![]() |
| పద్మ మహల్ - హంపి |
పద్మమహల్ గా పేరుగాంచిన కమలామహల్ లేదా చిత్రాంగిని మహల్ హంపి పట్టణం లో గల జేనానా ఎన్.క్లోసర్ లో నెలకొని ఉంది. కమల భవనం పట్టపు రాణుల కొరకు నిర్మించబడింది , ఇది మూడడుగుల ఎత్తైన పీఠం పై రెండంతస్తులలో ఉండి నీటి గొట్టాల ద్వారా నీరు ప్రవహించే ఏర్పాటు ఉండేది. విజయనగర రాజుల కాలములోని ఈ నిర్మాణాలు ముస్లిముల కట్టడ శైలి ని ప్రదర్శిస్తున్నవి. దీనిని హిందూ, ముస్లిమ్ నిర్మాణ శైలిలో నిర్మించారు. తొమ్మిది పిరమిడ్ ఆకారంలో వున్న "డోం" లను కలిగి వుంది. పెద్ద పెద్ద ప్రాకారపు గుమ్మాలు,శంఖు ఆకారం లో ఉన్న పైకప్పు విజయనగర రాజుల కట్టడాల శైలి నుండి విభేదించి ముస్లిముల కట్టడ శైలిని వ్యక్త పరుస్తున్నది. ఆర్చీల మద్య సింహం తలలు కలిగిన దీనిలో గదులేమి లేవు. ఇదొక అలంకార భవనం, చూడ ముచ్చటగా ఉన్నది. ఈ భవన నిర్మాణములో వేదికలు నిర్మించడానికి కొయ్య కూడా వినియోగించబడింది. దీన్నీ పదనారవ శతాబ్దంలో నిర్మించారు. దీని పక్కన పూదోట వున్నది. ఈ అందమైన భవనం బహమనీ సుల్తానుల వలన ద్వంసం కాకుండా మిగిలి ఉన్నా కాల గమనంలో కొంత శిదిలమై బాగానె వున్నది.

No comments:
Post a Comment