కొలువుల మేళాఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి సుమారు 3500 పోస్టుల భర్తీకి సంబంధించిన ప్రకటనలు త్వరలో రాబోతున్నాయి. వివిధ శాఖల నుంచి ఉద్యోగ ఖాళీల వివరాలు అందినప్పటికీ.. సామాజిక రిజర్వేషన్లు, ప్రాంతీయ వివరాలపై స్పష్టత కోసం ఎపీపీఎస్సీ అధికారులు సచివాలయంతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఇందుకు అనుగుణంగా అందే సమాచారాన్ని అనుసరించి ప్రకటనల జారీ జరుగుతుంది. మొత్తంమీద 16 రకాల ప్రకటనలు జనవరిలో కొన్ని, ఫిబ్రవరిలో మరికొన్ని రాబోతున్నాయి. గత వారం 610 ఉద్యోగాల భర్తీకి ఎపీపీఎస్సీ ప్రకటనలు జారీచేసింది. త్వరలో విడుదల చేయనున్న ప్రకటనల్లో.. పంచాయతీ కార్యదర్శుల పోస్టులు 2677 వరకు ఉన్నాయి. ఈ పోస్టుల భర్తీకి సంబంధించిన మొత్తం ప్రక్రియను జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో జరపాలని తొలుత నిర్ణయించారు.
స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఎపీపీఎస్సీని పరీక్ష జరపాలంటూ ప్రభుత్వం కోరింది. ఇందుకు అనుగుణంగా అధికారిక ఉత్తర్వుల్లో మార్పు జరగాల్సి ఉంది. ఈ విషయమై అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఈ ఉత్తర్వులు వెలువడితే.. ఈ నెల మూడోవారంలో ప్రకటన వెలువడనుంది. కేన్ రెగ్యులేషన్ ఇన్‌స్పెక్టర్స్ పోస్టులు 37 ఉన్నాయి. వీటిని రాష్ట్ర పోస్టులుగా గుర్తించి 1965లో భర్తీచేశారు. ప్రస్తుతం జోనల్ పోస్టులుగా గుర్తించే విషయమై చర్చలు జరుగుతున్నాయి. అలాగే అసిస్టెంట్ ఇంజినీర్(ఇరిగేషన్) పోస్టులు 465, ఇతర పోస్టులు ఉన్నాయి. అసిస్టెంట్ ఇంజినీర్ పోస్టుల భర్తీలో సర్వీసు నిబంధనల అంశంపై స్పష్టత కోసం ఎపీపీఎస్సీ అధికారులు ఎదురుచూస్తున్నారు. సంబంధిత శాఖల నుంచి లభించే స్పష్టతను అనుసరించి ఈ ప్రకటనల జారీ వేగాన్ని అందుకోనుంది.గ్రూపు-1ఎ, బి, గ్రూపు-2 కింద గుర్తించిన ఉద్యోగ ఖాళీల వివరాలు ఎపీపీఎస్సీకి అందాయి. ఇవికాకుండా మరికొన్ని ఖాళీల వివరాలు అందనున్నాయి. ఎన్నికల దృష్ట్యా ప్రకటనల జారీ సమయానికి ఈ ఉద్యోగాల సంఖ్య బాగా పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు. ఈ పోస్టుల భర్తీ తీరులో గత నెలలో విధానపరమైన మార్పులు జరిగాయి. ప్రభుత్వ నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీనివల్ల గతనెలలో జారీ అయిన ఉత్తర్వులపై పునస్సమీక్ష జరిపి అధికారిక నిర్ణయం తీసుకునేందుకు మరికొంత సమయం పట్టనుంది. ఈలోగా ఉద్యోగ ఖాళీలపై స్పష్టత రానుంది. ఈ ఉద్యోగ ప్రకటనలు వెలువడేందుకుఏప్రిల్ వరకు సమయం తీసుకోనుంది.

No comments:
Post a Comment