![]() |
ఉద్ధంసింగ్ |
1919లో ఏప్రిల్ 13-భారతదేశ స్వాతంత్రోద్యమ చరిత్రలో రక్తసిక్తమైన రోజు. అమృత్‌సర్ లోని జలియన్‌వాలాబాగ్ మారణ హోమం జరిగిన రోజు. క్రూరుడు డయ్యర్ కిరాతకానికి వందలాదిమంది స్త్రీలు, పురుషులు, వృద్ధులు, పిల్లలు ప్రాణాలు విడిచిన రోజు. బ్రిటీష్ పాలకు లు ప్రవేశపెట్టిన రౌలట్ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ప్రజాఉద్యమ నాయకులు డా సైపుద్దీన్ కిచ్లూ, డా సత్యపాల్ అక్రమ అరెస్టులను నిరసిస్తూ, జలియన్ వాలాబాగ్ సభ జరిగింది. సభకు వేలాదిగా తరలి వచ్చారు. ప్రశాంతంగా సభ జరుగుతున్నది. అది వేసవి కాలం. సభకు వచ్చిన వారికి మంచినీళ్ళు అందజేయాలని అనాధాశ్రమం విద్యార్థులు అక్కడికి చేరారు. దానికి ఉద్ధంసింగ్ నాయకుడు. అకస్మాత్తుగా జనరల్ డయ్యర్ నాయకత్వంలో మిలటరీ జలియన్‌వాలాబాగ్‌ను చుట్టుముట్టింది. తూటాల వర్షం కురిసింది. వందలాదిమంది నేలకు వొరిగారు. వందలాదిమంది క్షతగాత్రులయ్యారు. జలియన్‌వాలాబాగ్ రక్తసిక్తమయింది. ఉద్ధం సింగ్ గాయాలతో, ప్రాణాలతో బయటపడ్డాడు. కానీ, ఆ భయంకర దృశ్యం అతని కళ్ళముందు కదులుతూనే వుంది. ప్రజల హహకారాలు అతని చెవుల్లో గింగురుమంటున్నాయి. పక్కనే వున్న సిక్కుల దేవాలయం గురుద్వారా గోల్డెన్ టెంపుల్‌కు చేరాడు. పవిత్ర సరోవర్ పక్కన రక్తపు మరకలు కడిగేసి, స్నానం చేశాడు. మారణహోమానికి కారకులైన జనరల్ డయ్యర్, పంజాబు గవర్నర్ మిఖైల్ ఓ డయ్యర్ ప్రాణం తీసి, ప్రతీకారం తీర్చుకుంటానని ప్రతిజ్ఞ చేశాడు..
![]() |
జనరల్ డయ్యర్ |
ఉద్ధంసింగ్ జైల్లో వున్నప్పుడే భగత్‌సింగ్ ఉరి కంబమెక్కాడు. అది ఉద్ధంసింగ్‌కు మరింత ఆవేదన, ఆవేశానికి గురిచేసింది. 1931 అక్టోబరు 23న జైలునుండి విడుదలయ్యాడు. కొంతకాలం స్వగ్రామం సుమాన్‌లో ప్రశాంతంగా వుండాలను కున్నాడు. కానీ పోలీసుల వేధింపులు అధిక మయ్యాయి. 1933లో రహస్యంగా దేశం నుండి బయటపడ్డాడు. శేర్‌సింగ్, ఉద్ధంసింగ్, ఉధాంసింగ్, ఉడేసింగ్, ఉదరుసింగ్, వేరువేరు పేర్లతో జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, స్విటర్లాండ్ మొదలైన దేశాలు తిరిగాడు.1934 నాటికి లండన్ చేరాడు. లండన్‌లోని ఇండియా హౌస్‌రూల్ సొసైటీతో సంబంధాలు ఏర్పరచుకున్నాడు. జలియన్‌వాలాబాగ్ మారణహోమం, జనరల్ డయ్యర్-మిఖైల్ ఓ డయ్యర్, అతని మనసులో మెదలుతూనే వున్నారు. చేసిన ప్రతిజ్ఞ, ఆ దుర్మార్గులను వేటాడే పనిచేస్తూనే, ఇంజనీరింగ్ విద్య పూర్తిచేశాడు.

