విజ్ఞప్తి
గ్రూప్ – 2 2011 ఉద్యోగాల ఎంపిక కొరకై సర్టిఫికేట్ వెరిఫికేషన్ కు హాజరు అవుతున్న అభ్యర్థులందరికీ ఒక మనవి, ముఖ్యంగా ఇదివరకే ప్రభుత్వ ఉద్యోగాలు పొంది ఉన్నత పదవులకై ఈ పరీక్షను వ్రాసిన అభ్యర్థులకు మనవి చేసేది ఏమనగా, మీరు చెక్ లిస్టు ఫారం నింపే ముందు మీ సోదర నిరుద్యోగ మిత్రుల గురించి ఒక్క క్షణం ఆలోచించండి. మీరు అంగీకరం(Preference) తెలిపిన పోస్టులలో కచ్చితంగా చేరుతాను అని అనుకొన్న పోస్టులకు మాత్రమే మీ అంగీకారాన్ని తెలపండి. మీకు ఇష్టం లేని పోస్టులకు ఒకవేళ మీరు ఆ పోస్టులకు ఎంపిక అయినప్పటికీ కూడా చేరను అనుకొన్న వాటికీ మీ అంగీకారం తేలపవద్దు వాటిని ఖాళీగా(Blank) వదిలివేసి వాటిని “నాట్ విల్లింగ్” జాబితాలో మాత్రం స్పష్టంగా పేర్కొనండి. దీనివల్ల ఇదివరకు ఏ ఉద్యోగం లేని కొందరు అభ్యర్థులు ఆ ఉద్యోగాలను పొందుతారు.
ఉదాహరణకు గ్రూప్ – 2 2011 నోటిఫికేషన్ లో 7 ఎగ్జిక్యుటివ్ పోస్టులు ఉన్నపటికీ అందులో ఒకటి లేదా రెండు పోస్టులకు మాత్రమే ఇది వరకే ఉద్యోగాలు పొందిన అభ్యర్థులు ఆసక్తి చూపిస్తారు కానీ, మిగిలిన పోస్టుల పై అంతగా ఆసక్తి చూపించరు. ఒకవేళ మీరు చెక్ లిస్టు ఫారంలో ఈ 7 ఎగ్జిక్యుటివ్ పోస్టులన్నిటికీ అంగీకారం తెలిపి ఫైనల్ సెలక్షన్ లిస్టులో మికు ఆసక్తి లేని పోస్టుకు మీరు ఎంపిక కాబడినట్లైతే మీకు ఆ పోస్టుపై ఆసక్తి లేదు కనుక మీరు ఆ పోస్టులో చేరకపోవటంతో ఆ పోస్టు నాన్ జాయినింగ్ పోస్టుగా మిగిలిపోయి తరువాత నోటిఫికేషన్ కి క్యారీ ఫార్వర్డ్ అవుతున్నది. దీనివల్ల మీ తరువాత ఉన్నటువంటి ఏ ఉద్యోగం లేని మన నిరుద్యోగ మిత్రులు నష్టపోతున్నారు. ఇలా ప్రతి గ్రూప్ – 2 నోటిఫికేషన్లో కనీసం నూటయబై ఉద్యోగాల వరకు వృదాగా మిగిలిపోతున్నాయి.
అందుకే ఇదివరకే ఉద్యోగాలు పొంది ఉన్న అభ్యర్థులకు మనవి చేసేది ఏమనగా మీరు ఖచ్చితంగా చేరుతాను అని అనుకొన్న పోస్టులకు మాత్రమే మీ అంగీకారాన్ని తెలిపి మిగిలిన వాటిని దయచేసి ఖాళీగా వదిలివేసి ఒక నిరుద్యోగ మిత్రుడికి సహాయం చేయండి. నిరుద్యోగ సమస్య తీవ్రత గుర్తించి, ఆసక్తి లేని పోస్టులను “నాట్ విల్లింగ్” జాబితాలో స్పష్టంగా పేర్కొనండి.
ఇట్లు
దీటి శ్రీకాంత్
దీటి శ్రీకాంత్