Saturday, January 19, 2013

ఏపీపీఎస్సీలో నలుగురికి షోకాజ్ సీఎం నిర్ణయం.. గవర్నర్ గ్రీన్‌సిగ్నల్

ప్రభుత్వ ఉత్తర్వుల అమలును అడ్డుకోవడంతో పాటు సీనియర్ ఐఏఎస్ అధికారుల పాత్రను తప్పుపట్టారన్న కారణంతో ఏపీపీఎస్సీలోని నలుగురు సభ్యులకు షోకాజ్ నోటీసులు జారీ చేసేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. ఈ సభ్యుల వ్యవహార శైలిపై అసంతృప్తితో ఉన్న సీఎం కిరణ్ వారిపై చర్యలు తీసుకునేందుకు వీలుగా తొలుత షోకాజ్ నోటీసుల జారీకి నిర్ణయం తీసుకున్నా రు.

దీనికి గవర్నర్ నరసింహన్ కూడా గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది. సర్కారు అభిమతాన్ని ధిక్కరించేలా వ్యవహరించారని భావిస్తున్న సభ్యుల్లో పద్దయ్య, రిపుంజయరెడ్డి, నౌమాన్, పోచయ్య, రవీందర్‌రావు, గుబ్బా చంద్రశేఖర్ ఉన్నారు. ఏపీపీఎస్సీ చైర్మన్, సెక్రెటరీల పాత్రను ప్రశ్నించడం, వారిపై కోర్టులకు జీ.వో.నెం.420 జారీ విషయంలో ఐఏఎస్ అధికారి జె.సత్యనారాయణ పాత్రను తప్పుపడుతూ వీరు గవర్నర్‌కు లేఖ రాయడం వంటి అంశాలను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది.

No comments:

Post a Comment