పోలీసులు బంధించి-లాకప్‌లో చిత్ర హింసలు పెట్టారు. బాధను భరిస్తూ-ప్రతిజ్ఞ నెరవేర్చినందుకు గర్వపడుతూ పోలీసులను అడిగాడు. ఇంతకు లార్డ్ జెట్‌లాంగ్ కూడా చచ్చాడా? లేదా? అతను చచ్చేఉంటాడు. ఎందుకంటే అతని పొట్టలో తూటాలు దూర్చాను '' అన్నాడు. ఏప్రిల్1, 1940న-ఉద్దంసింగ్‌ను లండన్‌లోని సెంట్రల్ క్రిమినల్ కోర్టుముందు నిలిపారు.
జడ్జి అట్కిన్‌సన్
''నీ పేరేమిటి? ''ఉద్దంసింగేనా?'' అడిగాడు
కాదు... నాపేరు రాం-, మహమ్మద్-సింగ్- ఆజాద్'' అన్నాడు. తాను చేసింది న్యాయసమ్మత మైనది. ఉద్దేశపూర్వకంగానే చేశానన్నాడు.
![]() |
మైఖైల్ ఓ డయ్యర్ |
జూన్ 4, 1940 నాడు జడ్జి అట్కిన్‌సన్ ఉరిశిక్ష విధించాడు. జూలై 31, 1940 నాడు లండన్‌లోని పెంటాన్‌విల్లే జైల్లో ఉరికంభంపై ఉద్దంసింగ్ వొరిగిపోయాడు.
అతని శవాన్ని జైలు ఆవరణలోనే పూడ్చి పెట్టారు. ఉద్దంసింగ్ మరణవార్త-అతని దేశభక్తి, ధైర్యసాహసాలు కొనియాడుతూ ''లండన్ టైమ్స్'' రోమ్‌లోని''బెర్గెరెట్'' జర్మనీలోని ''బెర్లినర్ బోర్సెక్ సైటింగ్'' పత్రికలు ప్రశంసించాయి. కానీ, భారత జాతీయోద్యమ నేతలు మహాత్మాగాంధీ, జవహర్ లాల్ నెహ్రూ మొదలైనవారు ఉద్దంసింగ్ చర్యను ఖండించారు. మిఖైల్ డయ్యర్ హత్య సమర్ధనీయం కాదన్నారు. కానీ, భారత ప్రజలు ఉద్దంసింగ్ దేశభక్తిని, త్యాగనిరతిని కొనియాడారు.
భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత 1952లో భారత ప్రధాని జవహర్‌లాల్‌నెహ్రూ గతంలో తాను చేసిన వ్యాఖ్యలను సరిదిద్దుకుని-
''షహీద్-ఎ-ఆజం ఉద్దంసింగ్‌కు నా సాల్యూట్'' అన్నారు. 1974లో పంజాబు సుల్తాన్‌పూర్ శాసనసభ్యుడు సాధూసింగ్ తీర్దు ఉద్దంసింగ్ వీరగాథను ప్రభుత్వ దృష్టికి తెచ్చాడు. ఇందిరాగాంధీ దానికి స్పందించారు. ఇంగ్లండు ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి-ఉద్దంసింగ్ అస్థికలను భారతదేశానికి తీసుకొచ్చారు. ఉద్దంసింగ్ మరణించిన 34 సంవత్సరాల తర్వాత అస్థికలను, అతను స్వగ్రామం సునామ్‌పూర్‌లో అంత్యక్రియలు నిర్వహించారు. కొన్ని ఆస్థికలు గంగానదిలో కలిపారు. ఉద్దంసింగ్ వీరగాథ-అజరామరమైనది.
వీరుడు-అమరుడు-అజేయుడు-ఉద్దంసింగ్- వీరగాథలు నేటికీ పంజాబు ప్రజల హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోయాయి.
No comments:
Post a Comment