Tuesday, February 26, 2013
Monday, February 25, 2013
Sunday, February 24, 2013
Thursday, February 21, 2013
జిల్లాలకు గ్రూపు-4 ఫలితాలు
రాష్ట్ర ప్రజాసేవా సంఘం (ఏపీపీఎస్సీ) గ్రూపు-4 పరీక్షల ఫలితాలను ఫిబ్రవరి 20న అన్ని జిల్లాలకు పంపింది. ఫలితాల ఆధారంగా నియామకాలు చేపట్టాలని ఆయా జిల్లాల కలెక్టర్లను కోరింది. జాబితాలు అందిన వెంటనే జిల్లా కలెక్టర్లు నియామకాల ప్రక్రియను చేపడతారని అధికారవర్గాలు తెలిపాయి.
Tuesday, February 19, 2013
గతేడాది 133 డిప్యూటీ తహశీల్దార్ పోస్టులకు ప్రభుత్వం అనుమతించిన ఇంతవరకూ ఎలాంటి నోటీఫికేషన్ ఇవ్వని ఏపిపిఎస్సీ
రెవెన్యూ శాఖలోని డిప్యూటీ తహశీల్దార్, వీఆర్వో తదితర ఖాళీల భర్తీకి చర్యలు వేగవంతం చేయాలని రెవెన్యూ మంత్రి రఘువీరారెడ్డి ఆదేశించారు. సోమవారంనాడు సచివాయంలో జరిగిన సమీక్షా సమావేశంలో రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి బీఆర్ మీనా, అశుతోష్ మిష్రా, సీసీఎల్‌ఏ పీకే మహంతిలతో ఆయన సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా జనవరిలో జరిగిన జాయింట్ కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని ఆయన గుర్తు చేశారు. రెవెన్యూ శాఖలోని అన్ని ఖాళీలను భర్తీ చేసేందుకు ప్రతిపాదనలు సత్వరం ఆర్థిక శాఖకు పంపాలని ఆయన ఆదేశించారు. గతేడాది 133 డిప్యూటీ తహశీల్దార్ పోస్టులకు అనుమతించి ప్రభుత్వం వివరాలు పంపినప్పటికీ ఏపిపిఎస్సీ ఇంతవరకూ ఎలాంటి నోటీఫికేషన్ ఇవ్వకపోవడంపై మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు.
తక్షణమే ఈ పోస్టులకు నోటిఫికేషన్ వచ్చేలా చూడాలని అధికారులను మంత్రి ఆదేశించారు. అదేవిధంగా వందల సంఖ్యలో జూనియర్ అసిస్టెంట్ పోస్టుల ఖాళీల వివరాలను ఏపిపిఎస్సీకి పంపించామని, కానీ వీటి భర్తీకి పరీక్షలు నిర్వహించినప్పటికీ ఇంకా ఫలితాలు ఇవ్వకపోవడంపై ఆయన తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ అంశంపై ఏపిపిఎస్సీతో మాట్లాడాల్సిందిగా ఆయన అధికారులను ఆదేశించారు. మరోవైపు 1600 వీఆర్వో ఖాళీలు, 120కిపైగా డిప్యూటీ సర్వేయర్ ఖాళీల భర్తీపై త్వరలోనే ఆర్థిక శాఖ మంత్రితో సమావేశమవుతానని ఆయన తెలిపారు. పదోన్నతుల ద్వారా భర్తీ చేయాల్సిన ఖాళీలపై కూడా చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు.
ఎంఎల్‌సీ, సహకార ఎన్నికలు, తాజాగా వర్షాల కారణంగా వాయిదా పడ్డ ప్రాంతీయ రెవెన్యూ సదస్సులను నిర్వహించే అంశంపై ఆయన అధికారులతో చర్చించారు. వీటిని నిర్వహించేందుకు 26న తిరుపతి, 27న విజయవాడ, మార్చి 2న హైదరాబాద్‌లో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.

