Thursday, December 13, 2012

ఎపిపిఎస్సిలో సంస్కరణలకు ప్రభుత్వం ఆమోదం

గ్రూప్ 2 ఎగ్జిక్యూటివ్ పోస్టులు గ్రూప్ 1బిలోకి మార్పు
ఇక గ్రూపు 2లో నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు మాత్రమే

ఏపీపీఎస్సీ సంస్కరణల్లో భాగంగా ఖాళీలను నోటిఫై చేసేందుకు వార్షిక క్యాలెండర్‌ను పాటించే నూతన విధానాన్ని అమలులోకి తెస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత విధానంలో సెప్టెంబర్ 1 నుంచి ఆగస్టు 31 వరకు ఖాళీ అయ్యే ఉద్యోగాలను యూనిట్ అధికారులు గుర్తించేవారు. తరువాత ఆర్థిక శాఖ క్లియరెన్స్‌కు పంపేవారు. ఆర్థిక శాఖ ఏపీపీఎస్సీకి గానీ, ఇతర నియామక సంస్థలకు గానీ నోటిఫికేషన్ విడుదల చేయాలని సూచించేది. ఈ ప్రక్రియలో అసాధారణ జాప్యం చోటుచేసుకుంటుండడం తో దీన్ని సంస్కరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందు కు వార్షిక క్యాలెండర్ పద్ధతి అనుసరించనున్నట్లు పేర్కొంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మిన్నీ మాథ్యూ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. అన్ని శాఖలు, ఏపీపీఎస్సీ ఇందుకు అనుగుణంగా చర్యలు చేపట్టాలని అందులో స్పష్టం చేశారు. గ్రూపు-1 పోస్టులను ఇకపై గ్రూపు-1ఎగా, గ్రూపు-2లోని ఎగ్జిక్యూటివ్ పోస్టులను గ్రూపు-2బిగా, గ్రూపు-2లోని నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులను గ్రూపు-2 పోస్టులుగా పరిగణించాలని మరో ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. అలాగే ఏయే పోస్టులకు మౌఖిక పరీక్షలు ఉండాలనే విషయాన్నీ పేర్కొన్నారు.

ఇదీ నూతన వార్షిక క్యాలెండర్...

అన్ని ప్రభుత్వశాఖల అధిపతులు తమ శాఖల్లో రాబోయే ఆర్థిక సంవత్సరంలో ఏర్పడే ఖాళీల వివరాలను నవంబర్ 30లోపు సాధారణ పరిపాలన శాఖకు సమర్పించాలి. ఈ ఏడాది మాత్రం ఈనెల 27లోపు సమర్పించాలి.

సచివాలయంలోని పరిపాలన విభాగం వివరాలను పరిశీ లించి వారం రోజుల్లో ఆర్థిక శాఖకు సిఫారసులు పంపాలి.
ఆర్థిక శాఖ ఆయా ప్రతిపాదనలను పరిశీలించి ఖాళీల భర్తీకి జనవరి 31లోపు క్లియరెన్స్ ఇవ్వాలి.
శాఖాధిపతులు ఫిబ్రవరి 28లోపు ఖాళీల వివరాలు ఏపీపీఎస్సీకి పంపాలి.
నియామకాల క్యాలెండర్‌ను మార్చి 31లోపు ఏపీపీఎస్సీ ఆమోదిస్తుంది. ఆ తరువాత నోటిఫికేషన్లు జారీ చేస్తుంది.

గ్రూప్-1, గ్రూప్-2 పోస్టుల పునర్విభజన..

