హైదరాబాద్: కొంతమంది ఆచార్యుల్లో ఎంత'కీ' మార్పు రావడం లేదు. ఏపీపీఎస్సీ అధికారులకు చుక్కలు చూపిస్తున్నారు. తాజాగా ఫారెస్టు రేంజి అధికారి (ఏఎఫ్‌ఆర్‌ఓ) ఉద్యోగాల ప్రశ్నపత్రాల తుది 'కీ' ఖరారులో ఆచార్యులు మరోమారు తమ బాధ్యతారాహిత్యాన్ని ప్రదర్శించారు. దీంతో మళ్లీ సవరణలతో మరోమారు తుది' కీ ప్రకటించాల్సిన పరిస్థితి వచ్చింది. తుది 'కీ' ప్రకటించిన తరువాత ఒకటి, రెండు కాదు ఏకంగా ఐదు సబ్జెక్టుల్లోని 20 ప్రశ్నల జవాబుల్లో మార్పులు జరగడం గమనార్హం. ఉద్యోగ నియామకాల్లో ఒక మార్కు కూడా కీలకమే. ఇప్పుడు ఆచార్యుల తీరు అభ్యర్థులను ఆందోళనకు గురి చేస్తోంది. వీరి భవిష్యత్తే అగమ్యగోచరంగా మారే పరిస్థితి ఏర్పడింది. వీరి వల్ల ఏపీపీఎస్సీ అధికారులూ తలలు పట్టుకుంటున్నారు. ఏఎఫ్‌ఆర్‌ఓ ఉద్యోగాల భర్తీ ఇప్పటికే చాలా ఆలస్యమైంది. వీటి భర్తీకి నిర్వహించిన రాత పరీక్షల్లో వివిధ సబ్జెక్టుల వారీగా అతికష్టంమీద ప్రాథమిక 'కీ' జారీ చేస్తే, అభ్యర్థుల నుంచి అభ్యంతరాలు వెల్లువెత్తాయి. వీటిని పరిశీలించడం ఏపీపీఎస్సీకి కత్తిమీద సామే అయింది.
No comments:
Post a Comment