6 నెలల్లోనే కొలువు
ఇకపై ఉద్యోగ ప్రకటన జారీ అయిందంటే.. అభ్యర్థులు ఆరునెలల్లోగా కొత్త కొలువులో చేరిపోవలసిందే.. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సరికొత్త యోచన ఇది. ఈ విషయాన్ని ఏపీపీఎస్సీ అధ్యక్షుడు చిత్తరంజన్ బిశ్వాల్ వెల్లడించారు. ఏపీపీఎస్సీలో సభ్యుల ఎంపిక, ఉద్యోగ నియామకాల్లో రావలసిన మార్పులపై ఈనాడు.నెట్, ఈనాడు ప్రతిభ.నెట్ ద్వారా ఉద్యోగార్థుల నుంచి వచ్చిన అభిప్రాయాల సమాహారానికి సంబంధించి ఆయన 'ఈనాడు'కు సోమవారం ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ప్రకటన జారీ సమయంలోనే ఫలితాల వెల్లడి తేదీని సైతం ప్రకటిస్తామని చెప్పారు. అలాగే ఏటా ఉద్యోగ ప్రకటనల జారీకి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఈ సందర్భంగానే ప్రశ్నపత్రాల్లో, అనువాదంలో, 'కీ'ల్లో తప్పులు జరగకుండా ఉండేందుకు ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు. బిశ్వాల్ ఇంటర్వ్యూలోని ప్రధాన అంశాలివి..
ఉద్యోగ ప్రకటన జారీ చేశాక ఆరునెలల్లో నియామకాలను పూర్తిచేస్తాం. ఇకపై ఉద్యోగ ప్రకటనల్లో రాత పరీక్షల తేదీతోపాటు ఫలితాల తేదీనీ వెల్లడిస్తాం. గ్రూపు-1కు మాత్రం ప్రిలిమ్స్, మెయిన్స్, మౌఖిక పరీక్షల దృష్ట్యా ఆరునెలల కంటే మరికొంత సమయం తప్పదు.ప్రస్తుతం ప్రశ్నపత్రాల్లో అనువాదపరంగా, 'కీ'ల్లో తప్పులు ఉన్నాయని ఫిర్యాదులొస్తున్నాయి. తప్పులు ఇబ్బందికరంగా మారుతున్నాయి. ఇకమీదట అలా జరగకుండా చూస్తాం. దీనిపై విశ్వవిద్యాలయాలతో చర్చలు జరుపుతున్నాం. సబ్జెక్టుల వారీగా ప్రతిభగల ప్రొఫెసర్ల జాబితా సిద్ధం చేస్తున్నాం. యూపీఎస్సీ ఇలాగే చేస్తోంది. పదవీ విరమణ చేసిన 75 సంవత్సరాల నిపుణులు సైతం ప్రతిభగలవారి జాబితాలో ఉన్నారు.
రాతపరీక్షల 'కీ'లు విడుదలయ్యాక తప్పులున్నాయంటూ చాలామంది ఫిర్యాదు చేస్తున్నారు. వారి ఆవేదనను అర్థం చేసుకోగలం. కానీ వారు చెప్పిందే సరైనదని చెప్పలేం. వీటిపై నిశితంగా పరిశీలించాకే నేనీ విషయాన్ని చెబుతున్నాను. ఫ్రొఫెసర్లు కూడా లక్షలమంది జీవితాలను ప్రభావితం చేసే ప్రశ్నపత్రాలను తయారు చేస్తున్నామనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. కొందరైతే ప్రశ్నలను మూస పద్ధతిలో ఎంపిక చేస్తున్నారనే విషయం మా దృష్టికీ వచ్చింది. ఈ విషయంలోనూ జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఒక ప్రశ్నకు ఒక సమాధానం మాత్రమే ఉండాలన్న నియమంతో ప్రశ్నపత్రాల తయారీ జరిగితే.. తప్పులు అనే మాటే ఉండదు. ఎంసెట్, స్లెట్, ఇతర పోటీ పరీక్షల్లో ఈ సమస్య లేదు. ఇక్కడ తీసుకుంటున్న జాగ్రత్తలపైనా అధ్యయనం చేస్తున్నాం.
గ్రూపు-2 రాతపరీక్ష 'కీ'లో తప్పులు ఉన్నట్లు ఫిర్యాదులు అందాయి. వీటిపై పరిశీలిస్తున్నాం. నాకు తెలిసినంత వరకు తప్పులు తక్కువగానే ఉన్నాయి. 'కీ'ని ఈవారంలో ఖరారు చేస్తాం.గ్రూపు-4 తుది 'కీ'లోనూ తప్పులు ఉన్నాయని ఫిర్యాదులు వచ్చాయి. కాని అవి నిర్ధారణ కాలేదు.