పరీక్ష ప్రమాణాలను బట్టి ఇప్పటివరకు ఉద్యోగాలను గ్రూప్-1, గ్రూప్-2, గ్రూపు-4 సర్వీసెస్‌గా పేర్కొనేవారు. అవసరమైన పోస్టులకు మౌఖిక పరీక్షలు నిర్వహించేవారు. 1997 సంవత్సరంలో 20 కేటగిరీలను గ్రూప్-1లో చేర్చారు. 1999లో గ్రూప్-2ఎ, గ్రూప్-2బి కింద ఉన్న కేటగిరీలన్నింటినీ గ్రూప్-2 పోస్టులుగా మార్చారు. 2011 జూలై 27న జారీ చేసిన జీవో 420 ద్వారా గ్రూప్-1 మినహా మిగిలిన పోస్టులకు మౌఖిక పరీక్షలు మినహాయించారు. అయితే తాజా సంస్కరణల్లో భాగంగా ఇన్నాళ్లు గ్రూపు-1గా పేర్కొన్న పోస్టులను గ్రూపు-1ఎగా పరిగణిస్తారు. గ్రూప్-2లోని ఎగ్జిక్యూటివ్ పోస్టులను గ్రూప్-1బిగా పరిగణిస్తారు. ఈ 2 కేటగిరీలకు ఒకే విధమైన పరీక్ష ఉంటుంది. గ్రూప్-2లోని ఎగ్జిక్యూటివ్ పోస్టులు ప్రాధాన్యమైనవే కాకుండా గ్రూప్-1కు మాదిరిగానే డిగ్రీ అర్హతతో పరీక్ష రాసేవి. ఈ ఉద్యోగాలకు ప్రజా సంబంధాల నైపుణ్యాలు అవసరం. అందుకే వీటిని గ్రూప్-1బి సర్వీసుగా పరిగణించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు 1967లో జారీ చేసిన జీవో 103ను సవరిస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. దీని ప్రకారం....

గ్రూప్ 1 (ఎ) పోస్టులు..

1. డిప్యూటీ కలెక్టర్ (ఏపీ సివిల్ సర్వీసెస్-ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్), 2. డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్-కేటగిరీ2(ఏపీ పోలీస్ సర్వీసు), 3. కమర్షియల్ టాక్స్ ఆఫీసర్(ఏపీ కమర్షియల్ టాక్స్ సర్వీసెస్), 4. రీజినల్ ట్రాన్స్‌పోర్ట్ ఆఫీసర్(ఏపీ ట్రాన్స్‌పోర్ట్ సర్వీసు), 5. డిప్యూటీ రిజిస్ట్రార్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్(ఏపీ కోఆపరేటివ్ సర్వీసెస్), 6. జిలా పంచాయతీ అధికారి(ఏపీ పంచాయత్ సర్వీసెస్), 7. జిల్లా రిజిస్ట్రార్లు(ఏపీ రిజిస్ట్రేషన్ సర్వీసెస్), 8. డివిజినల్ ఫైర్ ఆఫీసర్(ఏపీ ఫైర్ సర్వీసెస్), 9. డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ జైల్స్(మెన్)(ఏపీ జైళ్ల సర్వీసు), 10. అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్(ఏపీ లేబర్ సర్వీసు), 11. అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్(ఏపీ ఎక్సైజ్ సర్వీసు), 12. మున్సిపల్ కమిషనర్-గ్రేడ్2(ఏపీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సర్వీసు), 13. జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి(ఏపీ సోషల్ వెల్ఫేర్ సర్వీసు), 14. జిల్లా బీసీ సంక్షేమ అధికారి(అసిస్టెంట్ డెరైక్టర్ సహా)(బీసీ వెల్ఫేర్ సర్వీస్), 15. జిల్లా గిరిజన సంక్షేమ అధికారి(ట్రైబల్ వెల్ఫేర్ సర్వీస్), 16. జిల్లా ఉపాధి కల్పనాధికారి(ఏపీ ఎంప్లాయిమెంట్ సర్వీస్), 17. లే సెక్రటరీ అండ్ ట్రెజరరీ గ్రేడ్-2(ఏపీ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్), 18. అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్/అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్(ఏపీ ట్రెజరీస్, అకౌంట్స్ సర్వీసు), 19. అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్(ఏపీ స్టేట్ ఆడిట్ సర్వీసు), 20. మండల పరిషత్ డెవలప్‌మెంట్ ఆఫీసర్(పంచాయత్‌రాజ్, గ్రామీణాభివృద్ధి సర్వీసు).

గ్రూప్-1 (బి) ఉద్యోగాలు ఇవీ..

