Sunday, June 30, 2013

వయోపరిమితి పెరిగిందోచ్‌

నిరుద్యోగులకు స్వల్ప వూరట. ఉద్యోగ వయో పరిమితిని 34 నుంచి 36 సంవత్సరాలకు పెంచుతూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పీకే మహంతి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. వచ్చే నెలలో ఏపీపీఎస్సీ, ఇతర నియామక సంస్థలు ఆర్థిక శాఖ ఆమోదం తెలిపిన పోస్టులను ప్రత్యక్ష పద్ధతిలో భర్తీ చేసే పనుల్లో నిమగ్నమయ్యాయి. అందిన ఖాళీలను అనుసరించి ఆయా శాఖల నుంచి సామాజిక వర్గాల వారీగా వివరాలు వస్తే ఏపీపీఎస్సీ వచ్చే నెలలో ప్రకటనలు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. ఈ తరుణంలో ప్రభుత్వం వయో పరిమితిని రెండేళ్లకు పెంచడం ద్వారా కొందరు ప్రయోజనం పొందనున్నారు. వేల పోస్టుల భర్తీలో భాగంగా సంవత్సర కాలపట్టికను అమలు చేయాలని ఏపీపీఎస్సీ నిర్ణయించిన నేపథ్యంలో వయో పరిమితిని 34 నుంచి కనీసం 3-5 ఏళ్లు పెంచాలని నిరుద్యోగులు కోరుతున్నారు. గ్రామీణ నీటి సరఫరా శాఖలో 2008-09లో అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టులను భర్తీ చేశారు. 2004లో స్త్రీ, శిశు సంక్షేమ శాఖకు చెందిన ఛైల్డ్‌ ప్రాజెక్ట్‌ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్‌ (జనరల్‌ కేటగిరి) పోస్టులను భర్తీ చేశారు. తిరిగి ఈ ఏడాది మాత్రమే ఈ రెండు రకాల పోస్టుల భర్తీకి ప్రకటనలు వెలువడ్డాయి. 2011 తరువాత మళ్లీ వచ్చే నెలలో ఉద్యోగ ప్రకటనలు రాబోతున్నాయి. వయో పరిమితి పెంపు నిర్ణయం ఖాకీ దుస్తుల పోస్టుల భర్తీ (పోలీసు, ఎక్సైజ్‌, ఫైర్‌, ప్రిజన్స్‌, ఫారెస్ట్‌, తదితర)కి వర్తించదని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

No comments:

Post a Comment