గ్రూపు-4 రాతపరీక్ష ద్వారా ఎంపికైన అభ్యర్థుల జాబితాను ఈ వారంలోగా జిల్లాలకు పంపేస్తాం. కలెక్టర్ల నేతృత్వంలో ఈ నియామకాలు జరుగుతాయి.
అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, ఎ.ఎఫ్.ఆర్.ఒ., ఇతర పోస్టులకు ఎంపికైనవారి జాబితాను ఈ నెలాఖరునాటికి వెల్లడించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. అయితే, మరికొంత సమయం పట్టేలా ఉంది. 'కీ 'పరంగా ఎటువంటి సమస్యలు ఉండకూడదన్న ఉద్దేశం వల్లనే ఆలస్యమవుతోంది.
అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పోస్టుకు సంబంధించి 22 సబ్జెక్టులు ఉన్నాయి. పోస్టు స్థాయిని అనుసరించి ఎక్కువమంది నిపుణుల ద్వారా 'కీ'లను ఖరారు చేయాల్సి ఉంది.
ఏపీపీఎస్సీలో అకడమిక్ సెల్ ఏర్పాటు ఆలోచన మంచిదే. దీనిపై ప్రభుత్వ స్థాయిలో నిర్ణయం జరగాలి!
గ్రూపు-1, గ్రూపు-2 పోస్టుల విలీనంపై అభ్యర్థుల నుంచి అభ్యంతరాలు వచ్చాయి. ఈ నిర్ణయం ప్రభుత్వానిదే.. మాది కాదు. మేమైతే ఈ నిర్ణయాన్ని కనీసం ఏడాదిపాటు వాయిదా వేయాలని ప్రభుత్వానికి లేఖరాశాం. అక్కడినుంచి వచ్చే ఆదేశాలు అనుసరించి ముందుకెళ్తాం. అలాగే నాన్ గెజిటెడ్ పోస్టులు, గెజిటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియలో ఉన్న వ్యత్యాసాలపై ప్రభుత్వమే చర్యలు తీసుకోవాలి.
గ్రూపు-1 ప్రిలిమ్స్ ద్వారా 1:50 నిష్పత్తిలో కాకుండా ప్రధాన పరీక్షకు 1.15లోగా అభ్యర్థులను అనుమతించే విషయం ప్రభుత్వ పరిశీలనలోనే ఉంది. దీనిపై అధ్యయనం కోసం ప్రత్యేక కమిటీ కూడా ఏర్పడింది. ఇంకా నిర్ణయం తీసుకున్నట్లు లేదు. గ్రూపు-1 ప్రిలిమ్స్ నుంచి ప్రధాన పరీక్షకు అభ్యర్థులను పరిమితం చేయడం వలన అనేక ప్రయోజనాలుంటాయి.
వయోపరిమితి పెంపు అభ్యర్థనలపైనా ప్రభుత్వమే నిర్ణయాలు తీసుకోవాలి.
ఏప్రిల్‌నుంచి వరసగా ఉద్యోయ ప్రకటనలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ఎన్ని అనేది ఇప్పుడే చెప్పలేం. సచివాలయంలో దీనిపై కసరత్తు జరుగుతోంది.
ఆన్‌లైన్‌లో రాతపరీక్షలను జరపడం మామూలు విషయం కాదు. దీనికి క్వశ్చన్ బ్యాంక్‌ను విస్తృతస్థాయిలో తయారుచేయాల్సి ఉంటుంది. తక్కువ పోటీ కలిగిన ఉద్యోగాలకు సంబంధించిన రాతపరీక్షలను ఆన్‌లైన్‌లో జరపాలన్నా అంతకుముందు తీసుకోవల్సిన జాగ్రత్తలు అనేకం ఉన్నాయి. ముందుముందు అలా జరగవచ్చు.
ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరించే సమయంలో కానీ, ఆ తరువాత కానీ అర్హతలు లేని వారిని తొలగించడం సాధ్యంకాదు. వేలల్లో, లక్షల్లో దరఖాస్తులు వస్తున్నందున వారి అర్హతలు అనుసరించి దరఖాస్తులను తొలిదశలో తిరస్కరించడం కష్టమవుతోంది. అదే రాతపరీక్ష అనంతరం ఎంపికచేసిన అభ్యర్థుల ధ్రువీకరణ పత్రాలను పరిశీలించి అర్హతలు గుర్తిస్తున్నాం. సమాన గుర్తింపు సమస్య ఉంటే విశ్వవిద్యాలయాలను సంప్రదించి తెలుసుకుంటున్నాం. ఈ కారణంగా కొంత జాప్యం జరుగుతోంది. సాధ్యమైనంత వరకు జాప్యాన్ని తగ్గించేందుకు కృషిచేస్తాం.

Monday, February 18, 2013
ఓఎంఆర్ షీట్లతో ‘నలిగి’పోతున్నారు!
గ్రూపు-4 రాత పరీక్ష జవాబుపత్రాల మూల్యాంకనంలో ఏపీపీఎస్సీ ఇబ్బందుల్లో పడింది. రాష్ట్రవ్యాప్తంగా ఎనిమిది లక్షల మంది అభ్యర్థులు రాతపరీక్ష రాసి ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే గ్రూపు-4 తుది ‘కీ’పై అభ్యర్థులు అభ్యంతరాలు వ్యక్తంచేశారు. మరోపక్క అభ్యర్థుల జవాబుపత్రాల్లో పలువురి ఓఎంఆర్ షీట్లు స్కానింగ్ (మూల్యాంకన ప్రక్రియలో భాగం) కోసం అనువుగా లేవని తెలిసింది. దీంతో ఆయా అభ్యర్థుల దగ్గర ఉన్న ఓఎంఆర్ కార్బన్ షీటు పత్రాలను పంపించాలని లిఖితపూర్వకంగా కోరినట్లు తెలిసింది. దాదాపు 15 మంది నుంచి ఓఎంఆర్ షీట్లను కోరినట్టు సమాచారం. వీరిలో కొంతమంది నుంచి మాత్రమే స్పందన వచ్చినట్టు తెలిసింది. ఓఎంఆర్ షీట్లను పరీక్షా కేంద్రాల నుంచి బండిళ్ల రూపంలో పంపించే సమయంలో అవి నలిగినట్లు చెబుతున్నారు. ఫలితాల వెల్లడి కోసం లక్షలాది మంది అభ్యర్థులు ఎదురుచూస్తుండగా తాజా సంఘటన చర్చనీయాంశంగా మారింది. ఓఎంఆర్ షీట్లను పంపించాలని కోరడం వెనుక ఏమైనా మతలబు ఉందా అన్న దానిపై పలువురు అభ్యర్థులు అనుమానాలు వ్యక్తం చేస్తుండగా… అందుకు అవకాశమే లేదని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.
Friday, February 8, 2013
ఏపీపీఎస్సీ నియామకాలు చెల్లవా!
'అదనపు అర్హతల' కారణంగా ఇంటర్ బోర్డులో ఆగిన భర్తీ ప్రక్రియ
అంతా పద్ధతిగానే చేశామంటున్న ఏపీపీఎస్సీ
త్రిశంకు స్వర్గంలో 'ఎంపికైన' అభ్యర్థులు.
