వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు రాష్ట్ర ప్రభుత్వం ముస్తాబవుతోంది. తమ సంక్షేమ పథకాలతో అన్ని రకాల ప్రజలను, అన్ని సామాజిక వర్గాల ప్రజలతో పాటు, విద్యార్థు లను, నిరుద్యోగులను కూడా హక్కున చేర్చుకోవాలని కిరణ్ కుమార్‌రెడ్డి ప్రభుత్వం తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. అయితే దీని వల్ల వచ్చే ఎన్నికలలో ఓట్లు సంగతి ఎలా ఉన్నప్పటికీ విద్యార్థులు, నిరుద్యోగులకు మాత్రం మేలు జరుగుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పటికే ఫీజు రియంబర్స్‌మెంట్ పథకంలో ఎస్‌సి, ఎస్‌టీ, బిసీ సామాజిక వర్గాలకు చేరవుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఈ విద్యా సంవత్సరంలో తక్షణమే 50 వేల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ చేయడానికి కంకణం కట్టుకున్నది. ఏప్రిల్ నెలాఖరు లోగా 50 వేల ఉద్యోగాల భర్తీ కోసం అన్ని రకాల నోటిఫికేషన్లు విడుదల చేయాలన్న కృతనిశ్చయంతో సర్కారు ఉన్నది.
ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం మొత్తం 21 నోటిఫికేషన్లు ద్వారా 50 వేల సర్కారి ఉద్యోగాలను భర్తీ చేయాలన్నదే ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తపన. ఆ మేరకు అన్ని రకాల నియామక సంస్థలతో పాటు.. పలు ప్రభుత్వ శాఖ ఉన్నతాధికారులు, ఆర్థిక శాఖ ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఉద్యోగాల భర్తీ విషయంలో ఈ సారి వివాదాలు తలెత్తకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని, వయోపరిమితి పెంచడం, రిజర్వేషన్ల విధానాన్ని కచ్చితంగా పాటించడం. ప్రాంతాలు, లోకల్, నాన్ లోకల్ విధానంపై వివాదాలు లేకుండా చూడడంపై సీఎం ప్రత్యేక దృష్టి పెట్టారు. పలు రకాల వివాదాల వల్ల నోటిఫికేషన్లతో పాటు, నియామక ప్రక్రియలు కూడా నిర్ధాక్షణ్యంగా నిలిచి పోతున్నాయి. కాబట్టి ఎలాంటి వివాదాలకు ఆష్కారం లేకుండా.. నిరుద్యోగుల ప్రయోజనాలే ధ్యేయంగా నియామకాలు చేపట్టాలని ఏపీపీఎస్‌సీ, డిఎస్సీలతో పాటు.. పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్, జైళ్ల శాఖ వంటి సంస్థలకు సీఎం ఆదేశాలు జారీ చేశారు.
32 వేల టీచర్ల భర్తీకి నెలాఖరులో నోటిఫికేషన్..
పాఠశాల విద్యా శాఖలో ఉన్న 32 వేల టీచర్ పోస్టుల భర్తీకి ఈ నెలాఖరులోగా డిఎస్సీ-2013 నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. ఈ విషయంపై మాధ్యమిక విద్యా శాఖ మంత్రి స్పష్టతతో ఉన్నారు. అందుకు సీఎం అనుమతి ఉండనే ఉన్నది. ఇప్పటికే డిఎస్సీ-2012 ద్వారా 21 వేల టీచర్ల భర్తీ ప్రక్రియ దాదాపు పూర్తి కావచ్చింది. ఇందులో మిగులు పోస్టులు, ఖాళీలు, ఆర్‌విఎం ద్వారా వచ్చిన పోస్టులు కలుపుకుని దాదాపు 32 వేల పైగా సెకండరీ గ్రేడ్ టీచర్లు, స్కూల్ అసిస్టెంట్ పోస్టులు భర్తీ చేస్తారు. వీటితో పాటు భాషా పండితులు, పిఇటి పోస్టులు కూడా భర్తీ చేస్తారు. ఈ పరీక్షలకు దాదాపు మూడు లక్షల మంది నిరుద్యోగ అభ్యర్థులు దరఖాస్తులు చేసుకునే అవకాశం ఉంటుంది.
