Friday, May 3, 2013

విజ్ఞ్యాపన పత్రం

Friends please send this letter to APPSC chairman and helpdesk   appschelpdesk@gmail.com, appscchair@yahoo.in


To                                                                                                                                     తేది: 03/05/2013
శ్రీయుత గౌరవనీయులైన
శ్రీ చిత్తరంజన్ బిస్వాల్ IAS గారు
ఏపిపిఎస్సి చైర్మన్,
హైదరాబాద్ .

విషయం: గ్రూప్ – 2 (నోటిఫికేషన్ నెం : 39/2011) నాన్ ఎగ్జిక్యుటివ్ పోస్టుల భర్తీ ప్రక్రియను వేగవంతం చేయడం కోసం.

నమస్కారములతో.....

గ్రూప్ – 2 (నోటిఫికేషన్ నెం : 39/2011) నాన్ ఎగ్జిక్యుటివ్ ఎంపిక ప్రక్రియలో జరుగుతున్న జాప్యాన్ని నివారించి ఎంపిక ప్రక్రియను వేగవంతం చేస్తారనే ఉద్దేశంతో ఈ విజ్ఞ్యాపన పత్రం ద్వారా మీ దృష్టికి కొన్ని విషయాలను తీసుకువస్తున్నాము.

నోటిఫికేషన్ ను విడుదల చేసిన తేది : 29/12/2011

పరీక్ష నిర్వహించబడిన తేది : 21/07/2012 & 22/07/2012

ఎగ్జిక్యుటివ్ పోస్టుల భర్తీ కొరకై సర్టిఫికేట్ వెరిఫికేషన్ లిస్టు ను విడుదల చేసిన తేది : 11/03/2013

ఎగ్జిక్యుటివ్ పోస్టుల భర్తీ కొరకై ఎంపిక కాబడిన అభ్యర్థుల జాబితాను విడుదల చేసిన తేది : 17/04/2013

నాన్ ఎగ్జిక్యుటివ్ పోస్టుల భర్తీ కొరకై సర్టిఫికేట్ వెరిఫికేషన్ లిస్టు ను విడుదల చేసిన తేది : వెలువడలేదు

నాన్ ఎగ్జిక్యుటివ్ పోస్టుల భర్తీ కొరకై ఎంపిక కాబడిన అభ్యర్థుల జాబితాను విడుదల చేసిన తేది : వెలువడలేదు


గ్రూప్ – 2 నోటిఫికేషన్ (నెం : 39/2011) లోని ఎగ్జిక్యుటివ్ మరియు నాన్ ఎగ్జిక్యుటివ్ పోస్టుల భర్తీ కై పరీక్ష జరిగి 9 నెలల పైనే అవుతున్న ఇప్పటివరకు కేవలం ఎగ్జిక్యుటివ్ పోస్టుల భర్తీ ప్రక్రియ మాత్రమే పూర్తైనది కానీ నాన్ ఎగ్జిక్యుటివ్ పోస్టుల భర్తీ ప్రక్రియ ఇప్పటికి మొదలు కాలేదు దీనితో అభ్యర్తులు తీవ్ర ఒత్తిడికి మరియు మనోవేదనకు లోనవుతున్నారు. తీవ్రమైన ఒత్తిడి మూలంగా అభ్యర్థుల్లో కొందరు వచ్చే నోటిఫికేషన్ కొరకై ఏకాగ్రతతో చదవలేక, వేరే ప్రైవేటు ఉద్యోగాలకు వెళ్ళలేక ప్రిపరేషన్ పరంగాను మరియు ఆర్థికంగాను తీవ్రంగా నష్టపోతూ నరకయాతన అనుభవిస్తున్నారు.

భర్తీ ప్రక్రియ ఎక్కడివరకు వచ్చిందో తెలుసుకోవాలనుకునే అభ్యర్థులకు సరైన సమాచారం లబించడంలేదు. సమాచారం కోసం PRO cell కూ ఫోన్ చేసిన లేదా అభ్యర్థులు స్వయంగా ఎపిపిఎస్సి ఆఫీస్ కు వచ్చిన వారికీ చేదు అనుభవాలే మిగులుతున్నయి కానీ సరైన సమాచారం లబించడంలేదు.

అభ్యర్థుల మనోవేదనను సహృదయంతో అర్థం చేసుకొని గ్రూప్ – 2 నాన్ ఎగ్జిక్యుటివ్ ఎంపిక ప్రక్రియలో జరుగుతున్న జాప్యాన్ని నివారించి ఎంపిక ప్రక్రియను వేగవంతం చేస్తారని ఆశిస్తూ.

ఇట్లు

గ్రూప్ – 2 అభ్యర్థులు