పెళ్లికొడుకు బాగున్నాడు కాని.. ఆరో వేలే నచ్చలేదు' అన్నట్లుంది ఇంటర్‌బోర్డు వ్యవహారం. ఈ శాఖకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగాల నియామక సంస్థ (ఏపీపీఎస్సీ) చేపట్టిన ఉద్యోగ నియామకాలు చెల్లుతాయా? చెల్లవా? అనే దానిపై మాధ్యమిక విద్యా శాఖ తేల్చుకోలేకపోతోంది. ఉద్యోగ ప్రకటనలో పేర్కొన్న అర్హతలు కంటే.. ఎక్కువగా ఉన్న వారిని ఏపీపీఎస్సీ ఎంపిక చేసినందున వారిని ఉద్యోగాల్లోనికి తీసుకోవాలో లేదో తెలియక అధికారులు హైరానా పడుతున్నారు. ఏపీపీఎస్సీ మాత్రం.. తాము అన్నీ నిబంధనల ప్రకారమే కానిచ్చామంటూ చేతులు దులుపేసుకుంటోంది. ఈ గందరగోళం మధ్య ఉద్యోగార్థులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ప్రకటన జారీకి ముందే తీసుకోవల్సిన జాగ్రత్తల్లో ఈ రెండు శాఖల మధ్య సమన్వయం లోపించినందున నియామకాల ప్రకటన చెల్లుబాటుపైనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మాధ్యమిక విద్యా శాఖ పరిధిలోని ఇంటర్ బోర్డులో 84 జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి ఏపీపీఎస్సీ 2011 డిసెంబరులో ప్రకటన జారీచేసింది. డిగ్రీలో కంప్యూటర్స్ సబ్జెక్టు ఆప్షనల్‌గా ఉండాలని పేర్కొంది. లేదంటే.. డిగ్రీ అర్హతతో అదనంగా సాంకేతిక విద్య శిక్షణ సంస్థ ద్వారా ఆఫీస్ ఆటోమేషిన్‌లో, పీసీ మెయింటెనెన్స్ అండ్ ట్రబుల్ షూటింగ్‌లో, వెబ్‌డిజైనింగ్‌లో కానీ ఏదో ఒక సర్టిఫికేట్ కోర్సును పూర్తిచేయాలని పేర్కొంది. ఆ ప్రకారం కిందటేడు జులై 8న రాత పరీక్ష జరిపి సెప్టెంబరు 27న ఫలితాలను వెల్లడించింది. గత డిసెంబరు 8న ఎంపికచేసిన అభ్యర్థుల ప్రాథమిక జాబితాను ఇంటర్ బోర్డుకు పంపించింది.
ఇక్కడే సమస్య మొదలైంది.అర్హతలు ఎక్కువగా ఉన్నాయని..!మొత్తం 84 మందిలో 54 మందికి ఇంటర్ బోర్డు పేర్కొన్న అర్హతలు ఖచ్చితంగా ఉన్నాయి. మిగతావారికి మాత్రం అర్హతలు కాస్తంత ఎక్కువ (ఎంసీఏ, ఇతర)గా ఉన్నాయి. అందుకే వీరికి ఉద్యోగాలు ఇవ్వాలా.. వద్దా అన్న దానిపై ఇంటర్ బోర్డుకు ధర్మసందేహం వచ్చింది. దీనిని ఏపీపీఎస్సీ వర్గాలు కొట్టిపారేశాయి. సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వులను అనుసరించి ఎక్కువ అర్హతలు ఉన్నా ప్రతిభ ఆధారంగానే ఎంపిక చేశామని తెలిపింది. అయితే.. దీనిని ఇంటర్ బోర్డు పట్టించుకోవడంలేదు. ప్రభుత్వ నిర్ణయం ఏదైనా.. ఇంటర్ బోర్డు జనరల్ కౌన్సెల్‌లో ఆమోదించాలని, ఇతర శాఖల మాదిరిగా ఇక్కడ బోర్డు లేదని వాదిస్తోంది. న్యాయనిపుణులను సంప్రదిస్తే.. ప్రకటనలో ఉన్న ప్రకారమే సాగించాలన్నారని చెబుతోంది. చివరికి ఈ అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని అక్కడి నుంచి ఎలాంటి నిర్ణయం వెలువడితే అలా చేస్తామని పేర్కొంటోంది.అభ్యర్థుల ఆవేదనకొద్దిమంది నియామకాలపై వివరణ కోసం మిగతా అన్ని నియామకాలు ఎందుకు ఆపుతారని అభ్యర్థులు వాపోతున్నారు. సాధారణ పరిపాలన శాఖ జి.ఒ.ను ఇంటర్ బోర్డులో ఆమోదించకపోవడం ఎవరి తప్పని వారు ప్రశ్నిస్తున్నారు. మరోపక్క.. ఇంటర్ బోర్డులో పబ్లిక్ పరీక్షల హడావుడి మొదలైంది. ఇప్పటికే సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. ఈ పరిస్థితుల్లో కొత్తవారు వస్తే.. అదనపు భారం తగ్గుతుందని భావిస్తున్న సహచర ఉద్యోగులకు తాజా పరిణామాలు ఇబ్బందిని కలిగిస్తున్నాయి.

Thursday, February 7, 2013
Group 2 Final Key
Subscribe to:
Posts (Atom)