హైదరాబాద్:మరో వంద మందికిపైగా అభ్యర్థులను గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష రాసేందుకు అనుమతించాలంటూ ఏపీపీఎస్సీని రాష్ట్ర పరిపాలనా ట్రిబ్యునల్ శుక్రవారం ఆదేశించింది. వీరంతా గ్రూప్-1 కటాఫ్ మార్కులు పెంచడంతో మెయిన్స్ పరీక్ష రాసేందుకు అర్హత కోల్పోయారు. దీంతో తమను పరీక్షకు అనుమతించాలంటూ వారు దాఖలు చేసిన పిటిషన్లను ట్రిబ్యునల్ సభ్యులు మదన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం విచారించారు. అనంతరం.. వారిని పరీక్షకు అనుమతించాలంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు.
No comments:
Post a Comment