1. గ్రేడ్-3 మున్సిపల్ కమిషనర్, 2. అసిస్టెంట్ కమర్షియల్ టాక్స్ ఆఫీసర్, 3. డిప్యూటీ తహశీల్దార్, 4. గ్రేడ్-2 సబ్ రిజిస్ట్రార్, 5. జూనియర్ ఎంప్లాయిమెంట్ ఆఫీసర్, 6. అసిస్టెంట్ రిజిస్ట్రార్, 7. అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్, 8. ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్(రూరల్ డెవలప్‌మెంట్), 9. ఎక్సైజ్ సబ్ ఇన్‌స్పెక్టర్, 10. ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్-2.

గ్రూప్-1బిలోని 1, 10 క్రమసంఖ్యలో ఉన్న పోస్టులు జోనల్ పోస్టులు. గ్రూప్-1ఎ, గ్రూప్-1బి పోస్టులకు ఒకే పరీక్ష ఉంటుంది. దీనిలో ప్రతిభ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

గ్రూప్-2 సర్వీసెస్..

1. సీనియర్ అకౌంటెంట్, 2. ఆడిటర్, 3. సీనియర్ అకౌంటెంట్, 4. సీనియర్ ఆడిటర్, 5. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్(ఏపీ సెక్రటేరియట్ సబ్ సర్వీసు), 6. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్(ఏపీ లెజిస్లేచర్ సబ్ సర్వీసు), 7. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్(ఆర్థిక శాఖ, ఏపీ సెక్రటేరియట్ సబ్ సర్వీసు), 8. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్(న్యాయ శాఖ, ఏపీ లెజిస్లేచర్ సబ్ సర్వీసు), 9. అసిస్టెంట్ ఆడిటర్ 10. టైపిస్ట్ కమ్ అసిస్టెంట్( ఏపీ సెక్రటేరియట్ సబ్ సర్వీసు), 11. టైపిస్ట్ కమ్ అసిస్టెంట్(ఏపీ లెజిస్లేచర్ సబ్ సర్వీసు), 12. టైపిస్ట్ కమ్ అసిస్టెంట్(ఆర్థిక శాఖ, ఏపీ సెక్రటేరియట్ సబ్ సర్వీసు), 13. టైపిస్ట్ కమ్ అసిస్టెంట్(న్యాయశాఖ, ఏపీ సెక్రటేరియట్ సబ్ సర్వీసు), 14. టైపిస్ట్ కమ్ అసిస్టెంట్( శాఖాధిపతులు, ఏపీ మినిస్టీరియల్ సర్వీసు), 15. జూనియర్ అసిస్టెంట్( శాఖాధిపతులు, ఏపీ మినిస్టీరియల్ సర్వీసు), 16. జూనియర్ అకౌంటెంట్(ఏపీ ట్రెజరీస్, అకౌంట్స్), 17. జూనియర్ అకౌంటెంట్(ఏపీ లైఫ్ ఇన్సూరెన్స్ సబ్ సర్వీసు).

గ్రూప్-2లోని క్రమసంఖ్య 2, 5 నుంచి 17 వరకు గల పోస్టులు రాష్ట్ర స్థాయి పోస్టులు. 1 నుంచి 17 వరకు గల క్రమసంఖ్యల్లో ఉన్న పోస్టులన్నీ నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు. కేవలం రాతపరీక్షలో ప్రతిభ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

మౌఖిక పరీక్షలు వీటికే...

గ్రూప్-1ఎ, గ్రూప్-1బి కేటగిరీ పోస్టులతో పాటు కింది పోస్టులకు మౌఖిక పరీక్షలు ఉంటాయని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.

గెజిటెడ్ కేటగిరీ..

1. అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ ఎండోమెంట్స్, 2. అసిస్టెట్ డెరైక్టర్ ఆఫ్ మార్కెటింగ్ , 3. చైల్డ్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్, 4. అసిస్టెంట్ డెరైక్టర్ ఆఫ్ ఇండస్ట్రీస్, 5. డీఎస్పీ(కమ్యూనికేషన్స్), 6. అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్, 7. హెడ్ ఆఫ్ సెక్షన్స్ ఇన్ మైనింగ్ ఇంజినీరింగ్ సర్వీస్ ఇన్ గవర్నమెంట్ పాలిటెక్నిక్స్, 8. అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్, 9. అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్, 10. అసిస్టెంట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్, 11. జూనియర్ లె క్చరర్స్, 12. జూనియర్ లెక్చరర్స్ ఇన్ పాలిటెక్నిక్ కాలేజెస్, 13. లెక్చరర్స్ ఇన్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజెస్, 14. డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్స్, 15. లెక్చరర్స్ ఇన్ రేడియాలాజికల్ ఫిజిక్స్ ఇన్ ఏపీ మెడికల్ సర్వీసెస్.

