థితల పట్ల ప్రభుత్వం చూపుతున్న నిర్లక్షతకు అద్దం పడుతుంది. గ్రామస్ధాయి. మండలస్ధాయి. జిల్లాస్థాయిల్లో పెద్ద సంఖ్యలో ఖాళీలతో వ్యవసాయశాఖ తన డొల్లతనాన్ని బెైటపెట్టుకుంటోంది. రాష్ట్ర వ్యవసాయరంగానికంతటికి దిశానిర్దేశం చేయాల్సిన వ్యవ్యసాయ శాఖ కమీషనరేట్‌లోనే వివిధ స్ధాయల్లో ఖాళీలున్నా వాటిని భర్తి చేసేందుకు చర్యలు తీసుకోవటంలేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రతి ఏటాపంటలసా గుకు ముందే ఉద్యోగుల ఖాళీలను భర్తి చేయాల్సిన ప్రభుత్వం ఖరీఫ్‌ సీజన్‌ ముగిసి రబీ సీజన్‌లోకి ప్రవేశించినా ఇంకా భర్తీప్రక్రియపెై దృష్టి పెట్టడంలేదు.

రాష్ట్రంలో రసాయనిక ఎరువుల కొరత ప్రభావాన్ని చవిచూసిన ప్రభుత్వం ఎరువుల విభాగాన్ని పర్యవేక్షించే అధికారి స్ధానాన్నికూడా భర్తీ చేయలేదు. వ్యవసాయశాఖ కమీషనరేట్‌లో నాలుగునెలల కిందట రసాయనిక ఎరువుల వ్యవహారాలని పర్యవేక్షించే అధికారి ఉద్యోగ విరమణ చేశారు. ఇక అప్పటినుంచి ఆ పోస్టును భర్తీ చేయకుండా మరొ అధికారికి అదనపు భాధ్యతలు అప్పగించి భారంగా నెట్టుకొస్తున్నారు. రాష్టల్రో రెైతులు సాగు చేసే వివిధ రకాల పంటలకు సంభందించి అమలవుతున్న ప్రభుత్వ పధకాలను పర్యవేక్షించే అధికారి స్ధానం కూడా ఖాళీగానే పడివుంది. దీన్నికూడ మరొకరికి అదనపు భాధ్యతగా అప్పగించి చేతులు దులిపేసుకున్నారు. సాయిల్‌ కొరలేటర్‌ సెక్షన్‌కు సంభందించిన అధికారి స్ధానం కూడా ఖాళీగానే ఉంది.జేడిఏ పోస్టులు ఖాళీగానే! : విత్తనాలు ఎరువులు పురుగుమందులు మొదలుకుని సంటసాగుకు సంభందిచి అన్ని రకాల అంశాలను పర్యవేక్షిస్తూ జిల్లాస్ధాయిల్లో వ్యవసాయ రంగాన్ని ముందుకు నడిపించాల్సిన జేడిఏలు కుర్చీలు సైతం పలు జిల్లాల్లో ప్రభుత్వ పనితీరును ఎత్తిచూపుతున్నాయి.

ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఇందిరమ్మ బాటలో ఉన్న మెదక్‌ జిల్లాలోనే జిల్లా వ్యవసాయాధికారి స్ధానం ఖాళీగా పడివుంది. మహబూబ్‌నగర్‌, నిజామాబాద్‌ , శ్రీకాకుళం , విజయ నగరం , పశ్చిమగోదావరి జిల్లా ల్లో కూడా జిల్లావ్యవసాయా దికారుల (జేడిఏ) స్ధానాలు ఖాళీగా ఉన్నాయి.

ఇంచార్జి బాధ్యతలతో వీటిని నెట్టుకొస్తున్నారు. వ్యవసాయ ఉప సంచాలకుల ఖాళీల సంఖ్య కూడా తక్కువేమి కాదంటున్నారు. రాష్ట్రంలో మొత్తం 84మంది వ్యవసాయ ఉప సంచాలకులు ఉండాల్సి వుండగా 22 స్ధానాలు ఖాళీగా ఉన్నాయి. ఏఓ పోస్టుల భర్తీ ప్రక్రీయ చేపట్టినప్పటికీ ఆది పూర్తిస్ధాయిలో జరగలేదు. రాష్ట్రంలో 470 ఏఓ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ ఇవ్వగా 145 పోష్టులు భర్తీ కాకుండానే మిగిలిపోయాయి. ఉద్యోగంలో చేరిన కొందరు వ్యవసాయశాఖ స్థితిగతులను గమనించి అటునుంచి అటే పలాయనం చిత్తగించారు .

రాష్ట్ర స్ధాయిలో సుమారు రెండు వందల మేరకు ఏఓ పోస్టులు మళ్ళీ ఖాళీ పడ్డాయి. వ్యవసాయరంగానికి క్షేత్రస్ధాయిలో కీళక పాత్ర పోషించే వ్యవసాయ విస్థరణ అధికారుల ఖాళీల భర్తీ కుంటినడకనే నడుస్తోందంటున్నారు. రాష్టస్ధ్రాయిలో 881 ఖాళీల భర్తీకి నోటిఫేకేషన్‌ ఇవ్వగా ఇప్పటిదాక భర్తీ ప్రక్రీయ పూర్తికానేలేదు. ప్రభుత్వం ఇప్పటికైనా ఖాళీల భర్తీపెై పూర్తిస్ధాయిలో దృష్టిపెట్టాల్సిన అవసరం ఉందంటున్నారు.

పాలిటెక్నిక్‌ లెక్చర్ల పోస్లుల దరఖాస్తుల స్వీకరణ వాయిదా

రాష్ట్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్‌ లెక్చరర్లకు సంబంధించి మంగళవారం నుంచి ప్రారంభం కావాల్సిన దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం ఏపీపీఎస్సీ వాయిదా వేసింది. కాంట్రాక్ట్‌ పాలిటెక్నిక్‌ లెక్చరర్ల సంబంధించి కేబినెట్‌ సబ్‌ కమిటీ తుది నిర్ణయం వెలువడేంత వరకు దరఖాస్తుల స్వీకరణ వాయిదా వేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి సాంకేతిక విద్యా శాఖ, ఏపీపీఎస్సీ ఆదేశాలు వెల్లడంలో ఈ నిర్ణయం ప్రకటించారు. అయితే భర్తీ కావాల్సిన మొత్తం పోస్టులు 869 ఉన్నాయని ఏపీపీఎస్సీ అధికారులు పేర్కొన్నారు.

డిగ్రీ లెక్చరర్ల ఇంటర్వ్యూలకు కోర్టు అనుమతి

డిగ్రీ లెక్చరర్ల ఇంటర్వ్యూలకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. కీ విడుదల తరువాతనే నియామకాలు చేపట్టాలని కోర్టు ఏపీపీఎస్సీని ఆదేశించింది

No comments:

Post a Comment