* ప్రధాన కార్యదర్శికి ప్రభుత్వ శాఖల నివేదిక
* ఆర్థిక శాఖ జాబితా రూపొందించాక భర్తీ ప్రక్రియ
హైదరాబాద్: ప్రభుత్వానికి ఇప్పటి వరకూ అందిన వివరాల ప్రకారం వివిధ శాఖల్లో 63,621 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. విద్యాశాఖలో 20,790, పోలీసు శాఖలో 10,730 ఖాళీలతో పాటు పలు ఇతర శాఖల్లోని వివరాలను ఏప్రిల్ 27న ఆయా శాఖల ఉన్నతాధికారులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మిన్నీమాథ్యూకి ఇచ్చిన నివేదికలో వెల్లడించారు. ఇంకా పలు శాఖల్లో ఖాళీల వివరాలు అందలేదు. వాటిని రెండు రోజుల్లో సమర్పించాలని ప్రధాన కార్యదర్శి ఆదేశించారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఆదేశాల మేరకు ఉద్యోగాల ఖాళీల వివరాల సేకరణకు ప్రధాన కార్యదర్శి ఏప్రిల్ 27న సచివాలయంలో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఆర్థిక శాఖతో పాటు ఇతర శాఖల అధికారులు హాజరయ్యారు. శాఖల వారీగా నివేదికలు ఇచ్చారు. అన్ని శాఖల నుంచి నివేదికలు అందాక వాటిని ఆర్థిక శాఖకు పంపిస్తామని, అక్కడ దస్త్రం రూపొందించి ముఖ్యమంత్రి ఆమోదం తీసుకొని భర్తీ ప్రక్రియ చేపడతామని ప్రధాన కార్యదర్శి చెప్పారు. గతంలో చేపట్టిన ఉద్యోగాల భర్తీ ప్రక్రియ వేగంగా సాగుతోందని ఈ సందర్భంగా ఆమె వెల్లడించారు.
ఖాళీల వివరాలు
పాఠశాల విద్యాశాఖ - 20,790; పోలీసు శాఖ - 10,730; రెవెన్యూ (భూపరిపాలన ప్రధాన కమిషనర్) - 6,095; ఇంటర్మీడియట్ విద్య - 2,898; ట్రాన్స్‌కో, డిస్కమ్‌లు - 3,208; కుటుంబ సంక్షేమం - 2,234; ఏపీ జెన్‌కో - 1,303; వైద్యవిధాన పరిషత్ - 974; వైద్య విద్య - 963; అగ్నిమాపక శాఖ - 886; ఆయుష్ - 729; కళాశాల విద్యాశాఖ - 685; గురుకుల విద్యా సంస్థలు - 684; అటవీ శాఖ - 600; ఉపాధి కల్పన - 577; వాణిజ్య పన్నుల శాఖ - 573; ట్రెజరీ - 407; జైళ్ల శాఖ - 383; ఎక్సైజ్ - 364; సర్వే - 342; పశుసంవర్థకం - 290; టౌన్‌ప్లానింగ్ - 288; సాంకేతిక విద్య - 286; నీటిపారుదల - 277; వ్యవసాయం - 236; ప్రజారోగ్యం - 225; పౌరసరఫరాలు - 223; రాష్ట్ర క్రీడాభివృద్ధి సంస్థ - 194; ప్రత్యేక భద్రత దళం (ఎస్పీఎఫ్) - 185; దేవాదాయ శాఖ - 180; ఉద్యానవన విశ్వవిద్యాలయం - 167; ఆప్కో - 162; రోడ్లు భవనాల శాఖ - 135; బీమా సంచాలకుల కార్యాలయం - 113; సాధారణ పరిపాలన శాఖ - 104; ఆర్థిక శాఖ - 103. ఇవి కాకుండా మరికొన్ని శాఖల్లో వంద కంటే తక్కువ పోస్టులు భర్తీ కావాల్సి ఉంది.