నాన్ గెజిటెడ్ పోస్టులు..
1. ఇండస్ట్రియల్ ప్రమోషన్ ఆఫీసర్, 2. అసిస్టెంట్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్, 3. సూపర్‌వైజర్ (మహిళ శిశు సంక్షేమ శాఖ), 4. సూపరింటెండెంట్, చిల్డ్రన్స్ హోమ్స్, డబ్ల్యూ అండ్ సీడబ్ల్యూ డిపార్ట్‌మెంట్. అయితే ఈ మౌఖిక పరీక్షలు ఇప్పటికే జారీ అయిన, ప్రక్రియ కొనసాగుతున్న నోటిఫికేషన్లకు వర్తించవు. కొత్తగా జారీ చేసే నోటిఫికేషన్లకే వర్తిస్తాయి. ఈ మేరకు ఏపీపీఎస్సీ చర్యలు చేపట్టాలని సర్కారు ఆదేశించింది.

GROUP 4 FINAL KEY



Key for Notification No. 38/2011 Dt: 28/12/2011 , GROUP-IV SERVICES (38/2011):Paper-1 SERIES: A 400 - GENERAL STUDIES - Final Key

Key for Notification No. 38/2011 Dt: 28/12/2011 , GROUP-IV SERVICES (38/2011): Paper-2 SERIES: A401- SECRETARIAL ABILITIES - Final key

PLEASE POST GROUP 4 FINAL KEY MISTAKES IN COMMENT BOX AND DON'T ACCEPT THIS FINAL KEY

ఏపీపీఎస్సీ గ్రూప్-4 ఫైనల్ కీ వివాదంగా మారింది. ఫైనల్‌ కీలో తొమ్మిది తప్పులున్నాయని అభ్యర్థుల ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఏపీపీఎస్సీ సభ్యులను గ్రూప్-4 అభ్యర్థులు కలిశారు. తమకు తెలియకుండానే ఫైనల్ కీ ఇచ్చారని అభ్యర్థులకు ఏపీపీఎస్సీ సభ్యులు తెలిపారు.

Saturday, December 8, 2012

చక్కగా తెలుగు లాగే ఇంగ్లిష్ నేర్చుకోండి

ఇంగ్లండు రచయిత శామ్యూల్స్ జాన్సన్ "Language is the dress of thought" భావం శరీరమైతే, భాష వస్త్రం లాంటిదని ఆయన భావన. రాసే భాషకైనా, మాట్లాడే భాషకైనా ఇది వర్తిస్తుంది. అలాని రాసే భాష, మాట్లాడే భాష ఒకటి కాదు. రెండూ ఒకటిగా భావించి, రాసే విధంగా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాం. తద్వారా మాట్లాడే భాషలో సహజత్వంతోపాటు, ఒరవడి (Fluency) లోపిస్తుంది. కారణం రాసే భాష రికార్డెడ్ ప్రోగ్రామ్ లాంటిది. మాట్లాడేటప్పుడు ప్రతి క్షణం అప్రమత్తంగా ఉండాల్సిందే. రెండింటికీ చెప్పే భావం ఒకటయినా, కుడి ఎడమలకు ఉన్నంత తేడా ఉంటుంది.

మనం చదువుతున్న ఇంగ్లిష్ భాష నేర్పే విధంగా కాకుండా, పాండిత్యం పెంచే విధంగా ఉంది. మరోలా చెప్పాలంటే నడవటం రాని వాడికి ఉరకటం నేర్పినట్టుగా ఉంది. Listening  Speaking  Reading  Writing (LSRW) భాష నేర్చుకునేందుకు రహదారి లాంటిది. అలా కాకుండా అడ్డదారి Reading  Writing (RW) లో వెళితే కష్టాలు, నష్టాలే కాకుడా గమ్యం కూడా చేరలేం. ఇంగ్లిష్ పరాయి భాషగా నేర్చుకుంటున్న మనలాంటి దేశాల్లో ఇలానే జరుగుతుంది. గ్రామర్‌తో కుస్తీపడి ఏ కొద్ది మందో ఇంగ్లిష్ నేర్చుకున్నా, వారు మాట్లాడే భాషలో ఉండవలసిన సహజత్వం కానీ, ఒరవడి కానీ ఉండదు. రాసే భాష ప్రభావం మాట్లాడే భాషపై ఉండటం మూలంగా ఇలా జరుగుతుంది. ఇంగ్లిష్ తెలుగులాగా మాట్లాడేందుకు ఈ వారం ‘‘స్పీచ్ మెకానిజం’’ గురించి తెలుసుకుందాం.

