రెవెన్యూ శాఖలోని డిప్యూటీ తహశీల్దార్, వీఆర్వో తదితర ఖాళీల భర్తీకి చర్యలు వేగవంతం చేయాలని రెవెన్యూ మంత్రి రఘువీరారెడ్డి ఆదేశించారు. సోమవారంనాడు సచివాయంలో జరిగిన సమీక్షా సమావేశంలో రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి బీఆర్ మీనా, అశుతోష్ మిష్రా, సీసీఎల్‌ఏ పీకే మహంతిలతో ఆయన సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా జనవరిలో జరిగిన జాయింట్ కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని ఆయన గుర్తు చేశారు. రెవెన్యూ శాఖలోని అన్ని ఖాళీలను భర్తీ చేసేందుకు ప్రతిపాదనలు సత్వరం ఆర్థిక శాఖకు పంపాలని ఆయన ఆదేశించారు. గతేడాది 133 డిప్యూటీ తహశీల్దార్ పోస్టులకు అనుమతించి ప్రభుత్వం వివరాలు పంపినప్పటికీ ఏపిపిఎస్సీ ఇంతవరకూ ఎలాంటి నోటీఫికేషన్ ఇవ్వకపోవడంపై మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు.
తక్షణమే ఈ పోస్టులకు నోటిఫికేషన్ వచ్చేలా చూడాలని అధికారులను మంత్రి ఆదేశించారు. అదేవిధంగా వందల సంఖ్యలో జూనియర్ అసిస్టెంట్ పోస్టుల ఖాళీల వివరాలను ఏపిపిఎస్సీకి పంపించామని, కానీ వీటి భర్తీకి పరీక్షలు నిర్వహించినప్పటికీ ఇంకా ఫలితాలు ఇవ్వకపోవడంపై ఆయన తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ అంశంపై ఏపిపిఎస్సీతో మాట్లాడాల్సిందిగా ఆయన అధికారులను ఆదేశించారు. మరోవైపు 1600 వీఆర్వో ఖాళీలు, 120కిపైగా డిప్యూటీ సర్వేయర్ ఖాళీల భర్తీపై త్వరలోనే ఆర్థిక శాఖ మంత్రితో సమావేశమవుతానని ఆయన తెలిపారు. పదోన్నతుల ద్వారా భర్తీ చేయాల్సిన ఖాళీలపై కూడా చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు.
ఎంఎల్‌సీ, సహకార ఎన్నికలు, తాజాగా వర్షాల కారణంగా వాయిదా పడ్డ ప్రాంతీయ రెవెన్యూ సదస్సులను నిర్వహించే అంశంపై ఆయన అధికారులతో చర్చించారు. వీటిని నిర్వహించేందుకు 26న తిరుపతి, 27న విజయవాడ, మార్చి 2న హైదరాబాద్‌లో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.

No comments:
Post a Comment