Saturday, November 17, 2012

కొత్త గ్రూప్-2 ఫలితాలు డిసెంబర్‌లో

2008 గ్రూప్-2 పోస్టుల ఫలితాలకు వైట్నర్ కేసు అడ్డంకి తొలగిపోవటంతో చకాకా సదరు ఉద్యోగాలకు అభ్యర్ధుల ఎంపిక కమిషన్ పూర్తి చేస్తోంది. నాటి గ్రూప్-2 ఎగ్జిక్యూటివ్ పోస్టుల జాబితా వెల్లడించి, అర్హత గల జాబితాలను సదరు డిపార్ట్‌మెంట్లకు పంపిస్తోంది. ఇక ఇదే రిక్రూట్‌మెంటులో భర్తీ చేయనున్న నాన్ ఎగ్జిక్యూటివ్ ఫలితాలు నేడో రేపో ప్రకటించేలా కమిషన్ అధికారులు చర్యలు చేపట్టారు. సంబంధిత నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు ఎంపికైన అభ్యర్ధుల జాబితా ఆయా డిపార్ట్‌మెంట్లకు ఈ నెలాఖరులోగా కమిషన్ పంపించనుందని సమాచారం. మొత్తం మీద కొత్త తాజా గ్రూప్-2 ఫలితాలకు అడ్డంకిగా ఉన్న 2008 గ్రూప్-2 రిక్రూట్‌మెంటు ప్రక్రియ మొత్తం ఈ నెలలో పూర్తయినట్టేనని పోటీపరీక్షార్థులు భావించవచ్చు.

ఇదిలా ఉండగా 2011 గ్రూప్-2 పోస్టుల రాతపరీక్షలు జులై 20, 21 వ తేదీలలో జరిగిన సంగతి తెలిసిందే. గ్రూప్-2 ప్రశ్నాపత్రాల వేల్యూయేషన్ గత నెలలో కమిషన్ పూర్తి చేసింది.

అయితే త్వరలో సంబంధిత గ్రూప్-2 పరీక్ష ‘కీ’ ఎపిపిఎస్‌సి వెబ్‌సైటులో పెట్టి అభ్యర్ధుల నుంచి అబ్జెక్షన్స్ కోరనున్నారు. అపై ఫైనల్ ‘కీ’ ప్రకటిస్తూ గ్రూప్-2 పోస్టుల పరీక్ష ఫలితాలు వెల్లడించనున్నట్లు అధికారులు తెలిపారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో 2011 గ్రూప్-2 పోస్టుల ఫలితాలు డిసెంబర్‌లో అభ్యర్ధులు ఆశించవచ్చు. 873 ఖాళీలు గల ఈ గ్రూప్-2 రిక్రూట్‌మెంటులో ఇంటర్వ్యూలు లేనందున కేవలం రాతపరీక్ష అర్హతతోనే అభ్యర్ధులను ఎంపిక చేయనున్న సంగతి తెలిసిందే. దీనితో అటు ఎగ్జిక్యూటివ్ పోస్టులతోపాటు ఇటు నాన్ ఎగ్జిక్యూటివ్ ఫలితాలు డిసెంబర్ మాసంలోనే కమిషన్ ప్రకటించే అవకాశం ఉంది. పూర్వ గ్రూప్-2 పోస్టుల ఎంపిక పూర్తయిన మరుసటి నెలలోనే కొత్త గ్రూప్-2 ఫలితాలు రానుండటం అభ్యర్ధులకు సంతోషదాయకమే.

1 comment:

  1. helo sir.iam bc-b male from V-zone. Group2 2012 lo score 290-296. Non executive vache chances unaya..

    ReplyDelete