స్పీచ్ మెకానిజం

వెర్బల్ కమ్యూనికేషన్ (మాటల ద్వారా వ్యక్తీకరణ)

మాటలతో కూడిన భావ వ్యక్తీకరణను వెర్బల్ కమ్యూనికేషన్ అంటాం. మాట్లాడే భాష విడి పదాల రూపంలో కాకుండా, పద బంధాల రూపంలో నేర్చుకోవాలని ఇంతకు ముందే అనుకున్నాం. వ్యవహారిక భాష రాసే భాషలాగా కాకుండా వినే వారిని కలుపుకొని పోయే విధంగా ఉండాలి. ఇందుకు మాట్లాడే భాషలో మూడు ముఖ్యమైన అంశాలు వుండాలి.

1. Conversation Starters

2. Conversation Fillers

3. Conversation Expressions

1.Conversation Starters

వ్యవహారిక భాష పెద్దపెద్ద వాక్యాలతో మొదలు కాకూడదు. మొదటి మాటలు మాట్లాడే వారి మధ్య రాపోర్ట్ పెంపొం దించే విధంగా వుండాలి. మొదటి మాటతోనే మంచి సంభాషణకు పునాది పడాలి. ఉదాహరణకి Good Morning/Good Afternoon/ Good Evening, Hello, Hi, yes, No, Well, of Course, I think, In my Opinion, The Thing is, My Point is లాంటి మాటలతో సంభాషణలను ప్రారంభించవచ్చు. ఎక్కడై నా మంచి స్టార్టర్స్ వింటే, నేర్చుకొని వాటిని మీరు కూడా వాడవచ్చు.

మాట్లాడే భాషకు భావం ముడిసరుకు వంటిది. భావానికి భాషా రూపం ఇవ్వటం ముడిసరుకును వినియోగ వస్తువుగా మార్చటం లాంటిది. భావ వ్యక్తీకరణ (communcation) వినియోగదారుడుకి ఫైనల్ ప్రొడక్ట్ ను చేర్చటం లాంటిది. మాట్లాడే భాషలో ఈ మొత్తం వ్యవహారం క్షణ కాలంలో జరిగి పోవాలి. ఏంచెప్పాలో బుద్ధి (Intellect ) ఆమోదంతో కాన్షియస్ మైండు నిర్ణయిస్తుంది. సబ్‌కాన్షియస్ మైండ్‌లో గత అనుభవాల మూలంగా పొందు పరచబడిన భాషా పరిజ్ఞానం ఆధారంగా ఎలా చెప్పాలో కూడా కాన్షియస్ మైండు నిర్ణయిస్తుంది. చివరగా కాన్షియస్ మైండు ఆజ్ఞాను సారంగానే వెర్పల్, నాన్‌వెర్పల్ విధానాల్లో భావ వ్యక్తీకరణ జరుగుతుంది. అలవాటుగా మారిన తర్వాత సబ్ కాన్సియస్ మైండు పరిధిలోకి వెళుతుంది.