కానిస్టేబుల్ నోటిఫికేషన్ జారీ..
పోలీస్ శాఖలో కానిస్టేబుళ్లు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 6,071 కానిస్టేబుళ్ల పోస్టులు భర్తీ కానున్నాయి. ఈ పోస్టులను పరుగు పందెం, శారీరక పరీక్ష, రాత పరీక్షల ద్వారా భర్తీ చేస్తారు. ఇందుకోసం దాదాపు లక్షల మంది నిరుద్యోగులు పోటీ పడే అవకాశాలు ఉన్నాయి.
గ్రూప్ -1, గ్రూప్ -2 పై అభ్యర్థుల దృష్టి..
రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా పోస్టులుగా భావించే గ్రూప్-1 పోస్టులకు భర్తీపై సర్కారు ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో దాదాపు 350 వరకు పోస్టులు ఉన్నాయి. వీటిలో డిప్యూటీ కలెక్టర్లు, డిఎస్పీలు, సిటీఓలు, ఎకై్సజ్ సూపరింటెండెంట్లు, మున్సిపల్ కమీషనర్ గ్రేడ్-1 వంటి పోస్టులను భర్తీ చేయనున్నారు. అయితే రాష్ట్ర స్థాయి పోస్టులకు కచ్చితంగా ఇంటర్వ్యూలు నిర్వహించ నున్నారు. ఇదే క్రమంలో గ్రూప్-2 పోస్టుల పోస్టుల భర్తీ కోసం కూడా కొత్తగా నోటిఫికేషన్లు విడుదల చేసే ప్రక్రియ ప్రారంభం అయింది. గ్రూప్-2 ఉద్యోగ ప్రక్రియను పాత విధానంలోనే కొనసాగిస్తారని తెలిసింది. తాజాగా విడుదల చేసిన జీవో 623, 624 జీవోల ప్రకారం భర్తీ చేసే విషయాన్ని సర్కారు తాత్కాలికంగా నిలిపి వేసింది. దీంతో ఎగ్జిక్యూటీవ్ పోస్టులకు ఇంటర్వ్యూలు నిర్వహించే ఆలోచనలోనే ఏపీపీఎస్‌సీ ఛైర్మన్ ఉన్నారు. అలాగే గ్రూప్-4 పోస్టుల భర్తీ కోసం కూడా త్వరలో భారీ సంఖ్యతో నోటిఫికేషన్ విడుదల కాబోతున్నది. ఈ నోటిఫికేషన్ ద్వారా దాదాపు 1,500 వరకు పోస్టులు భర్తీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇదిలా ఉంటే.. ప్రభుత్వ జూనియర్ కాలేజీలలో ఖాళీలుగా ఉన్న 5,705 లెక్చరర్ల పోస్టులకు కూడా త్వరలో ఆర్థిక శాఖ ఆమోదం తెలియజేయనున్నది. ఇవి జోనల్ పోస్టులుగా ఉన్నాయి. కాబట్టి అలాంటి వివాదాలు లేకుండా సర్కారు జాగ్రత్త చర్యలు తీసుకుంటోంది. అలాగే ఈ ఖాళీలల్లో కాంట్రాక్ట్ లెక్చరర్లు కొనసాగుతున్నారు. కాంట్రాక్ట్ లెక్చరర్లకు బదులుగా రెగ్యులర్ లెక్చరర్లను నియమించాలని సర్కారు భావించింది. అలాగే ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలలో ఖాళీలుగా ఉన్న దాదాపు 911 లెక్చరర్ల భర్తీ కోసం చర్యలు తీసుకున్నారు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ వివాదాలను అధిగ మించి పోస్టులను భర్తీ చేయాలన్నది సర్కారు సంకల్పం. కాబట్టి ఈ పోస్టుల భర్తీ కోసం ఈ నెల 6వ తేదీన రాత పరీక్ష నిర్వహించన్నారు. ఇవి కాకుండా.. వీలయినంత త్వరలో మరో 200 పాలిటెక్నిక్ లెక్చరర్ల పోస్టుల భర్తీ కోసం కూడా నోటిఫికేషన్ విడుదల కాబోతున్నది.

This comment has been removed by the author.
ReplyDelete