తెలుగు మాతృభాషగా గల మనం చెప్పదలచుకున్న భావాన్ని యధాలాపంగా తెలుగులో అనుకుంటాం. ఆ తర్వాత ఇంగ్లిష్‌లోకి అనువదించుకుంటాం. ఇలా అనువాదం ద్వారా మాట్లాడే ఇంగ్లిష్ సహజత్వం కోల్పోతుంది. మాట్లాటంలో ఒరవడి (Fluency) కూడా లోపిస్తుంది. ఇలా మాట్లాడే ఇంగ్లిష్‌లో మాతృభాష ప్రభావం కూడా చాలా ఉంటుంది. ఇలా జరగటానికి కారణం మనం ఇంగ్లిష్‌ను, ఇంగ్లిష్ ద్వారా కాకుండా తెలుగు ద్వారా నేర్చుకోవడం, సహజంగా నేర్చుకోకుండా గ్రామర్ ద్వారా నేర్చుకోవటం. విడి పదాలకు బదులుగా పద బంధాలను (Expressions) నేర్చుకుంటే గ్రామర్ ప్రమేయం లేకుండా, అనువాద అవసరం లేకుండానే తెలుగులాగే ఇంగ్లిష్ ధారాళంగా మాట్లాడవచ్చు.

2. Conversation Fillers

సంభాషణ ఉపన్యాసం లాంటిది కాదు. సంభాషణలో చెప్పే వారితో పాటు వినే వారు కూడా ఉత్సాహంగా పాల్గొంటారు. మాట్లాడేట ప్పుడు అనుకోకుండా మధ్యలో వచ్చే వ్యవధిలో ఫిల్లర్స్ వాడటం ద్వారా ధారాళంగా మాట్లాడి నట్టుగానూ, వినేవారికి ఇంపుగానూ వుంటుంది. ఫిల్లర్స్ తప్పక వాడాలని నియమం లేదు. కానీ వాడటం మూలంగా సంభాషణ సహజంగా వుంటుంది. you know, you see, like, and, so, therefore లాంటి పదాలను ఫిల్లర్స్‌గా వాడవచ్చు.

3. Conversation Expressions

భాష పదాల రూపంలో కాకుండా పద బంధాల రూపంలో నేర్చుకోవాలని ఇంతకు ముందే చెప్పుకున్నాం. ఇలా నేర్చుకుంటే గ్రామర్ అవసరం లేకుండానే, తెలుగు నుండి అనువాదం అవసరం లేకుండానే సహజంగా ఇంగ్లిష్‌లో మాట్లాడవచ్చు. ఇలా పద బంధాలను నేర్చుకొని మాట్లాడటం ద్వారా గ్రామర్ పరిజ్ఞానం కూడా వస్తుంది. తెలుగులో వ్యాకరణం నేర్చుకోకుండానే, నిరక్షరాస్యులు సైతం వ్యాకరణ బద్దంగా మాట్లాడటానికి ఇదే కారణం.

మోడల్ ఎక్స్‌ప్రెషన్స్

1. How are you?

2. What is the Time?

3. What do you do for Living?

4. I am at home

5. He looks handsome

మీరు ఇతరులు మాట్లాడుతున్నపుడు చిన్న వాక్యాలను లేదా పుస్తకాలలో చదివిన వాక్యాలను నేర్చుకోవటం ద్వారా, మళ్ళీ మళ్ళీ వాటిని గుర్తుకు తెచ్చుకుంటే అవస రమైనపుడు వాడగలుగు తారు. ఏ భాషనైనా ఇదే రకంగా నేర్చుకుంటారు. ఈ విషయంలో మరిన్ని మెళకువలు తరువాతి భాగాలలో తెలుసుకుందాం. అంతవరకు, వినేప్పు డైనా, చదివేటప్పుడైనా తారసపడే వాడుకకు ఉపయోగపడే ఎక్స్‌ప్రెషన్స్ నేర్చుకోండి.

Tone : కంఠస్వరంలో హెచ్చుతగ్గులను ‘పిచ్’ అంటారు. మాట్లాడేటప్పు డు ‘పిచ్’ మార్చటం ద్వారా వ్యక్తం చేసే భావాలు మారిపోతాయి. Pause అంటే మాటల మధ్య వ్యవధి. మాట్లాడేటప్పుడు Pause సరిగ్గా వుపయోగించే వారని మాజీ ప్రధాన మంత్రి వాజ్‌పాయ్‌కి మంచి పేరుంది.

Body Language : బాడీ లాంగ్వేజ్‌లో ఫేషియల్ ఎక్స్‌ప్రెషన్స్, గెశ్చర్స్ ముఖ్యమైనవి. భాషరాని సినిమాలు చూసి కూడా కథను మనం అర్థం చేసుకోగలుగుతాం. ఇతరులను అనుకరించటం ద్వారా ఈ అంశాలను బాగా నేర్చుకోచ్చు. భావ వ్యక్తీకరణలో వీటి పాత్ర గణనీయంగా ఉంటుంది.

మాట్లాడటం ద్వారానే మాట్లాడటం వస్తుందన్న ప్రాథమిక సత్యాన్ని గుర్తుంచుకొని, ఈ క్షణం నుండే మాట్లాడటం మొదలు పెట్టండి. చదువుకు, వయస్సుకు సంబంధం లేకుండా ఎవరైతే మాట్లాడటం ప్రారంభించారో వారందరికి ఇంగ్లిష్ వచ్చేసింది. ఈ శీర్షిక మీ ప్రయత్నానికి ఒక దిక్చూచి లాంటిది. వచ్చేవారం మాట్లాడ టానికి సంబంధించి మరిన్ని శాస్త్రీయ, వాస్తవిక విషయాలు తెలుసుకుందాం.

గ్రామర్ లేకుండా ఇంగ్లిష్

మీకు ఆశ్చర్యకరంగా అన్పించవచ్చు గానీ మీరు చేసే వ్యక్తీకరణలో మాటల పాత్ర కేవలం 10 శాతమే. మిగతా అంతా మీ హావభావాలు, శరీరభాషతో అర్థంచేసుకుంటారు. అయినా మనం ఇంగ్లిష్ దగ్గరకు వచ్చేసరికి గ్రామర్ నేర్చుకోవడం ద్వారా మాట్లాడాలనుకుంటాం. అక్కడే బోర్లాపడతాం. ఇంగ్లిష్ గ్రామర్ సులభం కాకపోవడంతో అడుగు ముందుకు పడదు. మాటలు పెదవి దాటిరావు. అందుకే నమస్తే తెలంగాణ టర్నింగ్ పాయింట్ ఒక కొత్త ప్రయోగం చేస్తోంది. గ్రామర్ నేర్చుకోవాల్సిన అవసరం లేకుండా ఇంగ్లిష్ నేర్పే ప్రయత్నం ఇది.

- 15-16 ఏళ్ళ పాటు సిన్సియర్‌గా ఇంగ్లిష్ చదివి మంచి మార్కులు తెచ్చుకున్నా నోరు విప్పి నిమిషం పాటు ఆ భాషలో మాట్లాడలేకపోతున్నామంటే ఆ విధానం లోనే లోపం ఉందన్న మాట.

- ప్రపంచంలో ఏ భాషనైనా ఆ భాష మాతృభాషగా గల వారు ముందు గ్రామర్ నేర్చుకొని ఆపై తమ భాష మాట్లాడటం జరుగడం లేదు. అంతెందుకు మనం తెలుగు మాట్లాడటం వినడం ద్వారా, అనుకరణం ద్వారా నేర్చుకున్నామే తప్ప ముందు తెలుగు భాషా వ్యాకరణ పుస్తకాలు కంఠస్థం పట్టలేదు.

- అందుకే గ్రామర్ లేకుండా ఇంగ్లిష్ అనే కొత్త ప్రక్రియ పట్ల మానసిక సంసిద్ధత పెంచుకుందాం.

- ఏ భాషనైనా రాయడం వేరు. మాట్లాడటం వేరు. రాయడం రికార్డెడ్ ప్రోగ్రామ్ వంటిది. అదే మాట్లాడటం లైవ్ ప్రోగ్రాం వంటిది.

- మనం ఎదుటి వ్యక్తికి ఏం చెప్పినా మనం మాటల ద్వారా గ్రహించేది 10 శాతం - మిగతా అంతా మన హావభావాలు, శరీర భంగిమలు తదితర వ్యక్తీకరణల ద్వారానే.

- ఆ పది శాతం మాటల ప్రయోగం లోనూ వివిధ సౌలభ్యాలుంటాయి. వాటిని ఉపయోగించటం ద్వారా ఇంగ్లిష మాట్లాడటాన్ని సులభతరం చేసుకోవచ్చు.

- కాన్వర్జేషన్ స్టార్టర్స్, ఫిల్లర్స్ ఎవరు ఉపయోగిస్తున్నా గ్రహించి వాటిని మీరూ ఉపయోగించేలా సాధన చేయండి.